తలకోన జలపాతం
తలకోన తిరుపతి జిల్లా యెర్రావారిపాలెం మండలంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం.[1] ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. చుట్టూ ఎత్తైన కొండలతో, దట్టమైన అరణ్యప్రాంతం మధ్యలో వెలసిన ఈ జలపాతం నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడుతుంటుంది. తిరుపతి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాత ప్రదేశం అత్యంత రమణీయ ప్రకృతి ప్రదేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు.[2]
తలకోన జలపాతం | |
---|---|
ప్రదేశం | తిరుపతి జిల్లా యెర్రావారిపాలెం |
అక్షాంశరేఖాంశాలు | 13°48′42″N 79°12′56″E / 13.81167°N 79.21556°E |
ఇది తిరుపతికి 45 కి.మీ దూరంలో శేషాచల కొండల పర్వతశ్రేణుల మధ్యలో ఉంది. ఇక్కడ 60 మీటర్ల ఎత్తు నుండి పడుతున్న జలపాతాలు చాలా అకర్షణీయంగా ఉంటాయి. ఓషధీ లక్షణాలు కల మొక్కలు అనేకం ఉన్నాయి. తలకోనలో ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారి పున్నమి అతిథి గృహం ఉంది.
విశేషాలు
మార్చుతలకోన శేషాచల కొండల వరుసలో తల భాగంలో వున్నందున దీన్ని తలకోన అంటారు. ఇక్కడున్న జలపాతం ఎత్తు సుమారు మూడు వందల అడుగులు. ఈ జలపాత దృశ్యం నయనానంద కరంగా వుంటుంది. ఇక్కడ చేరగానే మొదట మనం కనుగొనేది సిద్దేశ్వరాలయము, అమ్మవారు, విఘ్నేశ్వరుడు, సుబ్రమణ్యస్వామి ఆలయాలు. అలయానికి అతిసమీపముగా వాగు ఒకటి ఎల్లపుడూ ప్రవహిస్తూంటుంది. ఇందులోని నీరు చాల తేటగాను చాల చల్లగాను ఉంటాయి. సిద్దేశ్వరాలయము నుండి కొంత ముందుకు సాగిన నెలకోన, దిగువ ఝరి, ఎగువ ఝరి లకు వళ్ళవచ్చు. ఈ మూడింటికి చాల ప్రాముఖ్యత ఉంది. నెలకోన అన్నది దట్టమైన కొండల మధ్య ఉంది. ఇక్కడి రెండు కొండల నడుమ ఒక నీటి ప్రవాహము వచ్చి ఒక కొలనులో దూకుతూ ఉంటుంది. ఈ కొలను యొక్క లోతు ఎవరూ కనుగొనలేదు. అంత సాహసము ఎవరూ చేయలేదు. ఇక్కడ చెప్పుకోదగ్గ ఇంకొక అంశము రెండు కొండల నడుమ ఉండే పెద్ద గుండు రాయి. ఇది ఎప్పడు మీద పడుతందో అని భయపడక మానరు, చూసిన వారు.
గిల్లితీగ
మార్చుఆ జలపాతం పైనుండి కొంత దూరంలో పాపనాసం అనే తీర్థం ఉంది. ఇక్కడ గిల్లితీగ అనే తీగ ఉంది. ఈ తీగలు పొడవు కొన్ని కిలోమీటర్ల పొడవు వుంటాయి. దీని కాయలు కూడా చింత కాయల వలె వుండి వాటికన్న చాల పెద్దవిగా వుంటాయి. స్థానికులు ఈ తీగలని అన్ని బాగాలను కాయలు, దాని గింజలను మందులుగా వాడుతారు. చర్మ వ్యాదులకు, జ్వరానికి, తలనెప్పికి ఇలా అనేక వ్వాదులకు వాడుతారు. ఇవేకాక ఈ ప్రాంతంలో అనేక ఔషధ మొక్కలున్నాయి.
నెలకోన
మార్చుతలకొన జలపాతం ఉన్న కొండ క్రింద ప్రాంతంలో మరొక జలపాతం ఉంది.దాని పేరు నెలకొన, ఇక్కడ దొంగల బండి లాంటి తెలుగు సినిమా షూటింగ్ కూడా జరిగింది.
