తిరుమల తిరుపతి వెంకటేశ

తిరుమల తిరుపతి వెంకటేశ 2000 లో విడుదలైన తెలుగు చిత్రం. ఇ.వి.వి సత్యనారాయణ సహాయకుడైన సత్తిబాబు దర్శకత్వం వహించిన కామెడీ చిత్రం . ఇదితమిళ చిత్రం తిరుపతి ఎళుమలై వెంకటేశ (1999) కు రీమేక్. శ్రీకాంత్, రవితేజ, బ్రహ్మానందం, రోజా, మహేశ్వరి, కోవై సరాళ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని చంటి అడ్డాల, శ్రీనివాస రెడ్డి నిర్మించారు. 2000 డిసెంబరు 21 న విడుదల చేశారు.

తిరుమల తిరుపతి వెంకటేశ
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.సత్తిబాబు
నిర్మాణం చంటి అడ్డాల,
శ్రీనివాసరెడ్డి
కథ రామనారాయణన్
తారాగణం మేకా శ్రీకాంత్ ,
రవితేజ,
బ్రహ్మానందం,
రోజా సెల్వమణి,
ఖోవై సరళ,
మహేశ్వరి
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
సంభాషణలు పినపాక కృష్ణ ప్రసాద్
నిర్మాణ సంస్థ ఫ్రెండ్ల్ మూవీస్
భాష తెలుగు

ఈ చిత్రం యొక్క పూజను 2000 ఆగస్టు 2 న రామానాయుడు స్టూడియోలో చేసారు. చిత్రీకరణ సెప్టెంబరు 15 న ప్రారంభమై అక్టోబరు 30 తో ముగిసింది.[1]

కథ సవరించు

తిరుమల (బ్రహ్మానందం), తిరుపతి (రవితేజ), వెంకటేశ (శ్రీకాంత్) ఎలాగైనా సరే ధనవంతులు కావాలని కోరుకునే స్నేహితులు. కోట (కోట శ్రీనివాసరావు) అనే బంగ్లా కాపలాదారుకు ముగ్గురు కుమార్తెలు: లలిత (కోవై సరళ), పద్మిని (మహేశ్వరి), రాగిణి (రోజా). యజమాని సెలవుల్లో బంగ్లాను విడిచిపెట్టినప్పుడు, కోట కుమార్తెలు బంగ్లాలోకి వెళతారు. తరువాత, కోట తన యజమాని బంగ్లా లోని పైభాగాన్ని తిరుమల, తిరుపతి, వెంకటేశులకు అద్దెకు ఇస్తాడు. వారు తమ ఉద్యోగం గురించి అతడికి అబద్దం చెబుతారు. ఈ ముగ్గురు కుర్రాళ్ళు చివరికి ఆ ముగ్గురు అమ్మాయిలను పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఈ ముగ్గురు తమ భార్యలతో ఎలా నెట్టుకొస్తారనేది మిగిలిన కథ.

నటవర్గం సవరించు

సాంకేతికవర్గం సవరించు

వివాదం సవరించు

ఈ సినిమా పేరు దేవుడిని కించపరిచేలా ఉందంటూ ఓ వెంకటేశ్వరస్వామి భక్తుడు ఫిర్యాదు చేశాడు. ఈ చిత్ర నిర్మాత చంటి అడ్డాల ఒక పత్రికా సమావేశం నిర్వహించి, ఇది భక్తిరస చిత్రం కాదని, వినోదం కోసం మాత్రమే నిర్మించిన చిత్రమనీ చెప్పాడు.[2]

మూలాలు సవరించు

  1. "Tirumala Tirupathi Venkatesa trigged off". 3 August 2000. Retrieved 7 August 2019.
  2. "Tirumala Tirupati Venkatesa is in trouble". 18 December 2000. Retrieved 7 August 2019.