చందానగర్ (శేరిలింగంపల్లి)

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు శివారు ప్రాంతం.

చందానగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు శివారు ప్రాంతం.[2][3] లింగంపల్లి, మియాపూర్లకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతం హైదరాబాదు మహానగరపాలక సంస్థ పరిధిలోని 10వ వార్డు నంబరులో ఉంది.[4] 2020లో హైదరాబాదు మున్సిపల్ ఎన్నికల్లో మంజుల రఘునాథ్ రెడ్డి కార్పోరేటర్ స్థానాన్ని గెలుచుకున్నది. ఇక్కడ షాపింగ్ మాల్‌లు, హౌసింగ్ కాలనీలు, వాణిజ్య-నివాస సముదాయాలు ఉన్నాయి.

చందానగర్
సమీపప్రాంతం
చందా నగర్ is located in Telangana
చందా నగర్
చందా నగర్
తెలంగాణలో చందానగర్ ప్రాంతం
నిర్దేశాంకాలు: 17°29′48″N 78°21′41″E / 17.4968°N 78.3614°E / 17.4968; 78.3614Coordinates: 17°29′48″N 78°21′41″E / 17.4968°N 78.3614°E / 17.4968; 78.3614
దేశంభారతదేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లారంగారెడ్డి (RR), previously 'Hyderabad (Rural)'[1]
రెవిన్యూ డివిజన్చేవెళ్ళ
రెవిన్యూ మండలంశేరిలింగంపల్లి (మండలం కోడ్ #6)
లోకసభ నియోజకవర్గంచేవెళ్ళ (నియోజకవర్గం #10) పార్లమెంట్ సభ్యుడు = జి.రంజిత్ రెడ్డి
శాసనసభ నియోజకవర్గంశేరిలింగంపల్లి (నియోజకవర్గం #52)
ప్రభుత్వం
 • ప్రభుత్వ రకంపట్టణ పరిపాలన
 • నిర్వహణహైదరాబాదు మహానగరపాలక సంస్థ
సముద్రమట్టం నుండి ఎత్తు
536 మీ (1,759 అ.)
కాలమానంUTC+05:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్‌కోడ్
టెలిఫోన్ కోడ్+91-40

జిల్లాల పునర్వ్యవస్థీకరణలోసవరించు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[5]

సమీపప్రాంతాలుసవరించు

హఫీజ్‌పేట్, మదీనాగూడ, ఇంజనీర్స్ ఎన్‌క్లేవ్, గంగారాం, ఇక్రిసాట్ కాలనీ మొదలైన ప్రాంతాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.

వాణిజ్య ప్రాంతంసవరించు

చందానగర్ ప్రాంతంలో అనేక షాపింగ్ మాల్‌లు, సూపర్ మార్కెట్లు ఉన్నాయి. దుస్తుల కోసం చెన్నై షాపింగ్ మాల్, ఆర్ఎస్ బ్రదర్స్, కెఎల్ఎం మాల్, రీబాక్, అడిడాస్, బాటా, రేమండ్స్, పీటర్ ఇంగ్లాండ్, పెపే మొదలైన బ్రాండ్ల స్టోర్స్ ఉన్నాయి. విజేత, రతన్ దీప్, హెరిటేజ్ మొదలైన సూపర్ మార్కెట్లు ఉన్నాయి. వీటితోపాటు బజాజ్ ఎలక్ట్రానిక్స్, యస్ మార్ట్, రిలయన్స్ డిజిటల్ వంటి ఎలక్ట్రానిక్ స్టోర్లు కూడా ఉన్నాయి.

వైద్యంసవరించు

అపోలో క్లినిక్, ప్రాణం హాస్పిటల్, మైత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, టెస్లా డయాగ్నోస్టిక్స్, ఇతర క్లినిక్‌లు, జనరల్ హాస్పిటల్స్ ఇక్కడ ఉన్నాయి.

సినిమా హాళ్ళుసవరించు

ఇక్కడ సినిమాలు చూడడానికి శ్రీదేవి థియేటర్, శ్రీలత థియేటర్, ఆసియన్ జ్యోతి థియేటర్, ఐనాక్స్ జిఎస్ఎమ్ మాల్, మీరాజ్ గీత సినిమాస్, పివిఆర్ మారుతి మాల్ (19 స్క్రీన్‌) మొదైనవి ఉన్నాయి.

విద్యాసంస్థలుసవరించు

శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, నారాయణ జూనియర్ కళాశాలలు ఇతర పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడికి 10 కి.మీ.ల దూరంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రధాన విద్యా సంస్థలు ఉన్నాయి.

ప్రార్థనామందిరాలుసవరించు

గంగారం హనుమాన్ దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ ప్రాంతంలో ప్రముఖమైన దేవాలయాలు ఉన్నాయి. గుల్జార్ ఇ మదీనా మసీదు, జామా మసీదు, బాబా మదీనా గూడ దర్గా, హైదరాబాద్ సెయింట్ థామస్ మార్తోమా చర్చి Archived 2021-04-14 at the Wayback Machine కూడా ఉంది.

ప్రజా రవాణాసవరించు

ఈ ప్రాంతం నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సిటీ బస్సు సౌకర్యం ఉంది. చందానగర్ రైల్వే స్టేషనులో హైదరాబాదు ఎంఎంటిఎస్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది.

మూలాలుసవరించు

  1. [1] Archived 26 మే 2012 at the Wayback Machine
  2. Chandanagar Police Station Retrieved 16 July 2018.
  3. "Chanda Nagar, Hyderabad, Ranga Reddy Locality". www.onefivenine.com. Retrieved 7 September 2021.
  4. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 7 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-01.

ఇతర లింకులుసవరించు