తాతా సందీప్ శర్మ రాజమహేంద్రవరమునకు చెందిన యువ అవధాని, పద్యకవి.[1]

జీవిత విశేషాలు

ఇతడు 14-06-1994 జూన్ 14 న జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం సీలేరు, తూర్పు గోదావరి జిల్లా లోని కోరుకొండ, రాజమహేంద్రవరములలో సాగింది. 2015లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయము నుండి బీఎస్సీ - బయోటెక్నాలజీ పట్టభద్రులైనారు. 2017లో ఆంధ్ర విశ్వకళా పరిషత్ విశాఖపట్టణము నుండి ఎమ్మెస్సీ-బయోటెక్నాలజీ పట్టా పొందారు.

అవధానాలు

సందీప్ శర్మ ప్రస్తుతం ఉన్న అవధానులలో అతి చిన్న వయస్కుడు. చిన్నతనంలో నాయనమ్మ కీ.శే.తాతా పార్వతమ్మ (విశ్రాంత తెలుగు పండితురాలు) ప్రోత్సాహంతో పద్యరచన ప్రారంభించారు. అనంతరం పద్యకళాతపస్వి శ్రీ ధూళిపాళ మహదేవమణి గారి శిష్యరికంలో అవధాన విద్య నేర్చుకున్నారు. తన తొలి అవధానాన్ని డిగ్రీ చవుతున్న రోజుల్లో నన్నయ సారస్వత పీఠం ఆధ్వర్యంలో రాజమండ్రిలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఇప్పటి వరకు 29 అష్టావధానాలు, ఒక ద్విగుణిత అష్టావధానము చేశారు. 14 విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్న రాష్ట్రస్థాయి కవిత్వ పోటీలలో ప్రథమ బహుమతి పొందారు. గరికపాటి నరసింహారావు నుండి సరస్వతీ దేవి స్వర్ణ అంగుళీయకాన్ని అందుకున్నారు. 2015 లో నోరి నరసింహ శాస్త్రి చారిటబుల్‌ ట్రస్ట్‌ వారు యువ రచయిత పురస్కారాన్ని అందించారు.[2] 

రచనలు

సాహితీ సందీప్తి (ఖండకావ్యము)[3]

బిరుదములు

 • అవధాన అష్టాపద
 • అవధాన చింతామణి
 • అవధాని యువరాట్
 • ఘంటావధాన ధురీణ

[4]

పురస్కారములు

 1. నోరి నరసింహశాస్త్రి స్మారక యువరచయిత ప్రోత్సాహక పురస్కారం -2015
 2. ఉషశ్రీసంస్కృతీ సత్కారం-2017
 3. జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ వారి నుండి "అవుట్ స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డ్ -2017" 

ప్రవచనాలు

శ్రీమద్భాగవతము, మహాభారతము ,రామాయణము,హరవిలాసము, సౌందర్యలహరి ,శ్రీకృష్ణ కర్ణామృతము మొదలైన అంశాలతో పురాణ ఆధ్యాత్మిక ప్రవచనాలే కాక మనుచరిత్ర,పారిజాతాపహరణము వంటి గ్రంథాలపై సాహిత్య ప్రసంగాలు చేశారు. హిందూధర్మం ఛానల్లో నెలరోజులు హరవిలాసము, నెలరోజులు ఆదిత్యహృదయము ప్రవచనాలు చేశారు.

కవిసమ్మేళనాలు

 • చెన్నైలోని "మద్రాసు విశ్వవిద్యాలయంలో" జరిగిన జాతీయ కవి సమ్మేళనంలో మద్యపానంపై పద్యగానంచేసి అభినందనలందుకున్నారు.
 • అంతర్వేదిలో జరిగిన ప్రపంచ తెలుగు కవిత్వోత్సవానికి హాజరై పద్యప్రక్రియ కోసం పోరాడి పద్యగానం చేశారు[5]

సదస్సులు-సమావేశాలు

 • ఆంధ్రవిశ్వవిద్యాలయము,ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయము మొదలైన సంస్థలు నిర్వహించిన అనేక జాతీయ & అంతర్జాతీయ సదస్సులలో పాల్గొని వివిధ అంశములపై పరిశోధనా పత్రమలు సమర్పించారు.

మూలాలు

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-07-24. Retrieved 2017-08-29.
 2. "అవధాన విద్యలో సందీప కాంతులు". 21 July 2016. Archived from the original on 29 ఆగస్టు 2017. Retrieved 29 August 2017.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 3. "ఘనంగా సాహితీ సందీప్తి'పుస్తకావిష్కరణ". 8 October 2016. Archived from the original on 29 ఆగస్టు 2017. Retrieved 29 ఆగస్టు 2017.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
 4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-06-12. Retrieved 2017-08-29.
 5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-01-22. Retrieved 2018-11-29.