తిరుమగన్ ఈవేరా
తిరుమగన్ ఈవేరా తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021లో జరిగిన తామికనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈరోడ్ ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
తిరుమహన్ ఎవరా.ఈ. | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 11 మే 2021 – 4 జనవరి 2023 | |||
ముందు | కె.ఎస్. తెన్నరసు | ||
---|---|---|---|
తరువాత | ఈ.వీ.కే.ఎస్. ఇళంగోవన్ | ||
నియోజకవర్గం | ఈరోడ్ తూర్పు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సుమారు 1976 | ||
మరణం | (aged 46) ఈరోడ్, తమిళనాడు, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | ఈ.వీ.కే.ఎస్. ఇళంగోవన్ (తండ్రి) | ||
పూర్వ విద్యార్థి | యూనివర్సిటీ అఫ్ మద్రాస్ |
రాజకీయ జీవితం
మార్చుతిరుమగన్ ఈవేరా తన తండ్రి ఈ.వీ.కే.ఎస్. ఇళంగోవన్ అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2006 నుండి 2010 వరకు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2014 నుండి 2017 వరకు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సెల్‌కు కన్వీనర్‌గా, 2021లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి, 2021 ఈరోడ్ తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప టీఎంసీ అభ్యర్థి యువరాజా పై ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. కాంగ్రెస్ అభ్యర్థి తిరుమగన్ ఈవేరాకు 67,300 ఓట్లు రాగా, యువరాజాకు 58,392 ఓట్లు పోలయ్యాయి.
మరణం
మార్చుతిరుమగన్ ఈవేరా అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన 4 జనవరి 2023న మధ్యాహ్నం స్పృహతప్పి పడిపోవడంతో కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే మార్గమధ్యంలో గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. [1][2]
మూలాలు
మార్చు- ↑ Andhrajyothy (5 January 2023). "కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూత". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
- ↑ The New Indian Express (5 January 2023). "Erode Congress MLA Thirumahan Everaa dies of heart attack at 46". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.