తూములూరు

ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలోని గ్రామం

తూములూరు, గుంటూరు జిల్లా, కొల్లిపర మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన కొల్లిపర నుండి 4 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తెనాలి నుండి 20 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1678 ఇళ్లతో, 5494 జనాభాతో 582 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2688, ఆడవారి సంఖ్య 2806. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1695 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 502. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590284.[1]

తూములూరు
—  రెవెన్యూ గ్రామం  —
తూములూరు is located in Andhra Pradesh
తూములూరు
తూములూరు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°16′16″N 80°45′10″E / 16.271013°N 80.752676°E / 16.271013; 80.752676
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం కొల్లిపర
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,494
 - పురుషుల సంఖ్య 2,688
 - స్త్రీల సంఖ్య 2,806
 - గృహాల సంఖ్య 1,678
పిన్ కోడ్ : 522304
ఎస్.టి.డి కోడ్ : 08644

గ్రామ చరిత్ర మార్చు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[2]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు మార్చు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

పేరు వెనుక చరిత్ర మార్చు

క్రీస్తు పూర్వం ఉన్న ప్రాచీన గ్రామాలలో తూములూరు ఒకటి. మొదట "తుములూరు"గా ఉన్న ఈ గ్రామం కాలక్రమేణా "తూములూరు"గా మారింది. త్రేతాయుగమున మునుల తపోవనం "తూములూరు" గ్రామమని పురాణ ప్రాశస్తం. ఈ గ్రామం ఒక ప్రాచీన అగ్రహారం. ఊరిలో ప్రాచీన బౌద్ధశాసనం ఒకటి ఉంది. ఊరికి దగ్గరలో ఒక పెద్ద చెరువు ఉంది. ఈ ఊరు మిర్చి పంటకు బాగా ప్రసిద్ధి.

సమీప గ్రామాలు మార్చు

  • కొల్లిపర 4 కి.మీ, జెముడుపాడు 4 కి.మీ, అనంతవరం 5 కి.మీ, చిలుమూరు 5 కి.మీ, చక్రాయపాలెం 6 కి.మీ

విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.

సమీప బాలబడి కొల్లిపరలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల కొల్లిపరలోను, ఇంజనీరింగ్ కళాశాల చింతలపూడిలోనూ ఉన్నాయి. సమీప మేనేజిమెంటు కళాశాల చింతలపూడిలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు గుంటూరులోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల కొల్లిపరలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు గుంటూరులోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం మార్చు

తూములూరులో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం మార్చు

గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఐదుగురు ఉన్నారు.

తాగు నీరు మార్చు

గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు మార్చు

తూములూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్ మొదలైనవి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. ప్రధాన జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి, రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు మార్చు

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. సినిమా హాలు గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది.

విద్యుత్తు మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం మార్చు

తూములూరులో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 103 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 2 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 477 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 14 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 463 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు మార్చు

తూములూరులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 254 హెక్టార్లు
  • బావులు/బోరు బావులు: 209 హెక్టార్లు

ఉత్పత్తి మార్చు

తూములూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు మార్చు

వరి, పసుపు, మొక్కజొన్న

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల మార్చు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల మార్చు

ఈ పాఠశాలలో, 2014, ఏప్రిల్-13, ఆదివారం నాడు, పాఠశాల వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, ఆటలపోటీలు, వ్యాసరచన, వక్తృత్వపు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేసారు.

సరస్వతీ శిశుమందిర్ మార్చు

ఈ పాఠశాలలో, దాతల ఆర్థిక సహకారంతో, 12 లక్షల రూపాయల వ్యయంతో, నూతనంగా నిర్మించిన ఒక భవనాన్ని, 2015, అక్టోబరు-14వ తేదీనాడు, ప్రధాన దాత శ్రీ కొల్లి శివరామిరెడ్డి చేతులమీదుగా, ప్రారంభించారు.

ఈ పాఠశాలలో, దాత కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ డైరెక్టర్ శ్రీ విపిన్.కె.సింఘాల్, వితరణతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను, 2017, జూన్-19న ప్రారంభించారు.

గ్రామంలో మౌలిక వసతులు మార్చు

పాల ఉత్పత్తిదారుల కళ్యాణమండపం.

