తుంగభద్ర (2015 సినిమా)

శ్రీనివాస్ కృష్ణ గోగినేని దర్శకత్వంలో 2015లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

తుంగభద్ర 2015, మార్చి 20న విడుదలైన తెలుగు చలనచిత్రం. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మాణ సారధ్యంలో శ్రీనివాస్ కృష్ణ గోగినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, డింపల్ చొపడా, సత్యరాజ్ తదితరులు నటించగా హరి గౌర సంగీతం అందించాడు.[1]

తుంగభద్ర
Tungabhadra Movie Poster.jpg
తుంగభద్ర సినిమా పోస్టర్
దర్శకత్వంశ్రీనివాస్ కృష్ణ గోగినేని
నిర్మాతరజని కొర్రపాటి
రచనశ్రీనివాస్ కృష్ణ గోగినేని
స్క్రీన్ ప్లేశ్రీనివాస్ కృష్ణ గోగినేని
కథశ్రీనివాస్ కృష్ణ గోగినేని
నటులుఅదిత్ అరుణ్
డింపల్ చొపడా
సత్యరాజ్
సంగీతంహరి గౌర
ఛాయాగ్రహణంరాహుల్ శ్రీవాస్తవ్
కూర్పుతమ్మిరాజు
నిర్మాణ సంస్థ
విడుదల
మార్చి 20 (2015-03-20)
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యంసవరించు

తాడికొండ – కర్లపూడి గ్రామాలలోని ఎమ్మెల్యే అభ్యర్థులు పైడితల్లి (కోట శ్రీనివాసరావు) – శివరామకృష్ణ (శివరామకృష్ణ). శివరామకృష్ణ అనుచరుడైన రామరాజు (సత్యరాజ్) కోట అనుచరుడైన త్రిమూర్తులు (చలపతిరావు)ను చంపేయడంతో శివరామకృష్ణ ఎమ్మెల్యే అవుతాడు. పవర్ లేకపోవడంతో కోట మరియ్యు త్రిమూర్తుల ముగ్గురు వారసులు రామరాజుపై పగ తీర్చుకోవడానికి సరైన సమయం కోసం వెయిట్ చేస్తుంటారు.

ఇలా కొద్ది సంవత్సరాలు గడిచాక.. రామరాజు అందరికన్నా ఎక్కువగా నమ్మే శ్రీను (అదిత్ అరుణ్)కి తన కూతురు గౌరీ (డింపుల్ చోపడే) వెంట ఎవరో పడుతున్నాడని, వాడి గురించి తెలుసుకొని అవసరమైతే ఫినిష్ చెయ్యమని చెప్తాడు. ఇదే టైంలో శ్రీను – గౌరీల మధ్య ప్రేమ మొదలవుతుంది. ఈ ప్రేమ వల్ల రామరాజు ఇంట్లో కొన్ని సమస్యలు వస్తాయి. అదే టైంలో రామరాజు పార్టీ ఎలక్షన్స్ లో ఓడిపోతుంది. మళ్ళీ పవర్ లోకి వచ్చిన కోట, త్రిమూర్తుల వారసులు రామరాజుని ఏం చేసారు, శ్రీను – గౌరీల ప్రేమకథలో ఏం జరిగిందనేది మిగతా కథ.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

 • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: శ్రీనివాస్ కృష్ణ గోగినేని
 • నిర్మాత: రజని కొర్రపాటి
 • సంగీతం: హరి గౌర
 • పాటలు: చైతన్య ప్రసాద్, రామజోగయ్య శాస్త్రి, సాహితీ గాలిదేవర
 • గానం: హరి గౌర, హేమచంద్ర, కార్తీక్, లిప్సిక, ఎం.ఎల్.ఆర్. కార్తికేయన్
 • ఛాయాగ్రహణం: రాహుల్ శ్రీవాస్తవ్
 • కూర్పు: తమ్మిరాజు
 • నిర్మాణ సంస్థ: వారాహి చలన చిత్రం

విడుదలసవరించు

2015, మార్చి 20న విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనలను, నెగిటివ్ రివ్యూలను అందుకుంది.[2][3][4]

మూలాలుసవరించు

 1. "Real hero of 'Tungabhadra' is producer Sai Korrapati: Director Srinivas". The Indian Express. 16 March 2015. Retrieved 6 May 2020. CS1 maint: discouraged parameter (link)
 2. "Review: Tungabhadra". Apherald.com. Archived from the original on 8 ఆగస్టు 2017. Retrieved 6 May 2020. CS1 maint: discouraged parameter (link)
 3. "'Tungabhadra' Review: Serious, But Bland". greatandhra.com. 21 March 2015. Archived from the original on 11 సెప్టెంబర్ 2017. Retrieved 6 May 2020. Check date values in: |archive-date= (help)CS1 maint: discouraged parameter (link)
 4. "Tungabhadra Telugu Movie Review". 123telugu.com. 20 March 2015. Retrieved 6 May 2020. CS1 maint: discouraged parameter (link)