తీన్మార్ సావిత్రి (జ్యోతి)

తీన్మార్ సావిత్రి అసలు పేరు శివ జ్యోతి. ఈవిడ టెలివిజన్ వ్యాఖ్యాత, తెలుగు న్యూస్ ఛానలైన వి6 న్యూస్ లో ప్రతిరోజు రాత్రి 9.30కి వచ్చే తీన్మార్ వార్తల ద్వారా పరిచయమైయింది. బిత్తిరి సత్తి తో కలిసి వార్తలను అందించింది.[1]

సావిత్రి
తీన్మార్ సావిత్రి
జననం
శివ జ్యోతి

14 ఫిబ్రవరి
వృత్తిటెలివిజన్ వ్యాఖ్యాత,
ఎత్తు5.2"
తల్లిదండ్రులురాజమల్లేష్, యశోద
బంధువులుగంగూలి

జననం - కుటుంబ నేపథ్యం

మార్చు

జ్యోతి నిజామాబాద్ జిల్లా, ముప్కాల్ మండలంలోని నాగంపేట గ్రామంలో యశోద, రాజమల్లేష్ దంపతులకు జన్మించింది. తల్లి బీడీ కార్మికురాలు, తండ్రి ఆర్‌ఎంపీ డాక్టర్.[2]

చదువు

మార్చు

చిన్నతనం నుండి 7వ తరగతి వరకు నాగంపేటలో చదివింది, తర్వాత 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు రేంజర్ల పక్క గ్రామానికి నడుస్తూ వెళ్ళేది. 8కిలోమీటర్ల దూరంవెళ్ళి రావడానికి, ఇంటర్ ఒక సంవత్సరం ఆర్మూర్ లో ఇంకో సంవత్సరం నిజామాబాద్ లో చదివింది. హైదరాబాద్ యశోదలో బి.ఎస్.సి నర్సింగ్ కోర్స్ లో చేరింది. మధ్యలోనే వదిలేసి, ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తిచేసింది.[3]

కెరీర్

మార్చు

యాంకర్‌గా రాణించాలనుకున్న జ్యోతి, వివిధ ఛానల్స్ లో యాంకరింగ్ చేసింది. అక్కడ తన భాషని, గొంతును, తెలంగాణ యాసను మార్చుకో, నీది మీడియాకు పనికిరాని గొంతు అన్నారు. అలా చాలా ఇబ్బందిపడిన తరువాత, వి6 ఛానెల్ వారు తెలంగాణ యాసలో వార్తలు చదివేవారికోసం చేసిన ఆడిషన్ లో జ్యోతి ఎంపికైంది. అలా వి6 ఛానల్ లో అవకాశం వచ్చింది. వి6లో చేరిన తొలిరోజుల్లో సినిమా వార్తలు చదివింది. ఆతర్వాత వీకెండ్ స్పెషల్ తీన్మార్, వాయిస్ ఓవర్లు చదివింది. జ్యోతి గొంతు డిఫరెంట్‌గా ఉండడం, ఆ గొంతును జనాలు ఆదరించడం, వి6 ఛానల్‌కు రేటింగ్ రావడంతోపాటు జ్యోతి తీన్మార్ సావిత్రిగా పాపులర్ అయింది.

తీన్మార్ వార్తలలో జ్యోతి వేసుకున్న బుగ్గల జాకెట్ చాలా ఫేమస్, ట్రెండ్ అయింది. కొందరు సావిత్రి జాకెట్లు అని పేరు కూడా పెట్టారు.

ప్రస్తుతం టీవీ9 ఛానల్ లో ఇస్మార్ట్ న్యూస్ వ్యాఖ్యాతగా పనిచేస్తోంది.

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. నమస్తే తెలంగాణ, జిందగీ (12 June 2020). "యాసే నా బలం". www.ntnews.com. Archived from the original on 13 June 2020. Retrieved 13 June 2020.
  2. నమస్తే తెలంగాణ, జిందగీ (3 October 2016). "యాస మార్చుకొమ్మన్నరు!". అజహర్ షేక్ - కంది సన్నీ. Archived from the original on 31 October 2019. Retrieved 6 October 2016.
  3. మన తెలంగాణ (2 January 2016). "వారి ప్రోత్సాహం మరువలేనిది". Retrieved 6 October 2016.[permanent dead link]
  4. ప్రజాశక్తి, తెలంగాణ (31 May 2017). "తెలంగాణ అవార్డు గ్రహీతలు వీరే!". www.prajasakti.com. Archived from the original on 31 May 2017. Retrieved 31 October 2019.
  5. నమస్తే తెలంగాణ, ప్రధాన వార్తలు (3 June 2017). "ప్రతిభామూర్తులకు పురస్కారాలు". www.ntnews.com. Archived from the original on 31 October 2019. Retrieved 31 October 2019.

బయటి లింకులు

మార్చు