నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన 2020లో అండర్‌-19 ప్రపంచ కప్ లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించాడు.[1]

తిలక్‌ వర్మ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ
జననం (2002-11-08) 2002 నవంబరు 8 (వయసు 20)
హైదరాబాద్, భారతదేశం
బ్యాటింగ్ శైలి ఎడమ చేతి
బౌలింగ్ శైలి రైట్ - ఆర్మ్ ఆఫ్ బ్రేక్
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
2018 - ప్రస్తుతం హైదరాబాద్
కెరీర్ గణాంకాలు
పోటీ ఫస్ట్-క్లాస్ క్రికెట్ లిస్ట్ ఏ టీ20
మ్యాచులు 1 6 3
సాధించిన పరుగులు 39 213 50
బ్యాటింగ్ సగటు 19.50 35.50 25.00
100 పరుగులు/50 పరుగులు 0/0 0/2 0/0
ఉత్తమ స్కోరు 34 83 40 నాటౌట్
వేసిన బాల్స్ 30
వికెట్లు 1
బౌలింగ్ సగటు 37.00
ఇన్నింగ్స్ లో వికెట్లు 0
మ్యాచులో 10 వికెట్లు 0
ఉత్తమ బౌలింగు 1/19
క్యాచులు/స్టంపింగులు 0/– 4/– 1/–
Source: Cricinfo, 6 మే 2020 {{{year}}}

జననంసవరించు

నంబూరి ఠాకూర్‌ తిలక్‌ వర్మ 2002 నవంబరు 8న హైదరాబాద్‌లో నంబూరి నాగరాజు, గాయత్రీదేవి దంపతులకు జన్మించాడు.[2]

క్రీడా జీవితంసవరించు

తిలక్‌ వర్మ చందాన‌గ‌ర్ పీజేఆర్ స్టేడియంలో కోచ్ స‌లాం శిక్ష‌ణ‌లో తీసుకున్నాడు. ఆయన ప్రస్తుతం లింగంప‌ల్లిలోని లేగ‌ల క్రికెట్ అకాడ‌మీలో శిక్ష‌ణ పొందుతున్నాడు.[3] తిలక్‌ వర్మ 2018-19 రంజీ ట్రోఫీలో హైద‌రాబాద్ త‌ర‌పున ఫ‌స్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. ఆయన అండర్‌-19 ప్రపంచకప్‌ 2020లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2022 జనవరి 31 నాటికీ లిస్ట్-ఏ లో 16 మ్యాచ్‌లు ఆడి 784 పరుగులు చేశాడు.[4]

ఐపీఎల్‌సవరించు

తిల‌క్ వ‌ర్మ ఐపీఎల్‌ -2022 మెగా వేలంలో 20 లక్షల బేస్ ప్రైజ్‌తో తిల‌క్ వ‌ర్మ వేలంలోకి రాగా మొద‌ట సన్ రైజర్స్ హైదరాబాద్ బిడ్ చేసింది. అనంత‌రం రాజస్తాన్ రాయల్స్ కూడా పోటీ ప‌డ‌టంతో తిల‌క్ వ‌ర్మ ధ‌ర 50 ల‌క్షలు దాటింది. ఇక్కడ హైద‌రాబాద్ త‌ప్పుకోగా, రాజ‌స్తాన్‌కు పోటీగా చెన్నై సూపర్ కింగ్స్ వేలం రేసులోకి వ‌చ్చింది. కాసేప‌టికి రాజ‌స్తాన్ త‌ప్పుకోగా, ముంబై ఇండియన్స్ రేసులోకి రావడంతో ముంబై, చెన్నై తీవ్రంగా పోటీ ప‌డ‌గా చివ‌ర‌కు కోటి 70 లక్షలకు ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది.[5][6]

మూలాలుసవరించు

  1. Sakshi (13 February 2020). "అయినా... గెలుస్తామనుకున్నాం!". Archived from the original on 16 February 2022. Retrieved 16 February 2022.
  2. Sakshi (14 February 2022). "తండ్రి ఫెయిలైన ఎలక్ట్రిషియన్‌.. తెలుగుతేజం తిలక్‌వర్మ కథేంటి". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  3. V6 Velugu (3 December 2019). "జూనియర్ క్రికెట్ లో అదరగొడుతున్న హైదరాబాదీ" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  4. HMTV (14 February 2022). "ఐపీఎల్ వేలంలో అదరగొట్టిన హైదరాబాద్ కుర్రాడు". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  5. Eenadu (14 February 2022). "అంత ధర ఊహించలేదు: హైదరాబాదీ తిలక్‌వర్మ". Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.
  6. The Hindu (13 February 2022). "Mumbai Indians signs Tilak Varma" (in Indian English). Archived from the original on 17 February 2022. Retrieved 17 February 2022.