రామలక్ష్మణుల వృక్షాలు
మార్చుతలకోన శిరోద్రోణి తీర్థం (వాటర్ పాల్స్, ఝరి) కి వెళ్లే దారిలో రామలక్ష్మణుల మామిడి వృక్షాలు ఉన్నాయి. ఒకే పొడవుతో ఉన్న ఈ వృక్షాలను భక్తులు రామలక్ష్మణ వృక్షాలుగా పిలుస్తారు. వారు ఈ పర్వతాలపై సంచరించారనడానికి గుర్తుగా ఈ వృక్షాలు ఉన్నట్లు భక్తుల నమ్మకం.[3]
వృక్షసంపద, జంతుజాలం
మార్చుఈ అటవీ ప్రాంతంలో అనేక రకాల వృక్షాలు అనగా మద్ది, చందనం ఎర్ర చందనం వంటి వృక్షాలు అధికంగా ఉన్నాయి. అడవి కోళ్లు, నెమళ్లు,, దేవాంగ పిల్లి, ఎలుగులు, ముచ్చు కోతులు వంటి జంతు జాలం ఉంది. వృక్షాలకు వాటి పేర్లు రాసిన పలకలు వాటికి తగిలించి ఉన్నారు. ఇక్కడి ప్రకృతి అందాలకు మురిసి అనేక సినిమాలు తీశారు.
ఇక్కడికి కొంత మంది ఔత్సాహికులు ట్రెక్కింగు కొరకు కూడా వస్తుంటారు. ప్రకృతిని పక్షులను జంతువులను చూడడానికి అటవీ శాఖవారు ఇక్కడ ఎత్తైన వాచ్ టవర్లను నిర్మించారు. వాటి పైకెక్కి చూడ వచ్చు. శివరాత్రి పర్వ దినాన ఇక్కడ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి. తలకోన తిరుపతి సుమారు యాబై కిలో మీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి ప్రతి గంటకు బస్సులుంటాయి.
తలకోనకు ఎలా వెళ్ళాలి?
మార్చుతలకోనకు తిరుపతి, పీలేరు నుండి ఏ.పి.యస్.ఆర్.టి.సి బస్సు సౌకర్యం ఉంది. పీలేరు నుంచి 50 కిలోమీటర్లు, తిరుపతి నుంచి 49 కిలోమీటర్ల దూరంలో ఉంది.తిరుపతి బస్ స్టాండ్ నుండి ప్రతి రోజు ఉదయం 7 గంటలకు నేరుగా తలకోనకు బస్సు సౌకర్యం ఉంది, మళ్ళి తలకోన నుండి తిరుపతికి సాయింత్రం 4 గంటలకు ఇదే బస్సు ఉంది.ఇదికాక తిరుపతి నుండి పీలేరు వెళ్ళే బస్ ఎక్కి భాకరాపేట దిగవలెను. అక్కడి నుంచి 26 కిలోమీటర్లు ఆటో ద్వారా నెరబైలు మార్గంలో ప్రయాణం చేస్తే తలకోన చేరుకోవచ్చు. భాకరాపేట నుంచి తలకోనకు నిత్యం ప్రయివేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సాయంత్రం 4:30 తర్వాత జలపాతానికి అనుమతి లేదు. భాకరాపేట బస్ స్టాండ్ నుండి రోజుకు 2 బస్సులు మాత్రమే ఉన్నాయి.
తలకోనల వసతి
మార్చుతలకోనలో టీటీడీ ఆధ్వర్యంలో రెండు అతిథి గృహాలు ఉన్నాయి. ఇందులో 12 గదులు ఉన్నాయి. అడ్వాన్స్ బుకిం గ్ కోసం 08584-272425 నంబర్‌కు ఫోన్ చేసి రిజర్వేషన్ చేసుకోవచ్చు. డీలక్స్ గది అద్దె రూ. 500. అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వసతి గృహాలు, డార్మెంటరీలు ఉన్నా యి. 4 లాట్లు ఉండగా ఇందులో 6 గదులతో పాటు డార్మెంటరీ, సామూహిక బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే శాకాహార, మాంసాహార భోజన సౌకర్యాన్ని అట వీశాఖ అందిస్తోంది.
-
తలకోన జలపాతం - మరో దృశ్యం
-
తలకోనలోని జలపాత దృశ్యం
-
ఎర్ర చందనం చెట్టు, తలకోన
-
పనస చెట్టు
-
వెలగ కాయ
మూలాలు
మార్చు- ↑ "Talakona-Explore & experience the pristine nature". Archived from the original on 2017-10-11. Retrieved 2018-01-26.
- ↑ Reddy, Hanumantha. "Talakona water falls | Tourists | Chittor district | పర్యాటకులకు ఆహ్లాదం పంచే "తలకోన" జలపాతం". Archived from the original on 2018-03-22. Retrieved 2018-01-26.
- ↑ "ప్రకృతి పొదరిల్లు తలకోన". Sakshi. 2014-05-28. Retrieved 2018-01-26.