తణుకు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

తణుకు శాసనసభ నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లాలో గలదు. ఇది నరసాపురం లోకసభ నియోజకవర్గంలో భాగం.

తణుకు
—  శాసనసభ నియోజకవర్గం  —
తణుకు is located in Andhra Pradesh
తణుకు
తణుకు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశము భారత దేశం
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

చరిత్ర సవరించు

నియోజకవర్గం ఏర్పడిననాటి నుంచి 2009 వరకూ తణుకు, ఉండ్రాజవరం, పెరవలి మండలాలు, పెంటపాడు మండలంలో మరికొన్ని గ్రామాలతో కలిపి తణుకు నియోజకవర్గంగా ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా అత్తిలి శాసనసభ నియోజకవర్గాన్ని రద్దుచేసి అత్తిలి మండలాన్ని తణుకు నియోజకవర్గంలో కలిపారు. అప్పటివరకూ ఈ నియోజకవర్గంలోనే ఉన్న ఉండ్రాజవరం మండలాన్ని నిడదవోలు నియోజకవర్గంలోకి చేర్చారు. పెనుగొండ నియోజకవర్గంలో ఉన్న ఇరగవరం మండలాన్ని తణుకు నియోజకవర్గంలో కలపడంతో ప్రస్తుత స్థితిలోని తణుకు శాసనసభ నియోజకవర్గం ఏర్పాటైంది.

నియోజకవర్గంలోని మండలాలు సవరించు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు సవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[1]

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2019 61 తణుకు జనరల్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు పు వైసీపీ 75975 ఆరిమిల్లి రాధాకృష్ణ పు తె.దే.పా 73780
2014 61 తణుకు జనరల్ ఆరిమిల్లి రాధాకృష్ణ M తె.దే.పా 101015 చీర్ల రాదయ్య పు వైసీపీ 70067
2009 180 తణుకు జనరల్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు M INC 53211 యలమర్తి తిమ్మరాజా (వైటీ రాజా) M తె.దే.పా 51760
2004 65 తణుకు జనరల్ Chitturi Bapineedu M INC 65189 యలమర్తి తిమ్మరాజా (వైటీ రాజా) M తె.దే.పా 59812
1999 65 తణుకు జనరల్ యలమర్తి తిమ్మరాజా (వైటీ రాజా) M తె.దే.పా 70574 Burugupalli Chinnarao M INC 46727
1994 65 తణుకు జనరల్ Mullapudi Venkata Krishnarao M తె.దే.పా 60833 Ch. Achutharama Prasad M INC 38277
1989 65 తణుకు జనరల్ Mullapudi Venkata Krishnarao M తె.దే.పా 57050 Chitturi Bapi Needu M INC 47669
1985 65 తణుకు జనరల్ Venkata Krishnarao Mullapudi M తె.దే.పా 57184 Anantha Ramamurty, Karuturi M INC 25285
1983 65 తణుకు జనరల్ Chitturi Venkareswara Rao M IND 39501 Satyanarayana Murthy Gannamani M IND 35403
1978 65 తణుకు జనరల్ Kantioydu Appa Rao M INC (I) 35393 Gannamani Satyanarayana Murty M INC 21331
1967 65 తణుకు జనరల్ G. Satyanarayana M IND 36157 M.H. Prasad M INC 29276
1962 69 తణుకు జనరల్ Mullapudi Harischandraprasad M INC 31771 Chitturi Indraiah M IND 31660
1955 59 తణుకు జనరల్ Mullapudi Harischandraprasad M INC 26586 Chitturi Subbarao Choudary M CPI 19706

నియోజకవర్గం నుంచి శాసనసభ్యులు సవరించు

1952 ఎన్నికలు సవరించు

1952లో నిర్వహించిన ఎన్నికల్లో కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీకి చెందిన చిట్టూరి ఇంద్రయ్య తన సమీప ప్రత్యర్థిపై 6,313 ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యారు. 1952 ఎన్నికలు భారత ప్రజాస్వామ్య చరిత్రలో రాజ్యాంగం ఏర్పాటయ్యాకా నిర్వహించిన తొలి ఎన్నికలు.

1955 ఎన్నికలు సవరించు

1955లో నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన పారిశ్రామికవేత్త ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ తన సమీప ప్రత్యర్థిపై 6,862 ఓట్ల మెజారిటీతో శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఏర్పాటైన ఆంధ్రరాష్ట్రానికి తొలి, చివరి ఎన్నికలు కావడం విశేషం. అనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్ అవతరించింది.

1962 ఎన్నికలు సవరించు

1962లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పారిశ్రామికవేత్త ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ తన సమీప ప్రత్యర్థిపై 119 ఓట్ల మెజారిటీతో గెలుపొంది శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అతి తక్కువ మెజారిటీ ఇదే కావడం విశేషం.

1967 ఎన్నికలు సవరించు

1967లో నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన గన్నమని సత్యనారాయణమూర్తి 6,889 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

1972 ఎన్నికలు సవరించు

1972లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గన్నమని సత్యనారాయణమూర్తి తన సమీప ప్రత్యర్థిపై 29,493 ఓట్ల మెజారిటీతో గెలుపొంది శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.

1978 ఎన్నికలు సవరించు

1978లో నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కంటిపూడి అప్పారావు 14,062 ఓట్ల మెజారిటీతో గెలుపొంది శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.

1983 ఎన్నికలు సవరించు

1983లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన చిట్టూరి వెంకటేశ్వరరావు గెలుపొందారు. సమీప ప్రత్యర్థిపై 4098 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.

1989 ఎన్నికలు సవరించు

1989లో నిర్వహించిన శాసనసభ ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముళ్ళపూడి వెంకటకృష్ణారావు 9,381 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

1994 ఎన్నికలు సవరించు

1994లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెదేపాకు చెందిన ముళ్ళపూడి వెంకటకృష్ణారావు 22,560 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.

1999 ఎన్నికలు సవరించు

1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వై.టి.రాజా 23,847 ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.

2004 ఎన్నికలు సవరించు

2004 శాసనసభ ఎన్నికలలో తణుకు శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిట్టూరి బాపినీడు తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వై.టి.రాజాపై 5377 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. బాపినీడుకు 65189 ఓట్లు రాగా, వై.టి.రాజు 59812 ఓట్లు సాధించారు.

2009 ఎన్నికలు సవరించు

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వై.టి.రాజు, ప్రజారాజ్యం పార్టీ నుండి ఆకుల శ్రీరాములు, లోక్‌సత్తా తరఫున వి.సుబ్బలక్ష్మి పోటీచేశారు. కారుమూరి వెంకట నాగేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి ఆకుల శ్రీరాములుపై 1,451 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

2014 ఎన్నికలు సవరించు

ఇవి కూడా చూడండి సవరించు

మూలాలు సవరించు

  1. .in, elections. "TANUKU ASSEMBLY CONSTITUENCY, ANDHRA PRADESH". Compare Infobase Limited.