తుంటరి 2016 లో వచ్చిన కామెడీ సినిమా. [1] కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో, శ్రీ కీర్తి ఫిల్మ్స్‌ పతాకంపై అశోక్, నాగార్జున్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నారా రోహిత్, లతా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు . [2] [3] ఈ చిత్రం తమిళ చిత్రం మాన్ కరాటేకు రీమేక్. [4]

తుంటరి సినిమా పోస్టరు

కథసవరించు

ఐదుగురు ఐటి నిపుణుల బృందం సమీపంలోని అటవీ ప్రాంతానికి ట్రెక్కింగ్ చేయాలని వెళ్ళినపుడు, వారు ఒక ఋషిని చూస్తారు. వారు ఆ ఋషిని వెంబడిస్తారు. అతను నిజమైన అతీంద్రియ శక్తులను కలిగి ఉన్నాడో లేదో పరీక్షించడానికి, వారిలో ఒకరు అతనిని దసరా మరుసటి నాటి వార్తాపత్రికను తయారు చేయమని అడుగుతారు. ఎందుకంటే దసరా రోజున అన్ని పత్రికలకూ సెలవు ఇస్తారు. మరుసటి ఓజున పేపరు రాదని వాళ్ళకు తెలుసు. ఋషి ఈ ఎడిషన్‌ను సృష్టించి, అడవిలోకి వెళ్ళిపోతాడు. వారు వార్తాపత్రికను తెరిచినప్పుడు, వారు పనిచేస్తున్న సంస్థ - నాలుగు నెలల కిందట దాన్ని మూసేసారు - త్వరలో కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయనే వార్త ఉంటుంది. రాజు అనే బాక్సరు, అతని తండ్రి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి, బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంటాడని, 5 కోట్ల ప్రైజ్ మనీని ఈ ఐదుగురు ఐటీ నిపుణులకు ఇస్తాడనీకూడా ఉంటుంది. దీనితో సంతోషించిన వారు రాజు కోసం వెతకడం మొదలుపెడతారు. చివరికి అతనిని వైజాగ్‌లో పట్టుకుంటారు. రాజు ఒక నిర్లక్ష్య వ్యక్తి, నిరుద్యోగి. ఎటువంటి లక్ష్యమూ లేకుండా జీవితాన్ని గడుపుతూంటాడు. మిగిలిన కథ ఏమిటంటే, ఈ బృందం రాజును బాక్సింగ్ నేర్చుకోవటానికి ప్రతిష్ఠాత్మక పోటీని గెలవడానికి ఎలా ఒప్పిస్తారు, అతడు ఆడతాడా, గెలుస్తాడా, ప్రైజు మనీని వీళ్ళకిస్తాడా అనేది మిగతా కథ.

నటులుసవరించు

పాటలుసవరించు

పాటల జాబితా
సంఖ్య. పాటగాయనీ గాయకులు నిడివి
1. "డయమండ్ గర్ల్"  యాజిన్ నజీర్ 5:09
2. "రాజుకే రాజు"  సింహా 4:29
3. "డింగ్ డాంగ్ డార్లింగ్"  కార్తికేయన్, దివిజ కార్తిక్ 3:36
4. "అడగలేదని"  శశిహరన్, దీప్తి పార్థసారథి 4:04
5. "కోనసీమ"  టిప్పు, గీతామాధురి 3:31
మొత్తం నిడివి:
20:49

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=తుంటరి&oldid=3277480" నుండి వెలికితీశారు