తుఏన్‌సాంగ్ జిల్లా
భారతదేశ ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్ రాష్ట్రానికి తూర్పు సరిహద్దులో ఉన్న జిల్లా తుఏన్‌సాంగ్ జిల్లా. జిల్లా కేంద్రంగా తుఏన్‌సాంగ్ పట్టణం ఉంది.
తుఏన్‌సాంగ్ జిల్లా | |
---|---|
నాగాలాండ్ రాష్ట్ర జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | నాగాలాండ్ |
Seat | తుఏన్‌సాంగ్ |
జనాభా (2011) | |
• Total | 1,96,801 |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Website | http://tuensang.nic.in/ |
చరిత్ర
మార్చునాగాలాండ్ రాష్ట్రం ఏర్పాటు చేయబడిన సమయంలో ఏర్పాటుచేయబడిన 3 జిల్లాలలో (మిలిన 2 జిల్లాలు మొకొక్‌ఛుంగ్ జిల్లా, కోహిమా జిల్లా) త్యూయంసాంగ్ఒకటి. ఈ జిల్లా భూభాగం నుండి మోన్ జిల్లా, లాంగ్‌లెంగ్ జిల్లా, కిఫిరె జిల్లా జిల్లాలు రూపొందే వరకు ఈ జిల్లా వైశాల్యపరంగా రాష్ట్రంలో దశాబ్ధాలకాలం ప్రత్యేకత సంతరించుకుంది.
కేంద్రపాలిత ప్రదేశం
మార్చుభారతదేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒకటి అయిన త్యూయంసాంగ్ జిల్లాకు ప్రతేక భుభాగం జిల్లా హోదా ఇవ్వబడింది. నాగాలాండ్ రాష్ట్రంలో మతపరమైన, నాగాసాంఘిక ఆచారాల మీద నిర్భంధాలు ఏమీ విధించబడలేదు. నాగాలాండ్ అసెంబ్లీలో చట్టం అమలు చేసి నాగాల న్యాయవిధానాలు ఎటువంటి మార్పులు లేకుండా కాపాడబడ్డాయి. నాగాలాండ్ భుభాగంలో నాణ్యమైన పాలన కొనసాగించడానికి అవసరమైన ప్ర్త్యేక అధికారలు గవర్నరుకు ఇవ్వబడ్డాయి. రీజనల్ కౌంసిల్ సిఫార్స్, గవర్నర్ అనుమతి లేకుండా నాగాలాండ్ అసెంబ్లీలో ఎటువంటి చట్టం అమలుకు తీసుకురావడానికి వీలుకాదు. త్యూయంసాంగ్ వ్యవహారాలు గమనించడానికి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయబడింది. అసెంబ్లీ నేరుగా ప్రజలచేత ఎన్నుకొనబడదు. గవర్నర్ చేత నియమించబడున రీజనల్ కౌంసిల్ సభ్యులు అసెంబ్లీ సభ్యులను ఎన్నుకుంటారు.నాగాలాండ్ రూపొందించబడిన 10 సంవత్సరాలు తరువాత పాలనావిధానాలు అమలులోకి వచ్చాయి.[1] ప్రత్యేక వధానాలు అమలుచేయబడిన 10 సంవత్సరాల తరువాత (1973లో) ఈ ప్రత్యేక విధానాలు రద్ఫుచేయబడ్డాయి.
భౌగోళికం
మార్చుత్యూయంసాంగ్ జిల్లా మయన్మార్ దేశంతో పొడవైన అంతర్జాతీయ సరిహద్దులను కలిగి ఉంది. జిల్లా ఈశాన్య సరిహద్దులలో మోన్ జిల్లా, ఉత్తర సరిహద్దులో లాంగ్‌లెంగ్ జిల్లా, పడమర సరిహద్దులో మొకొక్‌ఛుంగ్ జిల్లా, జునెబోటొ జిల్లా లు, దక్షిణ సరిహద్దులో కిఫిరె జిల్లాలు ఉనాయి. నాగాలాండ్ రాష్ట్రంలో అత్యంత ఎత్తైన శిఖరమైన (3840 మీటర్లు) మౌంట్ సారామతి ఈ జిల్లాలోనే ఉంది. జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో ప్రధానమైనవి దిఖు, తిజు.
ఆర్ధికం
మార్చు2001లో ఈ జిల్లాలో " లిఖింరో హైడ్రో ప్రాజెక్ట్ " స్థాపినచబడింది. 2006లో పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో తుఏన్‌సాంగ్ ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న నాగాలాండ్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి. .[2]
గణాంకాలు
మార్చువిషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 196,801, [3] |
ఇది దాదాపు | సమోయా దేశ జనసంఖ్యకు సమానం [4] |
అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
640 భారతదేశ జిల్లాలలో | 590వ స్థానంలో ఉంది [3] |
1చ.కి.మీ జనసాంద్రత | |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | |
స్త్రీ పురుష నిష్పత్తి | 930:1000 |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 73.7%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
వృక్షజాలం, జంతుజాలం
మార్చు1984లో తుఏన్‌సాంగ్ జిల్లాలో 6.4 చ.కి.మీ వైశాల్యంలో " ఫకిం వన్యమృగ అభయారణ్యం " స్థాపించబడుంది.[5]
మూలాలు
మార్చు- ↑ "Constitution of India". Archived from the original on 2013-07-03. Retrieved 2014-06-03.
- ↑ 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ 3.0 3.1 3.2 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Samoa 193,161
- ↑ Indian Ministry of Forests and Environment. "Protected areas: Nagaland". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.