జునెబోటొ జిల్లా
నాగాలాండ్ రాష్ట్రంలోని జిల్లాలలో జునేబోటొ ఒకటి.
జునెబోటొ జిల్లా | |
---|---|
నాగాలాండ్ రాష్ట్ర జిల్లా | |
![]() సుమి నాగ పండుగ | |
![]() నాగాలాండ్ లో ప్రాంతం ఉనికి | |
దేశం | ![]() |
రాష్ట్రం | నాగాలాండ్ |
Seat | జునెబోటొ |
జనాభా వివరాలు (2011) | |
• మొత్తం | 1,41,014 |
కాలమానం | UTC+5:30 (భారత కాలమానం) |
జాలస్థలి | http://zunheboto.nic.in/ |
భౌగోళికంసవరించు
జునెబోటొ జిల్లా తూర్పు సరిహద్దులో మొకొక్‌ఛుంగ్ జిల్లా, పడమర సరిహద్దులో వోఖా జిల్లా, ఉత్తర సరిహద్దులో కోహిమా జిల్లా, దక్షిణ సరిహద్దులో కోహిమా జిల్లా ఉన్నాయి. జిల్లా కేంద్రంగా జునెబోటొ పట్టణం సతతహరితారణ్యాలు, చిన్న సెలయేళ్ళు, నదులు ఉన్నాయి. జిల్లాలో సటాయి పర్వతశ్రేణులు సతక సబ్‌డివిషన్ లోని 10 గ్రామాలను చుట్టి ఉన్నాయి. బ్లిత్ ట్రాగోపాన్, కలిజ్ ఫీసెంట్, పీకాక్ ఫీసెంట్ వంటి అతరించిపోతున్న జంతువులిక్కడ ఉన్నాయి.
గణాంకాలుసవరించు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య | 141,014[1] |
ఇది దాదాపు | సెయింట్ లూసియా దేశ జనసంఖ్యకు సమానం [2] |
అమెరికాలోని | నగర జనసంఖ్యకు సమం |
640 భారతదేశ జిల్లాలలో | 605వ స్థానంలో ఉంది [1] |
1చ.కి.మీ జనసాంద్రత | |
2001-11 కుటుంబనియంత్రణ శాతం | |
స్త్రీ పురుష నిష్పత్తి | 981:1000 [1], |
జాతియ సరాసరి (928) కంటే | అధికం |
అక్షరాస్యత శాతం | 86.26%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే | అధికం |
జునెబోటొ జిల్లా సుమీనాగాలకు పుట్టిల్లు. వీరు నాగాలాండ్ గిరిజనజాతులలో భయంకరులుగా భావించబడుతున్నారు. క్రైస్తవ మిషనరీలు ప్రవేశించే వరకు వీరు " హెడ్ హంటింగ్ " (తలను వ్టాడుట) చేస్తూ ఉండేవారు. క్రైస్తవ మిషనరీలు వీరిని క్రిస్టియానిటీకి మార్చారు. ప్రస్తుతం వీరు ప్రశాంత జీవితం సాగిస్తూ ఉన్నారు. వీరు అత్యంత శ్రమకోర్చి జీవించగలిగిన వారు.
విద్యసవరించు
జునెబోటొ జిల్లాలోని లుమామి గ్రామంలో నాగాలాండ్ యూనివర్శిటీ ఉంది. నాగాలాండ్ ప్రజలకిది " సాంస్కృతిక కేంద్రంగా ఉంది. నాగాలాండ్ లోని పలుజాతులకు చెందిన ప్రజలందరూ ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు.
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 1.2 1.3 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2019-01-07. Retrieved 2011-10-01.
Saint Lucia 161,557 July 2011 est.
వెలుపలి లింకులుసవరించు
- Official site
- [1][permanent dead link] List of places in Zunheboto