తులిప్ జోషి

మహారాష్ట్రకు చెందిన సినిమా నటి.

తులిప్ జోషి, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. హిందీ, కన్నడ, మలయాళం, తెలుగు సినిమాలలో నటించింది.

తులిప్ జోషి
తులిప్ జోషి
జననం (1979-09-11) 1979 సెప్టెంబరు 11 (వయసు 44)
ముంబై, మహారాష్ట్ర
వృత్తినటి
క్రియాశీలక సంవత్సరాలు2002–2015
భార్య/భర్తకెప్టెన్ వినోద్ నాయర్

జననం మార్చు

తులిప్ జోషి 1979 సెప్టెంబరు 11న మహారాష్ట్ర, ముంబైలోనా గుజరాతీ కుటుంబంలో జన్మించింది.[1] ముంబైలోని జమ్నాబాయి నర్సీ స్కూల్‌లో చదివిన తులిప్, మితిబాయి కాలేజీలో ఫుడ్ సైన్స్, కెమిస్ట్రీలో గ్రాడ్యుయేట్ చేసింది.

మోడల్ మార్చు

తులిప్ 2000లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొన్నది. పాండ్స్, పెప్సీ, సియారం, బిపిఎల్, స్మిర్నాఫ్, టాటా స్కై మొబైల్ టివి మొదలైన వస్తువుల వ్యాపార ప్రకటనలలో నటించింది.

సినిమారంగం మార్చు

దర్శకుడు యష్ చోప్రా కుమారుడు ఆదిత్య చోప్రా భార్యకు తులిప్ స్నేహితురాలు. ఆదిత్యా చోప్రా పెళ్ళిలో తులిప్ ను చూసిన యష్ చోప్రా, ఆడిషన్ కోసం హాజరుకావాలని కోరాడు. దాంతో ఉదయ్ చోప్రా పక్కన మేరే యార్ కి షాదీ హై సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది.[2] రెండు సంవత్సరాల తర్వాత, మాతృభూమి సినిమాలో మళ్ళీ నటించింది. ఈ సినిమాలోని తులిప్ నటనకు ప్రశంసలు వచ్చాయి. ఢోఖా సినిమా కూడా ఆమెకు కాస్త గుర్తింపు తెచ్చిపెట్టింది. 2003లో విలన్‌ అనే తెలుగు సినిమాలో నటించింది. ఆ తరువాత షాహిద్ కపూర్, అయేషా టకియా, సోహా అలీ ఖాన్‌లతో కలిసి దిల్ మాంగే మోర్ సినిమాలో కూడా నటించింది. 2009లో వచ్చిన జగ్ జియోండేయన్ డి మేలే సినిమాతో పంజాబీ సినిమారంగంలోకి అడుగుపెట్టింది. 2011లో యారా ఓ దిల్దారా సినిమాలో హర్భజన్ మాన్‌తో కలిసి నటించింది.[3] 2010లో, ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన సూపర్ అనే కన్నడ సినిమాలో నటించింది. ఈ సినిమా కన్నడలో సూపర్‌హిట్‌గా నిలిచింది.[4] హర్జీత్ రికీ దర్శకత్వంలో 2013 ఆగస్టు 30న వచ్చిన జాట్ ఎయిర్‌వేస్‌ అనే పంజాబీ సినిమాలో అల్ఫాజ్ సరసన నటించింది.[5]

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు
2002 మేరే యార్ కీ షాదీ హై అంజలి శర్మ హిందీ
2003 విలన్ తెలుగు తెలుగు అరంగేట్రం[6]
మాతృభూమి కల్కి హిందీ
2004 దిల్ మాంగే మోర్! ! ! సారా
2006 శూన్య నేహా [7]
2007 మిషన్ 90 డేస్ అనిత మలయాళం
ధోఖా సారా పి. బక్స్/సారా జెడ్. ఖాన్ హిందీ
2008 కభీ కహిన్ సౌదామిని [8]
సూపర్ స్టార్ మౌసం
కొంచెం కొత్తగ తెలుగు [9]
2009 డాడీ కూల్ మరియా హిందీ
జగ్ జియోండేయన్ డి మేలే మిత్ర/ఏకం పంజాబీ
రన్‌వే షైనా హిందీ
2010 సూపర్ మందిర కన్నడ
నిశ్చయ్ కర్ అప్నీ జీత్ కరూన్ సారా ఇంగ్లీష్, పంజాబీ [10]
2011 హాస్టల్ పాయల్ హిందీ
యారా ఓ దిల్దారా డాక్టర్ అమన్ పంజాబీ
బీ కేర్ ఫుల్ ఐటమ్ సాంగ్ హిందీ కవిత[11]
ఐ యామ్ సింగ్ సారా హాసన్ హిందీ
2013 బచ్చన్ మోనికా కన్నడ
జాట్ ఎయిర్‌వేస్ ప్రీతి పంజాబీ
2014 జై హో శ్రీమతి. డిసౌజా హిందీ అతిథి పాత్ర
2014-2015 ఎయిర్ లైన్స్ మొదటి అధికారి/కెప్టెన్ అనన్య రావత్ హిందీ

మూలాలు మార్చు

  1. "Seasons India :: Tulip Joshi". Archived from the original on 2001-07-24. Retrieved 2022-04-15.
  2. "Thumbs Up Thumbs Down". IMDB. 8 Aug 2003. Archived from the original on 2003-08-17. Retrieved 2022-04-15.
  3. "Tulip Joshi's double whammy!". glamsham.com. 30 March 2009. Archived from the original on 2012-09-23. Retrieved 2022-04-15.
  4. "Movie Review:Super: A revolutionary concept". Sify.com. Archived from the original on 2010-12-10. Retrieved 2022-04-15.
  5. "Jatt Airways at CinemaPunjabi.com". CinemaPunjabi.com. Archived from the original on 2017-10-23. Retrieved 2022-04-15.
  6. "Villain Review". Retrieved 2022-04-15.
  7. "Shoonya to premiere at india Film Festival". 3 February 2007. Archived from the original on 2007-02-05. Retrieved 2022-04-15.
  8. "Kabhi Kahin - First Look". Archived from the original on 8 October 2011. Retrieved 2022-04-15.
  9. "Konchem Koththaga Review". Retrieved 2022-04-15.
  10. "Brooke Johnston enters Bollywood". Retrieved 2022-04-15.
  11. "Be Careful cast". Retrieved 2022-04-15.

బయటి లింకులు మార్చు