తీవ్రవాదం (పుస్తకం)
తీవ్రవాదం ఒక తెలుగు వ్యాసాల సంకలన పుస్తకము. ఈ వ్యాసాలను కస్తూరి మురళి కృష్ణ వ్రాసారు. కస్తూరి మురళి కృష్ణ ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన తీవ్రవాదానికి సంబంధించి రాసిన వ్యాసాలు ఇవి. ఇందులో, సెప్టెంబర్ 2001 కన్నా ముందునుంచీ తీవ్రవాదం వల్ల ప్రపంచానికి వున్న ముప్పును గురించి హెచ్చరిస్తూ వ్రాసిన వ్యాసాలున్నాయి. తీవ్రవాదం నిర్వచనంతో సహా, తీవ్రవాదానికి కారణాలు, అది పెరిగిపోవటానికి దోహదపడే పరిస్థితులు, తీవ్ర వాదాన్ని అణచివేసేందుకు తీసుకోవలసిన చర్యల వంటివి సందర్భానుసారంగా ఆయా వ్యాసాలలో పొందుపరచివున్నాయి. అఫ్ఘనిస్తాన్, లిబియా, పాకిస్తాన్, చెచెన్యా, ఇండోనేషియా లతో సహా భారత దేశంలో ఈశాన్య భారతంలోని తీవ్రవాదం వంటి అంశాలను మూలాల్లోకి వెళ్ళి ప్రకటించే వ్యాసాలివి. అంటే, ఈ వ్యాసాలు వేర్వేరు సమయాల్లో రచించినవయినా వీటిలో పొందుపరచిన అంశాలు ఈనాటికీ పనికివస్తాయి. విలువ తరగనివి. ఎల్లప్పటికీ రెఫెరెన్స్ కు పనికివస్తాయి. ఇందులొ మొత్తం 36 వ్యాసాలున్నాయి. 2000 నుంచి 2008, 31 డిసెంబరు వరకు తీవ్రవాదానికి సంబంధించిన వ్యాసాల సంకలనం ఇది. తీవ్రవాదం సామాన్యుని జీవనం నుండి దేశాధినేతల దిన దిన నిర్ణయాల వరకు ప్రతీ చోటా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న ఈ రోజుల్లో తీవ్రవాదం గురించి తటస్త దృక్కోణంతో ప్రచురించిన ఈ పుస్తకం అందరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం.

చరిత్ర సవరించు
తీవ్రవాదం ఒక తెలుగు వ్యాసాల సంకలన పుస్తకము. ఈ వ్యాసాలను కస్తూరి మురళి కృష్ణ వ్రాసారు. 2000 నుంచి 2008, 31 డిసెంబరు వరకు తీవ్రవాదానికి సంబంధించిన వ్యాసాల సంకలనం ఇది. ఏప్రిల్ 2009 న మొదటి ముద్రణ జరిగింది.
మూలాలు సవరించు
బయటి లంకులు సవరించు
- http://kasturimuralikrishna.com/ Archived 2011-02-08 at the Wayback Machine
- http://kinige.com/kbook.php?id=133 Archived 2011-04-02 at the Wayback Machine