తాటిచెట్లపాలెం
తాటిచెట్లపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం నగర శివారు ప్రాంతం. ఇది అక్కయ్యపాలెం, కంచరపాలెంలకు సమీపంలో ఉంది.[1] ఇది 5వ జాతీయ రహదారితో కలుపబడి ఉంది.
తాటిచెట్లపాలెం | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°44′02″N 83°17′28″E / 17.733860°N 83.291153°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530024 |
చరిత్ర
మార్చు1969 - 1986 మధ్యకాలంలో ఈ ప్రాంతాన్ని తాటిపీఠ అని పిలిచేవారు. ఇక్కడ తాటి చెట్లు ఎక్కువగా ఉండేవి. ఈ రహదారి గుండా ప్రయాణించే ప్రజలు ఇక్కడ తాటికల్లు తాగేవారు. 1986లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంపేరు తాటిచెట్లపాలెంగా మార్చబడింది.[2]
భౌగోళికం
మార్చుఇది 17°44′02″N 83°17′28″E / 17.733860°N 83.291153°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.[3]
సమీప ప్రాంతాలు
మార్చుఇక్కడికి సమీపంలో శాంతి నగర్, సంజీవయ్య కాలనీ, ఇందిరా నగర్, మురికివాడ, బోయపాలెం, గణేష్ సేవా సంఘం కాలనీ మొదలైప ప్రాంతాలు ఉన్నాయి.
రవాణా
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో తాటిచెట్లపాలెం మీదుగా టౌన్ కొత్తరోడ్, కొత్తవలస, విజయనగరం, సేవానగర్, గురజాడనగర్, ఆర్.కె. బీచ్ మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4]
మూలాలు
మార్చు- ↑ "about". the hans india. 11 May 2019. Retrieved 5 May 2021.
- ↑ "Thatichetlapalem , Visakhapatanam". www.onefivenine.com. Retrieved 5 May 2021.
- ↑ "Thatichetlapalem Road, Thatichetlapalem, Akkayyapalem Locality". www.onefivenine.com. Retrieved 2021-05-05.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 5 May 2021.