మొకొక్‌ఛుంగ్ జిల్లా
నాగాలాండ్ రాష్ట్రజిల్లాలలో మొకాక్‌ఛుంగ్ జిల్లా ఒకటి. మొకాక్‌ఛుంగ్ పట్టణం జీల్లాకేంద్రంగా ఉంది. ఇది ఆవో నాగాలగిరిజనులకు పుట్టిల్లు. జిల్లా వైశాల్యం 1,615 చ.కి.మీ. జిల్లా ఉత్తర సరిహద్దులలో అస్సాం రాష్ట్రం, పడమర సరిహద్దులలో వోఖా జిల్లా, తూర్పుసరిహద్దులలో తుఏన్‌సాంగ్ జిల్లా, దక్షిణ సరిహద్దులలో జునెబోటొ జిల్లా ఉన్నాయి.
మొకొక్‌ఛుంగ్ జిల్లా | |
---|---|
నాగాలాండ్ రాష్ట్ర జిల్లా | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | నాగాలాండ్ |
Seat | మొకొక్‌ఛుంగ్ |
విస్తీర్ణం | |
• Total | 1,615 కి.మీ2 (624 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 1,93,171 |
• జనసాంద్రత | 120/కి.మీ2 (310/చ. మై.) |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
Website | http://mokokchung.nic.in/ |
భౌగోళికం
మార్చుభౌగోళికంగా నాగాలాండ్ రాష్ట్రంలో 6 పర్వతశ్రేణులు ఉన్నాయి. ఒకదానికి ఒకటి సమాంతరంగా ఉన్న ఈ పర్వతశ్రేణులు ఈశాన్యం నుండి నైరుతి దిశగా విస్తరించి ఉన్నాయి. రాష్ట్రం 94.29, 94.76 డిగ్రీలు అక్షాంశం, 26.20, 26.77 డిగ్రీల రేఖాంశం మద్య ఉపస్థితమై ఉంది. మొకాక్‌ఛుంగ్ జిల్లా అంతా ఈ పర్వతశ్రేణుల ద్వారా ఉపవిభాగాలుగా విభజించబడి ఉంది. జిల్లాలో ప్రధాన గ్రామాలు త్యూయన్సాంగ్, చంగ్కి, మిలక్ లోయలు మొదలైనవి. రాష్ట్రంలో ఈ జిల్లా వ్యవసాయపరంగా, పారిశ్రామికంగా దిమాగ్, కోహిమా జిల్లా జిల్లాలులాగా అభివృద్ధిదిశలో ఉంది. చంగ్కి-లాంగ్నాక్, త్యూయంసాంగ్, మిలక్, దిఖు, త్య్యూయంసాంగ్ లోయల భూములు ప్రధానమైనవి. తులి-మిలాక్ భూభాగం, చంగ్కి-లాంగ్నాక్ లోయలు ప్రధాన పారిశ్రామిక కేంద్రాలుగా ఉన్నాయి.
ప్రధాన పర్వతశ్రేణులు
మార్చు- ఒంగ్‌పాంగ్‌కాంగ్.
- అసెత్‌కాంగ్
- చంగ్కికాంగ్
- జపుకాంగ్
- లంగ్‌పాంగ్‌కాంగ్
- త్సురంగ్‌కాంగ్
వాడుకలో ఉన్న భూభాగం
మార్చువర్గీకరణ | ప్రాంతం (కి.మీ2) |
---|---|
మొత్తం భూభాగం | 1615 |
ఫారెస్ట్ డిపార్ట్మెంటు కొనుగోలుచేసిన భూమి | 49.66 |
వ్యవసాయం | 180.39 |
గ్రామాలు, పట్టణాలు | 10.50 |
హార్టి కల్చర్ | 8.12 |
పలు అభివృద్ధి శాఖలు | 386.07 |
ఉపయోగంలో లేని భూమి | 982.62 |
ప్రధాన నగర కేంద్రాలు
మార్చు- అలిచెన్-మొకొక్‌చంగ్- డి.ఇ.ఎఫ్
- తులి పట్టణం
- మాంగ్‌కొలెంబా
- చంగ్తోంగ్యా
పెద్ద గ్రామాలు (2001 గణాంకాలు)
మార్చుపేరు | జనసంఖ్య |
---|---|
చుచుయిమ్లాంగ్ | 9,524 |
చుచుయిమ్లాంగ్ గ్రామం | 7,846 |
చుచుయిమ్లాంగ్ కాంపౌండ్ | 1,678 |
చంగ్కి | 7,718 |
ఉంగ్మ | 7,189 |
లాంగ్‌జంగ్ | 7,005 |
పట్టణాలు
మార్చు- మొకొక్‌చంగ్
- తులి, ఇండియల్ తులి
- మాంగ్‌కొలెంబ
- చంగ్‌యొంగ్య
- లాంగ్‌చెం
- అలాంగ్‌కిమ
- కొబులాంగ్
- ఒంగ్‌పాంగ్‌కొంగ్
- చుచు టౌన్
సెమి-అర్బన్ సెటిల్‌మెంట్స్
మార్చు- అలాంగ్‌తకి
- వరొమంగ్ కాంపౌండ్
- డిబుయియ కాంపౌండ్
- లాంగ్‌జంగ్ కాంపౌండ్
- మొకొక్‌చంగ్ కాంపౌండ్
ఆర్ధికం
మార్చుపారిశ్రామిక భూభాగం
మార్చు- చంగ్‌కి లోయ
- త్దురంగ్ లోయ
- దిగువ మిలక్-తులి భూభాగం
- దిఖు-చిచంగ్ లోయ
విభాగాలు
మార్చుమొకాక్చుంగ్ జిల్లా కేంద్రం మొకాక్‌చుంగ్ పట్టణం. జిల్లాకు దెఫ్యూటీ కమీషనర్ పాలనా బాధ్యతలు వహిస్తున్నాడు. మొకాక్‌చుంగ్ జిల్లా తులి, మాంగ్‌కోలెంబా, చంగ్‌తోంగ్యా అనే 3 విభాగాలుగా విభజించబడి ఉంది. నాగాలాండ్ రాష్ట్రంలో ఇది చాలా ప్రధానమైనది. ఇక్కడి నుండి 10 మంది అసెంబ్లీకి ఎన్నిక చెయ్యబడ్డారు. ప్రస్తుతం ఈ జిల్లకు చెందిన 4 అసెంబ్లీ సభ్యులు అధికార పార్టీలో ఉండగా 6 మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీకి చెందినవారై ఉన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షపార్టీగా అలిచెన్-మొకాక్‌ఛుంగ్ ఉంది.రాష్ట్రంలో అతిపెద్ద నగరప్రాంతంగా ఈ జిల్లా ఉంది.
