ఈ.వీ.కే.ఎస్. ఇళంగోవన్
ఈ.వీ.కే.ఎస్. ఇళంగోవన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో 2004 నుండి 2009 వరకు జౌళి శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
ఈ.వీ.కే.ఎస్. ఇళంగోవన్ | |||
| |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 10 మార్చి 2023 | |||
ముందు | తిరుమగన్ ఈవేరా | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఈరోడ్ ఈస్ట్ | ||
పదవీ కాలం 1984-1989 | |||
నియోజకవర్గం | సత్యమంగళం | ||
తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు
| |||
పదవీ కాలం 2014 - 2016 | |||
ముందు | బి. ఎస్. జ్ఞానదేశికన్ | ||
తరువాత | సు. తిరునావుక్కరసర్ | ||
పదవీ కాలం 2000 - 2002 | |||
ముందు | తిండివనం కె. రామమూర్తి | ||
తరువాత | బాలకృష్ణన్ | ||
టెక్స్‌టైల్స్ శాఖ
| |||
పదవీ కాలం 2004-2009 | |||
లోక్‌సభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2004-2009 | |||
నియోజకవర్గం | గోబిచెట్టిపాళయం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 21 డిసెంబర్ 1948 ఈరోడ్, తమిళనాడు, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | ఈవీకే సంపత్ | ||
జీవిత భాగస్వామి | వరలక్ష్మి | ||
సంతానం | సంజయ్ & తిరుమగన్ ఈవేరా | ||
నివాసం | గోబిచెట్టిపాళయం |
రాజకీయ జీవితం
మార్చుఇళంగోవన్ తన తండ్రి ఈ.వీ.కే. సంపత్ అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1984లో సత్యమంగళం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీచేసి తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టాడు. ఆయన 2004లో గోబిచెట్టిపాళయం లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికై ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో 2004 నుండి 2009 వరకు జౌళి, వాణిజ్య శాఖ మంత్రిగా పని చేశాడు. ఆయన 2009 & 2019లో ఈరోడ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు.
2021 ఈరోడ్ తూర్పు నియోజకవర్గం నుండి గెలిచిన ఈ.వీ.కే.ఎస్. ఇళంగోవన్ కుమారుడు తిరుమగన్ ఈవేరా హఠాత్మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]
మూలాలు
మార్చు- ↑ "Elangovan, Shri E.V.K.S." Lok Sabha. Archived from the original on 17 June 2012. Retrieved 2 May 2011.
- ↑ Andhrajyothy (3 March 2023). "34 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేగా మళ్లీ అసెంబ్లీకి..!". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.