బత్తాయి (Orange fruit) ఒక తియ్యని రూటేసి కుటుంబానికి సంబంధించిన పండ్ల చెట్టు. చూడటానికి పెద్ద నిమ్మపండు లా కనిపించినా రుచి మాత్రం తీయగా ఉంటుంది. అందుకే దీన్ని స్వీట్ లైమ్ అని పిలుస్తారు. పండిన బత్తాయి గుజ్జు లేత పసుపు రంగులో ఉంటుంది. దీన్ని కొద్ది మంది ఒలుచుకుని తింటారు కానీ చాలా మంది దీన్ని రసం రూపంలో సేవిస్తారు.

బత్తాయి
బత్తాయి పూలు, పండ్లు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Subclass:
Order:
Family:
Genus:
Species:
సి. సైనెన్సిస్
Binomial name
సిట్రస్ సైనెన్సిస్
బత్తాయి

ఆగ్నేయాసియా, దక్షిణ ఆసియా, మధ్యధరా ప్రాంతాల్లో ఎక్కువగా పెరిగే ఈ పండ్ల చెట్లని ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా పెంచుతున్నారు. పుట్టింది ఆసియా దేశాల్లోనే అయినా క్రమంగా ఇటలీ, మధ్యధరా ప్రాంతంలో ఎక్కువగా పండిస్తున్నారు.

బత్తాయిలు - రకాలు మార్చు

బత్తాయిలతో ఆరోగ్యం మార్చు

పోషక విలువలతోబాటు ఔషధ పరంగా బత్తాయిలో అనేక లాభాలున్నాయి. జలుబు, జ్వరం వచ్చినపుడు త్వరగా కోలుకోవడానికి దీన్ని రసాన్ని ఇస్తారు.

  • విటమిన్-సి లోపంతో వచ్చే స్కర్వీ వ్యాధిని అరికట్టడంలో ఈ పండు బాగా పనిచేస్తుంది.
  • ఈ పండుకున్న తీపి వాసన లాలాజల గ్రంథుల్ని ప్రేరేపించి లాలాజలం అధికంగా ఊరేందుకు కారణమవుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు పిత్తరసంతోపాటు ఇతర జీర్ణరసాలు, ఆమ్లాలు విడుదలయ్యేందుకు దోహద పడతాయి. అందువల్ల తీసుకున్న ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. అంతే కాకుండా ఈ రసం తొందరగా జీర్ణమై రక్తంలో కలిసిపోతుంది.
  • ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని ఆమ్లాలు పేగుల్లోని విషపూరిత పదార్థాల్ని పారదోలుతాయి.
  • ఈ జ్యూస్ వల్ల చిగుళ్ళ నొప్పులు, గొంతు సంబంధ ఇన్‌ఫెక్షన్లు త్వరగా తగ్గుతాయి.
  • బత్తాయి రసం చర్మానికి కూడా మంచిదే. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మచ్చల్ని మాయం చేస్తుంది.

బత్తాయిలు - పరిశ్రమలు మార్చు

మందుల తయారీ
 
బత్తాయిలు
జ్యూస్ పరిశ్రమ
జామ్ పరిశ్రమ

ఇతర ఉపయోగాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=బత్తాయి&oldid=2888563" నుండి వెలికితీశారు