తూప్రాన్ రెవెన్యూ డివిజను
తూప్రాన్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. మెదక్ జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 5 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం తూప్రాన్ పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను మెదక్ లోక్‌సభ నియోజకవర్గం, తూప్రాన్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.
తూప్రాన్ రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మెదక్ |
వివరాలు
మార్చుఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3][4]
పరిపాలన
మార్చుతూప్రాన్ డివిజనులోని మండలాలు:[5]
క్ర.సం | తూప్రాన్ రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | ఎల్దుర్తి మండలం | 16 రెవెన్యూ గ్రామాలు |
2 | చేగుంట మండలం | 20 రెవెన్యూ గ్రామాలు |
4 | తూప్రాన్ మండలం | 22 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు) |
5 | మనోహరాబాద్ మండలం | 16 రెవెన్యూ గ్రామాలు |
గమనిక:గతంలో ఈ రెవెన్యూ డివిజనులో 6 మండలాలు ఉండేవి. వాటిలోని నార్సింగి మండలం ఇదే జిల్లాలో కొత్తగా ఏర్పడిన రామాయంపేట రెవెన్యూ డివిజనులో విలీనమైంది.[6]
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-07-09.
- ↑ "Revenue Divisions | District Medak, Government of Telangana | India". www.medak.telangana.gov.in. Archived from the original on 2021-09-04. Retrieved 2022-07-09.
- ↑ Vemula, Prakash (2022-03-12). "List of Revenue Divisions, Mandals in Medak District". TeachersBadi. Archived from the original on 2021-05-14. Retrieved 2022-07-09.
- ↑ "మెదక్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2022-07-09.
- ↑ "రెవెన్యూ డివిజన్‌గా రామాయంపేట". EENADU. Retrieved 2023-12-31.