స్పర్శ

(తాకు నుండి దారిమార్పు చెందింది)

స్పర్శ (Touch) ఒక విధమైన చర్మానికి సంబంధించిన పంచేంద్రియాలలోని జ్ఞానేంద్రియం.

తల్లి స్పర్శ బిడ్డకు అనేక మానసిక చర్యలను కలిగిస్తుంది.

భాషా విశేషాలు

మార్చు

తెలుగు భాషలో స్పర్శ పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] స్పర్శ లేదా స్పర్శము n. Touch, contact. Feeling, the sense of touch, తాకడము, తగలడము. రక్త స్పర్శము contact with blood. జల స్పర్శము. the usual phrase for making water: because water must afterwards be touched in purification. స్పర్శనము n. Touching, coming into contact with. తాకడము, తగలడము. A gift, donation, దానము." చరణ స్పర్శనంబు చేసి." స్పర్శ నాడులు sensory nerves. స్పర్శనుడు n. The god of the air or wind. వాయుదేవుడు. స్పర్శవేది or స్పర్శమణి n. The philosopher's stone, the touch of which changes other metals into gold. తాకగానే ఇనుము మొదలైన వాటిని బంగారు చేయు మణి విశేషము, పరుసవేది. స్పర్శించు v. a. To touch, to feel. స్పృశించు, తాకు, అంటిచూచు. స్పర్శేంద్రియము n. The sense of touch.

శాస్త్రీయ సమాచారం

మార్చు

ఇది నాడీ వ్యవస్థ (Nervous system) లో ఒక భాగము. దీనిలో జ్ఞాన గ్రాహకాలు (thermoreceptors, mechanoreceptors and chemoreceptors) స్పర్శ, ఉష్ణోగ్రత, శరీర స్థితి, నొప్పికి సంబంధించిన సమాచారాన్ని గ్రహించి జ్ఞాన నాడుల ద్వారా, వెన్నుపాము తద్వారా మెదడుకు చేరవేస్తాయి. ఈ గ్రాహకాలు చర్మం, ఉపకళాకణజాలాలు, కండరాలు, ఎముకలు, కీళ్ళు, అంతర్గత అవయవాలు, రక్తప్రసరణ వ్యవస్థ అంతటా విస్తరించి ఉన్నాయి.

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=స్పర్శ&oldid=3277945" నుండి వెలికితీశారు