తిప్పలమ్మ గూడెం

       తిప్పలమ్మ గూడెం, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక గ్రామం, తిప్పర్తి మండలం. పిన్ కోడ్: 508247.

తిప్పలమ్మ గూడెం
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం తిప్పర్తి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ప్రధానాంశాలు మార్చు

  • గ్రామ దేవత: బాల త్రిపుర సుందరి దేవి. (తిప్పలమ్మ తల్లి)
  • గ్రామ జనాభా : 400 ( సుమారుగా )

ప్రధాన వృత్తి మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ప్రధాన పంటలు మార్చు

వరి, పత్తి, కంది, బత్తాయి మెదలైనవి.

విశేషాలు మార్చు

  • రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు ప్రముఖ పాత్ర పోషించి, హోం శాఖ సహా అనేక కీలక శాఖలకు మంత్రిగా సేవలందించిన శ్రీ కుందూరు జానారెడ్డి ఈ గ్రామంలోనే వారి బాల్యాన్ని గడిపారు. సమీపంలోని తిప్పర్తి ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు అభ్యసించారు.
  • ఇక 2009 -2014 వరకూ, రాష్ట్ర శాసనసభలో సిపిఎం తరపున ఏకైక శాసన సభ్యులు (మిర్యాలగూడ) గా ఎన్నికై ఆ పార్టీ శాసన సభ పక్ష నేతగా వ్యవహరించిన శ్రీ జూలకంటి రంగారెడ్డి గారు కూడా ఈ గ్రామంలోనే చదువుకున్నారు.
  • గ్రామం లోకి ప్రవేశించగానే అక్కడ ప్రశాంతత, పవిత్రత ఎవరి నైనా ఆకట్టుకుంటాయి. గ్రామ ముఖద్వారం వద్ద ఉన్న తిప్పలమ్మ గుడి మరొక ప్రధాన ఆకర్షణ. ఆలయంలో పెరిగే రకరకాల పూల, పళ్ల మొక్కలు తమ సువాసనలతో భక్తులకు ఆనందాన్ని కలగజేసి, భక్తిని యినుమడింప జేస్తాయి.
  • ప్రతిరోజూ ఉదయం 5 గం. నుండి 10 గం. వరకూ, సాయంత్రం 4 గం. నుండి 8 గం. వరకూ తెరచి ఉండే ఈ ఆలయంలో రకరకాల పూజలు నిర్వహించబడతాయి.
  • ఏడాదికోమారు జరిగే "సేవ" ఉత్సవం విశేష ఆకర్షణ. ఆనాడు, ప్రత్యేకంగా అలంకరింపబడిన అమ్మవారిని చుట్టు పక్కల గ్రామాలలో హారతులు, భజనలతో ఊరేగించి రకరకాల నైవేద్యాలు (బోనాలు) సమర్పించి అమ్మ వారి ఆశీస్సులు పొందుతారు . తరతరాలుగా తమ గ్రామాన్ని అమ్మ వారు కాపాడుతున్నదని గ్రామస్తుల ప్రగాఢ విశ్వాసం.
  • గ్రామ పొలిమేర లోంచి సుమారు అర కిలోమీటరు దూరంలో ఉన్న తిప్పర్తి రైల్వే స్టేషను, ఒక ప్రధాన రవాణా మాధ్యమంగా పని చేస్తోంది. పలు ఎక్స్ ప్రెస్, గూడ్స్, పాసింజరు రైళ్లు
  • ఈ మార్గంలో ప్రయాణించి హైదరాబాదు, విశాఖపట్నం, చెన్నై, తిరువనంతపురం వంటి పట్టణాలతో గ్రామాన్ని అనుసంధానిస్తున్నాయి.
  • ప్రధాన పండుగలైన దసరా, దీపావళి, సంక్రాంతి లతో పాటు శ్రీరామనవమి, వినాయక చవితి వేడుకలు కూడా ఘనంగా జరుపుకుంటారు. పండుగలు జాతి ఐక్యతకు ప్రతీకలుగా భావిస్తారు.

సౌకర్యాలు మార్చు

  • గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించిన రెండు పాఠశాలలు
  • గ్రామ ప్రజలకు శుద్ధి చేసిన నాగార్జున సాగర్ నీటిని అందించుటకు గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించిన రెండు నీటి ట్యాంకులు.
  • గ్రామ దేవత తిప్పలమ్మకు ఆ గ్రామస్థుల సహకారంతో ఆధునికీకరంపబడిన ఆలయం.

గ్రామ సరిహద్దులు మార్చు

గ్రామ జనాభా మార్చు

మూలాలు మార్చు