బ్లాకులు
మార్చు- ఒంగ్‌పాంగ్‌కాంగ్ ఉత్తరం
- ఒంగ్‌పాంగ్‌కాంగ్ దక్షిణం
- కొబులాంగ్
- చంగ్తోంగ్య
- తులి
- మాంగ్‌కొలెంబ
నాగాలాండ్ అసెంబ్లీ నియోజక వర్గాలు
మార్చు- అలాంగ్‌తకి
- జంగ్‌పెత్‌కాంగ్
- ఇంపూర్
- అంగెత్యోంగ్‌పాంగ్
- కొరిదంగ్
- అంగ్లెందెన్
- మొకొక్‌చంగ్ టౌన్
- మొంగొయ
- తులి
- Arkakong
గణాంకాలు
మార్చువిషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 193,171, [1] |
ఇది దాదాపు | సమోవా దేశ [2] జనసంఖ్యకు సమానం |
అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
640 భారతదేశ జిల్లాలలో | 591 వ స్థానంలో ఉంది [1] |
1చ.కి.మీ జనసాంద్రత | |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | |
స్త్రీ పురుష నిష్పత్తి | 927:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే | తక్కువ |
అక్షరాస్యత శాతం | 70.68%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే | తక్కువ |
నాగాలాండ్ రాష్ట్రంలో అత్యధికంగా క్రైస్తవమతం ఆచరణలో ఉంది. దాదాపు జనసంఖ్యలో 95% బాప్టిస్టులు ఉన్నారు. 19వ శతాబ్దంలో నాగాలలో ప్రారంభం అయిన క్రైస్తవ మతం తరువాతరోజులలో కొనసాగింది. క్రైస్తవ చర్చిలలో పెద్ద ఎత్తున సభలు కూడా నిర్వహిస్తుంటారు.
విద్య
మార్చు2001 గణాంకాలను అనుసరించి జిల్లా అక్షరాస్యతా శాతం 84.6%. ఇది రాష్ట్రంలో అత్యధికం, దృశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన జిల్లాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. 2007 గణాంకాలను అనుసరించి ఈ జిల్లా 100% అక్షరాస్యత సాధించడం ప్రత్యేకత. స్త్రీ:పురుషుల నిష్పత్తి 1004:1000. భారతదేశంలోని జిల్లాలలో 6 సంవత్సరాలకు దిగువన ఉన్న పిల్లలలో ఇది అత్యధిక శాతమని అంచనా.
మొకొక్‌చంగ్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు;
- ఇగ్లీష్ కిండర్ గార్టెన్ స్కూల్
- మోడెల్ హైయ్యర్ సెకండరీ స్కూల్
- ఎడిత్ డగ్లాస్ స్కూల్
- క్వీన్ మేరీస్ స్కూల్
- జూబ్లీ మెమోరియల్ స్కూల్
- హిల్ వ్యూ స్కూల్
మొకొక్‌చంగ్ జిల్లాలోని కాలేజీలు :
- క్లర్క్ థియోలాజికల్ కాలేజి
- ఫజి అలి కాలేజి
- పీపుల్స్ కాలేజి
- ఐ.ది.ఐ.టి
- బి.ఇ.డి కాలేజి యిమ్యు
- నేషనల్ బైబిల్ కాలేజి
మాధ్యమం
మార్చు- ఆల్ ఇండియా రేడియో ; మొకొక్‌ఛుంగ్ All India Radio, Mokokchung
- " అయో మిలెన్ (అయో భాషా దినపత్రిక)
- " తిర్ యిమ్యం " (అయో భాషా దినపత్రిక ) [1]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Samoa 193,161
వెలుపలి లింకులు
మార్చు- Mokokchung District at National Informatics Center
- About Mokokchung