తుమ్లాంగ్ ఒప్పందం
తుమ్లాంగ్ ఒప్పందం 1861 మార్చిలో బ్రిటిషు సామ్రాజ్యానికి, ప్రస్తుతం భారతదేశంలో ఒక రాష్ట్రమైన సిక్కిం రాజ్యానికీ మధ్య జరిగిన ఒప్పందం. బ్రిటిషు వారి తరపున సర్ ఆష్లే ఈడెన్, సిక్కిం తరఫున అక్కడి చోగ్యాల్ (పాలకుడు) అయిన సిడ్‌కియాంగ్ నామ్‌గ్యాల్ సంతకం చేశారు. ఈ ఒప్పందం సిక్కింకు వెళ్లే ప్రయాణికులకు రక్షణ కల్పించింది, స్వేచ్ఛా వాణిజ్యానికి హామీ ఇచ్చింది. తద్వారా ఈ రాజ్యం బ్రిటిషు ప్రొటెక్టరేట్ లాగా మారిపోయింది.[1]
సంతకించిన తేదీ | 1861 మార్చి |
---|---|
స్థలం | తుమ్లాంగ్ |
స్థితి | సిక్కిం, బ్రిటిషు సామ్రాజ్యపు రక్షిత రాజ్యంగా మారిపోయింది |
సంతకీయులు | బ్రిటిషు సామ్రాజ్యం తరఫున ఆష్లే ఈడెన్, సిక్కిం తరఫున సిడ్కియోంగ్ నంగ్యాల్ |
కక్షిదారులు | British Empire Sikkim |
భాష | ఇంగ్లీషు |
నేపథ్యం
మార్చుఈస్టిండియా కంపెనీ (EIC) క్రమంగా పొరుగున ఉన్న భారతదేశంలోకి ప్రవేశించింది. సిక్కింకు బ్రిటను ఉమ్మడిగా ఒక శత్రువు ఉండేది - నేపాల్ లోని గూర్ఖా రాజ్యం. 1814-16 నాటి ఆంగ్లో-నేపాలీ యుద్ధాన్ని ప్రారంభించడానికి EICని ప్రాంప్ట్ చేయడం ద్వారా గూర్ఖాలు సిక్కిమీస్ తెరాయిని ఆక్రమించారు. యుద్ధం తరువాత, బ్రిటిషు వారికి, గూర్ఖాలకు మధ్య, సిక్కిం బ్రిటిషు భారతదేశాల మధ్య ఒప్పందాలు కుదిరి, బ్రిటను, సిక్కింలు పరస్పరం మరింత దగ్గరయ్యాయి. బ్రిటిషువారి లక్ష్యం సిక్కిం నుండి టిబెట్ కు వాణిజ్య మార్గాన్ని ఏర్పాటు చేయడం. అక్కడ భారతీయ టీకి ఇతర బ్రిటిషు వస్తువులకూ గణనీయమైన మార్కెట్ ఉందని వారు విశ్వసించారు. అదే సమయంలో, ది గ్రేట్ గేమ్ సందర్భంలో, ఆ ప్రాంతంలో పెరిగిన బ్రిటిషు ప్రభావం రష్యన్‌లకు ప్రవేశాన్ని నిరాకరించింది.
నిబంధనలు
మార్చుఒప్పందం ప్రకారం, సిక్కింపై బ్రిటిషు దండయాత్రను ప్రేరేపించినందుకు గాను, అది బ్రిటనుకు రూ 7,000/- నష్టపరిహారం చెల్లిస్తుంది. ఈ మొత్తం, ఏడేళ్ల సిక్కిం రాజ్య ఆదాయానికి సమానం. దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి బ్రిటిషు వారికి అనుమతి ఉంది. ఆర్టికల్ 8 ప్రకారం బ్రిటిషు వ్యక్తుల ప్రయాణ, వాణిజ్యంపై ఉన్న పరిమితులన్నిటినీ రద్దు చేసారు. ఆర్టికల్ 13 సిక్కిం గుండా రహదారిని నిర్మించడానికి అనుమతించింది. దేశంలో అమ్ముడయ్యే అన్ని బ్రిటిషు వస్తువులపై సుంకం ఎత్తివేసారు. దేశం గుండా టిబెట్, భూటాన్, నేపాల్‌లకు రవాణా చేసే వస్తువులపై మాత్రం గరిష్టంగా 5% కస్టమ్స్ సుంకం వేస్తారు.[2]
అనంతర పరిణామాలు
మార్చు1889లో జాన్ క్లాడ్ వైట్, సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లో బ్రిటిషు రాజకీయ అధికారిగా నియమితుడయ్యాడు. వైట్, ఆదాయాన్ని తెచ్చిపెట్టే వ్యవసాయ కార్యకలాపాలను పొరవేశపెట్టాడు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వలస వచ్చేలా ప్రజలను ప్రోత్సహించాడు. అదే సమయంలో, భూటియా సమగ్రతను కాపాడేందుకు భూటియాలు, స్వదేశీ లెప్చాల నుండి వారు తప్ప మరే ఇతర సంఘాలు భూములను కొనుగోలు చేయకుండా నిబంధనలు విధించాడు.
1890 కలకత్తా ఒడంబడిక ద్వారా సిక్కింను బ్రిటిషు ప్రొటెక్టరేట్‌గా చైనా గుర్తించింది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Mullard, Opening the Hidden Land (2011).
- ↑ Arora, Vibha (2008). "Routing the Commodities of Empire through Sikkim (1817-1906)". Commodities of Empire: Working Paper No.9 (PDF). Open University. ISSN 1756-0098.
{{cite book}}
:|work=
ignored (help)