తూప్రాన్ మండలం

తెలంగాణ, మెదక్ జిల్లా లోని మండలం

తూప్రాన్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా లోని మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం తూప్రాన్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సిద్దిపేట్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు. మండల కేంద్రం తూప్రాన్.

తూప్రాన్
—  మండలం  —
తెలంగాణ పటంలో మెదక్, తూప్రాన్ స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్, తూప్రాన్ స్థానాలు
తెలంగాణ పటంలో మెదక్, తూప్రాన్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°50′41″N 78°28′48″E / 17.8447°N 78.4800°E / 17.8447; 78.4800
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండల కేంద్రం తూప్రాన్
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 113 km² (43.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 60,580
 - పురుషులు 30,333
 - స్త్రీలు 30,247
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.51%
 - పురుషులు 68.35%
 - స్త్రీలు 40.16%
పిన్‌కోడ్ {{{pincode}}}

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త మెదక్​ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 60,580, పురుషులు 30,333, స్త్రీలు 30,247

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 113 చ.కి.మీ. కాగా, జనాభా 38,637. జనాభాలో పురుషులు 19,222 కాగా, స్త్రీల సంఖ్య 19,415. మండలంలో 8,614 గృహాలున్నాయి.[3]

పేరు వెనుక చరిత్ర మార్చు

ఈ గ్రామానికి ఈ పేరు రావడానికి గల కారణం ఈ గ్రామం తూర్పుకు రాణి వంటిది. కావున తూర్పురాణి అని పిలిచేవారు. కాలక్రమంలో తూర్పురాణి కాస్త తూపురానీగా తరువాత తూప్రాన్గా మారింది.

మండలం లోని గ్రామాలు మార్చు

రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. ఇమ్మాపూర్
  2. అల్లాపూర్
  3. వత్తూరు
  4. జాండపల్లి
  5. నాగులపల్లి
  6. ఇస్లాంపూర్
  7. దాతార్‌పల్లి
  8. గుండారెడ్డిపల్లి
  9. మల్కాపూర్
  10. కోనాయిపల్లి
  11. వెంకటాయిపల్లి
  12. కిష్టాపూర్
  13. యావాపూర్
  14. తూప్రాన్
  15. పదలపల్లి
  16. బ్రాహ్మణపల్లి
  17. వెంకటాపూర్
  18. రావెల్లి
  19. ఘన్‌పూర్
  20. నరసంపల్లి

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 238  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు