తెలంగాణ జన సమితి

తెలంగాణ జన సమితి భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ. దీనిని తెలంగాణ ఉద్యమకారుడూ కోదండరాం స్థాపించాడు.[1][2] అతడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన తెలంగాణ ఉద్యమం కొరకు ఆన్ని పార్టీలతో కూడిన తెలంగాణ జాయింట్ ఏక్షన్ కమిటీ (T-JAC) కు చైర్మన్ గా వ్యవహరించాడు.[3] అతడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్రంలో ప్రొఫెసర్ గా పనిచేసాడు.[4]

Telangana Jana Samithi
వ్యవస్తాపకుడుM. Kodandaram
ప్రధాన కార్యాలయంHyderabad, Telangana, India
రంగుBlue     Green    
వెబ్ సిటు
http://www.telanganajanasamithiparty.org/

చరిత్రEdit

ఈ పార్టీ 2018 మార్చి 31 న తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ ప్రత్యామ్నాయంగా అవతరించింది.[5][6]

ఆశయాలుEdit

ఈ పార్టీ తెలంగాణ ప్రజల యొక్కా రాజ్యాంగ హక్కులను రక్షించడానికి స్థాపించబడినది.

పతాకంEdit

పైన పాలపిట్ట రంగు, కింద ఆకుపచ్చ రంగు, మధ్యలో చక్రంతో జెండా రూపొందించారు. పాలపిట్ట విజయానికి సంకేతమైతే, ఆకుపచ్చ రంగు అభివృద్ధికి చిహ్నమని జెండా విశిష్టతను కోదండరామ్‌ పార్టీ ఆవిర్భావ సభలో వివరించాడు. జెండా మధ్య అమరుల ఆకాంక్షను వ్యక్తం చేసేది చక్రం అన్నాడు.[7]

మూలాలుEdit

  1. Telangana Jana Samithi vows to fulfil people’s wishes
  2. Kodandaram gets EC nod for political dive, names new party Telangana Jana Samithi | Hyderabad News - Times of India
  3. "Archive News". The Hindu. Retrieved 2016-12-01. Cite web requires |website= (help)
  4. "Archive News". The Hindu. Retrieved 2016-12-01. Cite web requires |website= (help)
  5. Telangana Jana Samiti launched | Business Standard News
  6. Kodandaram launches New party as "Telangana Jana Samithi" | The Siasat Daily
  7. "తెలంగాణ జనసమితి జెండా ఆవిష్కరణ". మూలం నుండి 2018-04-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2018-05-01. Cite web requires |website= (help)