తాడిగుడా

తాడిగుడ జలపాతం
అనంతగిరి జలపాతం
తాడిగుడ జలపాతం
తాడిగుడ జలపాతం is located in Andhra Pradesh
తాడిగుడ జలపాతం
ప్రదేశంఅనంతగిరి, విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్
అక్షాంశరేఖాంశాలు18°17′14″N 83°6′43″E / 18.28722°N 83.11194°E / 18.28722; 83.11194
రకంPlunge
మొత్తం ఎత్తు100 ft (30 m)
పొడవైన బిందువు100 ft (30 m)

తాడిగుడ జలపాతం, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా, అనంతగిరి వద్ద నున్న ఒక అద్భుతమైన జలపాతం పర్యాటక ప్రదేశం.[1]

నేపధ్యం మార్చు

ఈ జలపాతాన్ని అనంతగిరి జలపాతం అని కూదా పిలుస్తారు. దాదాపు 200 అడుగుల ఎత్తు నుండి దుమికే జలపాతం సందర్శకులకు కనువిందు చేస్తుంది.[2] ఈ జలపాతాన్ని సందర్శించుటకు అనువైన సమయం వర్షాకాలము. అనంతగిరి నుండి ఈ జలపాతం వరకు నడుచుకుంటూ కానీ లేదా పర్వతారోహణ చేసి కానీ చేరుకోవచ్చు. ఈ జలపాతం అనంతగిరి, అరకు లోయ ప్రధాన రహదారి నుండి దాదాపు 1 - 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అనంతగిరి నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రధాన రహదారి నుండి జలపాతాన్ని కలిపే రహదారి చాలా చిన్నగానూ, గతుకులమయముగా ఉంది. సాధారణ వాహనాలు ఈ మార్గములో ప్రయాణించవలెనంటే కొద్దిగా ప్రయాసతో కూడుకున్న పని. అదే విలాస వాహనాలలో అయితే ప్రయాణం సుఖవంతముగా కొనసాగుతుంది. కావున ఈ జలపాతమును నడక ద్వారా చేరుకొనుట ఉత్తమమైన పని. 20 నిమిషాల నడకతో అనంతగిరి నుండి ఇక్కడికి చేరుకోవచ్చును. ఈ మార్గము ఎత్తుపల్లములో కాకుండా నేరుగా ఉండుటవలన ఎవరైనా ఈ మార్గములో సులభముగా నడయాడవచ్చును.[3]

ఈ జలపాతం వద్దనున్ను రాళ్ళు నున్నగా ఉండి, పాచిపట్టి ఉంటాయి. అందువలన వాటిపైకి ఎక్కేటపుడు జారి పడే ప్రమాదం ఉంది. అలాగే ఇక్కడి నీటిలో సందర్శకులు ఈదవచ్చు. కానీ ఇక్కడి నీరు మురికిగా ఉంటాయి. కావున ఈదకపోవడమే సురక్షితము.

ఎంత దూరం మార్చు

మూలాలు మార్చు

  1. "పర్యాటక ప్రాంతాలు కళకళ". www.andhrajyothy.com. 2019-10-13. Retrieved 2020-02-03.[permanent dead link]
  2. Eenadu. "తెలుగింటిమింటి ధారలు - EENADU". www.eenadu.net. Archived from the original on 2020-02-03. Retrieved 2020-02-03.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-10-16. Retrieved 2016-10-18.

బయటి లంకెలు మార్చు