విలన్

కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో 2003లో విడుదలైన తెలుగు సినిమా

విలన్, 2003 నవంబరు 23న విడుదలైన తెలుగు సినిమా. కనకరత్న మూవీస్ ప్రై లి. బ్యానరులో సింగనమల రమేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు కె. ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో రాజశేఖర్ (ద్విపాత్రాభినయం), నేహా ధుపియా, తులిప్ జోషి నటించగా, విద్యాసాగర్ సంగీతం అందించాడు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలోనే 2002లో విడుదలైన విలన్ అనే తమిళ సినిమా రీమేక్ ఇది. సుజాత, విజయన్ తెలుగులో కూడా అదే పాత్రలలో నటించారు. నేహా ధూపియా, తులిప్ జోషి, విజయన్ లకు తెలుగులో తొలి సినిమా ఇది.

విలన్
దర్శకత్వంకె. ఎస్. రవికుమార్
రచనతోటపల్లి సాయినాథ్ (మాటలు)
స్క్రీన్ ప్లేకె.ఎస్. రవికుమార్
కథయుగి సేతు
దీనిపై ఆధారితంవిలన్ (తమిళం)
నిర్మాతసింగనమల రమేష్ బాబు
ఎ మల్లికార్జు (సమర్పణ)
తారాగణంరాజశేఖర్
నేహా ధుపియా
తులిప్ జోషి
ఛాయాగ్రహణంసి. విజయశ్రీ
కూర్పుకోల భాస్కర్
సంగీతంవిద్యాసాగర్
నిర్మాణ
సంస్థ
కనకరత్న మూవీస్ ప్రై లి.
విడుదల తేదీ
23 నవంబరు 2003 (2003-11-23)
సినిమా నిడివి
159 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

నిర్మాణం

మార్చు

తమిళ విలన్ చూసిన రాజశేఖర్ సినిమాను ఎంజాయ్ చేసాడు కాని రీమేక్ లో నటించడానికి మొదట ఒప్పుకోలేదు. ఇతరులు ఇచ్చిన సలహా, ప్రోత్సాహంతో అతను రీమేక్‌లో నటించడానికి నిర్ణయించుకున్నాడు.[1] నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన నేహా ధుపియా, ఈ సినిమాతో తెలుగు సినిమాల్లోకి అరంగేట్రం చేయడానికి సంతకం చేసింది.[2]

పాటలు

మార్చు

ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతం సమకూర్చాడు.[3] సోహన్ మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. 2003 అక్టోబరు 29న హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో పాటలు విడుదల కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సినిమా ఆడియోను విడుదల చేసి, బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ కు మొదటి క్యాసెట్ అందించాడు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెడ్‌క్రాస్ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ 50 కుట్టు మిషన్లు, వీల్ కుర్చీలను విరాళంగా ఇచ్చాడు. ఎవిఎస్, అనిత ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.[1]

విడుదల, స్పందన

మార్చు

పిల్లల దినోత్సవం సందర్భంగా నవంబరు 14న ఈ సినిమా విడుదల కావాల్సివుంది.[1] ఇడెల్ బ్రేన్ ఈ సినిమాకు 2.75 5 రేటింగ్ ఇచ్చింది. ''దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తెలుగు ప్రేక్షకులకు తగినట్లుగా ఈ సినిమాలో తగినంత మార్పులు చేయలేదు,'' అని పేర్కొన్నారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ జెంటిల్ మేన్ సినిమానుపోలి ఉంటుంది అని సమీక్ష రాశారు.[2] ఫుల్ హైదరాబాద్ ఈ సినిమాకు మిశ్రమ విమర్శ రాసింది.[4] "తెలుగు అనువాదానికి శ్రీ రామకృష్ణ వ్రాసిన సంభాషణలు చాలావరకూ గ్రాంథికంగానూ, కృతకంగానూ ఉన్నాయని" ఫిలిం జర్నలిస్ట్ వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్ విమర్శించాడు.[5]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 "Telugu Cinema Functions - Audio release - Villain - Rajasekhar, Tulip Joshi, Neha Dhupia - Vidya Sagar - KS Ravi Kumar". www.idlebrain.com.
  2. 2.0 2.1 "Telugu cinema Review - Villain - Raja Sekhar, Neha Dhupia, Tulip Joshi - KS Ravi Kumar". www.idlebrain.com.
  3. "Villain songs download". Raaga. Archived from the original on 2021-06-03. Retrieved 2021-06-03.
  4. "Villain review: Villain (Telugu) Movie Review - fullhyd.com".
  5. విలన్: మణిరత్నం రావణ చేష్టలు
"https://te.wikipedia.org/w/index.php?title=విలన్&oldid=4212143" నుండి వెలికితీశారు