గ్రామ పంచాయతీ మార్చు

మర్రెడ్డి శివరామకృష్ణా రెడ్డి 1971లో ఈ గ్రామ సర్పంచిగా ఎన్నికై 10 ఏళ్ళపాటు ఆ పదవిలో ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీకి జిల్లాలో ఉత్తమ పంచాయతీగా గుర్తింపు తెచ్చారు. 5 వేల రూపాయల నజరానా అందుకున్నారు. నాటి పంచాయతీ శాఖామంత్రి శ్రీ ఎల్.లక్ష్మణదాసుగారి నుండి ప్రశంసాపత్రాన్నీ, సన్మానాన్నీ పొందినారు. 1983 లో దుగ్గిరాల నియోజకవర్గం నుండి తొలిసారిగా బరిలో నిలిచి విజయం సాధించి రాజకీయాలను మార్చిన ఘనతను స్వంతం చేసుకున్నారు. పలు గ్రామాలలో పేదలకు నివేశన స్థలాలను పంపిణీ చేశారు. లంక గ్రామాల రైతులకు బాసటగా నిలిచారు. గ్రామంలో ఎం.పి.టి.సి. సభ్యులుగా గెలుపొంది మండలాధ్యక్షులుగా సేవలందించారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ గంగా బాల త్రిపుర సుందరీ సమేత లక్ష్మణేశ్వర స్వామి ఆలయం మార్చు

శ్రీరామచంద్రుని సోదరుడైన లక్ష్మణునిచే గ్రామంలో ప్రతిష్ఠింపబడిన పరమశివుని ఆలయమే, నేటికీ శ్రీ లక్ష్మణేశ్వరస్వామి ఆలయంగా విరాజిల్లుతోంది. ఈ గ్రామంలో రు. 1.3 కోట్లతో నిర్మించిన శ్రీ గంగా బాల త్రిపుర సుందరీ సమేత లక్ష్మణేశ్వర స్వామి ఆలయం నిర్మాణం పూర్తి అయినది. ఈ ఆలయ పునఃప్రతిష్ఠామహోత్సవాలలో భాగంగా, 2014, జూన్-1,2,3 తేదీలలో ఆలయంలో, ప్రత్యేకపూజలు నిర్వహించారు. శ్రీ గణపతి, శ్రీ లక్ష్మణేశ్వరస్వామి, శ్రీ బాల త్రిపురసుందరీదేవి, శ్రీ వీరభద్ర-భద్రకాళీదేవి, ద్వారపాలక, నందీశ్వర, సింహవాహన, శిఖర, ద్వజస్తంభ, బలిపీఠ, చండేశ్వర, కాలభైరవ, శ్రీ ఆంజనేయస్వామి, సతీ సమేత నవగ్రహ, యుగళనాగేంద్ర, ఉత్సవమూర్తుల విగ్రహ ప్రతిష్ఠ, 2014, జూన్-5న నిర్వహించారు.

శ్రీ చెన్నకేశవ, ఆంజనేయస్వామివార్ల ఆలయం మార్చు

ఈ గ్రామంలోని శ్రీ చెన్నకేశవ, ఆంజనేయస్వామివార్ల ఆలయంలో నూతన ద్వజస్తంభం, శ్రీదేవీ భూదేవీ అమ్మవార్ల శిలా బింబ ప్రతిష్ఠను పురస్కరించుకొని 2014, మే-11 ఆదివారం నాడు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మద్యాహ్నం గామోత్సవం నిర్వహించారు. సోమవారం నాడు శ్రీ అంజనేయస్వామివారి ఆలయ జీర్ణోద్ధరణ, కలశ ప్రతిష్ఠ నిర్వహించారు.

శ్రీ రేణుకాదేవి ఆలయం మార్చు

ఈ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో భాగంగా 2015, జూన్-5వ తేదీ శుక్రవారంనాడు, అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు పెద్ద యెత్తున పాల్గొన్నారు. సాయంత్రం దీపోత్సవం కన్నులపండువగా సాగింది.

ఈ ఆలయ రజతోత్సవ వేడుకలను, 2017, జూన్-6వతేదీ మంగళవారంనాడు వైభవంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి, పసుపు, కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలు సమర్పించుకున్నారు.

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం మార్చు

20 లక్షల రూపాయల ప్రాథమిక అంచనాతో చేపట్టిన ఈ ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, 2017, జూన్-8వతేదీ గురువారంనాడు, స్వామివారికి ప్రత్యేకపూజలు చేపట్టినారు. నూతన ఆలయ నిర్మాణం చేపట్టనున్న క్రమంలో జీర్ణాలయం నుండి గోమాత సాయంతో, స్వామివారి విగ్రహాన్ని కదిలించి, బాలాలయానికి తరలించారు. జలాభిషేకం, శాంతిహోమం, నవగ్రహ పూజాదికల అనంతరం ధ్వజస్తంభాన్ని తొలగించారు. ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన గ్రామస్థులు, భక్తులు గూడా, తనవంతు సేవలందించారు.

ప్రముఖులు మార్చు

  • వింతల వీరారెడ్డి , జిల్లాలో తొలి మిమిక్రీ కళాకారుడు.

గణాంకాలు మార్చు

  • 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం జనాభా 5683, పురుషుల సంఖ్య 2800, మహిళలు 2883, నివాస గృహాలు 1533, విస్తీర్ణం 582 హెక్టారులు

మూలాలు మార్చు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.
"https://te.wikipedia.org/w/index.php?title=తూములూరు&oldid=4130340" నుండి వెలికితీశారు