తషు కౌశిక్

భారతీయ సినిమా నటి, మోడల్

తషు కౌశిక్, భారతీయ సినిమా నటి, మోడల్. స్టేజ్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన తషు కౌశిక్, రామ్ గోపాల్ వర్మ దర్వాజా బంద్ రఖో సినిమా ద్వారా సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[1]

తషు కౌశిక్
జననం
వృత్తిసినిమా నటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం

తొలి జీవితం మార్చు

తషు కౌశిక్ ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూరులో వ్యాపారవేత్త రాకేశ్ గౌడ్ కు జన్మించింది. ఆమె చిన్నతనంలోనే ఆమె కుటుంబం ముంబై నగరానికి వెళ్ళింది. అనేక వాణిజ్య ప్రకటనల్లో నటించిన తషు, జూమ్ అనే బాలీవుడ్ చిత్రంలో నటించింది.[2]

సినిమారంగం మార్చు

తషు కౌశిక్ తెలుగబ్బాయి సినిమాలో తనీష్ సరసన, రాజ్ కందుకూరి దర్శకత్వంలో దూల శీను సినిమాలో శ్రీ సరసన, మైక్ టెస్టింగ్ 143 అనే సినిమాలో తారక రత్న సరసన నటించింది.[3] రాజేష్ నాయర్ రూపొందించిన అన్నం ఇన్నమ్ ఎన్నమ్ చిత్రంతో ఆమె మలయాళ సినిమారంగంలోకి ప్రవేశించింది.[4] 2013లో కూల్ గణేశలో కన్నడ సినిమాలో నటించింది.[5] పజయ వన్నార పెట్టై సినిమా ద్వారా తమిళ సినిమారంగంలోకి ప్రవేశించింది.[6] ముంబైలోని వెర్సోవాలో ఆమె తన సొంత రెస్టారెంట్ నడుపుతున్న సమయంలో తషుకు మొదటి తెలుగు సినిమా అవకాశం వచ్చింది.[6]

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పేరు పాత్ర భాష గమనికలు
2006 దర్వాజా బంద్ రఖో షీబా కె. షా హిందీ
2010 రాజు మహారాజు బిందు తెలుగు
2011 దుశ్శాసన తెలుగు
2011 వైకుంఠపాలి స్నిగ్ధ తెలుగు
2011 గ్రాడ్యుయేట్ మనీషా తెలుగు
2013 అన్నం ఇన్నమ్ ఎన్నమ్ రియా మలయాళం
2013 తెలుగబ్బాయి మేఘ తెలుగు
2013 గోల సీను సంధ్య తెలుగు
2013 కూల్ గణేశ కన్నడ
2013 ఎస్కేప్ ఫ్రమ్ ఉగాండ ఏంజెల్ మాథ్యూస్ మలయాళం
2013 పజయ వన్నార పెట్టై తమిళం
2013 రిపోర్టర్ మాయ తెలుగు

మూలాలు మార్చు

  1. Zachariah, Ammu (1 May 2012). "Tashu Kaushik to debut in Mollywood". Times of India.
  2. "Tashu Koushik". chithr.com. 11 May 2009. Archived from the original on 16 మే 2009. Retrieved 15 మార్చి 2021.
  3. "Tashu Kaushik's all new avatar". Times of India. 9 August 2012. Archived from the original on 2013-12-19. Retrieved 2021-03-15.
  4. "Tashu Kaushik in M'town". Deccan Chronicle. 19 May 2012. Archived from the original on 20 మే 2012. Retrieved 15 మార్చి 2021.
  5. "I want to do realistic roles: Tashu". Times of India. 13 September 2012. Archived from the original on 2012-10-24. Retrieved 2021-03-15.
  6. 6.0 6.1 "I want to direct a film: Tashu Kaushik". Times of India. 8 April 2012. Archived from the original on 2013-05-08. Retrieved 2021-03-15. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "articles.timesofindia.indiatimes" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు

బయటి లింకులు మార్చు