బషీరాబాద్

తెలంగాణ, నిజామాబాదు జిల్లా, కమ్మర్‌పల్లి మండలం లోని గ్రామం

బషీరాబాద్, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, కమ్మర్‌పల్లి మండలంలోని గ్రామం.[1]

బషీరాబాద్
—  రెవిన్యూ గ్రామం  —
బషీరాబాద్ గ్రామంలోని కాడిచెరువు
బషీరాబాద్ గ్రామంలోని కాడిచెరువు
బషీరాబాద్ గ్రామంలోని కాడిచెరువు
బషీరాబాద్ is located in తెలంగాణ
బషీరాబాద్
బషీరాబాద్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 18°46′51″N 78°30′41″E / 18.780969°N 78.511399°E / 18.780969; 78.511399
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు
మండలం కమ్మర్‌పల్లి
ప్రభుత్వం
 - Type స్థానిక ప్రభుత్వం
 - సర్పంచి బోడ జమున
జనాభా (2011)
 - మొత్తం 3,981
 - పురుషుల సంఖ్య 1,930
 - స్త్రీల సంఖ్య 2,051
 - గృహాల సంఖ్య 972
పిన్ కోడ్ 503225
ఎస్.టి.డి కోడ్ 08463
వెబ్‌సైటు: http://basheerabadvillage.blogspot.in/

ఇది మండల కేంద్రమైన కమ్మర్ పల్లి నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఆర్మూర్ నుండి 32 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నిజామాబాదు జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]

గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 972 ఇళ్లతో, 3981 జనాభాతో 1844 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1930, ఆడవారి సంఖ్య 2051. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 583 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 22. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 570831[3].పిన్ కోడ్: 503225.

భౌగౌళికం

మార్చు

నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలంలో "బషీరాబాద్"గ్రామం కలదు.జాతీయ రహదారి 63 (కమ్మర్‌పల్లి నుండి భీమ్‌గల్ వెళ్లు మార్గంలో)కు 7 కి.మీ దూరంలో దక్షిణ దిశలో ఉంటుంది.ఈ గ్రామానికి తూర్పున 1.50 కి.మీ దూరంలో చౌట్ పల్లి,ఉత్తరాన హాసకోత్తూర్,పడమరన వడ్యాట్,మోర్తాడ్ గ్రామాలు ఉంటాయి.దక్షిణ దిశలో కొండలు,దట్టమైన అడవి ఉంటుంది.ఈ అడవి గుండా భీమ్‌గల్ వేళ్లు రోడ్డు మార్గం ఉంటుంది.

చరిత్ర

మార్చు

బషీరాబాద్ గ్రామంను పూర్వం వెంకటాపురం అని పిలిచేవారు. ప్రస్తుతం ఉన్న కాడీచెరువు ప్రాంతంలోని లంబడ దుబ్బ ప్రాంతంలో వెంకటాపురం గ్రామం ఉండేది. ఈ ప్రాంతంలో దట్టమయిన అడవి, క్రూరమయిన జంతువులతో ఈ ప్రాంతం నిండుకొని ఉండేది. నైజాం నవాబుల కాలంలో సురక్షిత ప్రదేశానికి ప్రస్తుతం ఉన్న ప్రాంతా నికి తరలించారు. ఈ గ్రామాన్ని బషీర్ అహ్మద్ పరిపాలించేవాడు. ఇతను మరణించడంతో వెంకటాపురం గ్రామాన్ని 'బషీరాబాద్' గా నామకరణం చేశారు. బషీర్ ఆహ్మద్ సమాధి దూలగుట్ట వెనుక భాగంలో చింతల్ చెరువు కట్ట ప్రారంభంలో ఉంది. ఈ సమాధిని 'బషీర్ సాములు' అంటారు. అభిమానులు కొందరు ఇప్పటికీ ఈ సమాధి వద్ద ప్రతి శుక్రవారం పూజలు నిర్వహిస్తుంటారు. ఈ గ్రామాన్ని తదుపరి కాలంలో వలస వాదులయిన ఎల్లాపు దొరలు పరిపాలించారు. భూస్వాములుగా గోపు చొక్కారావు, గోపు జీవన్ రావులు, గోపు వెంకట భాస్కరరావులు ఈ గ్రామాన్ని పరిపాలించారు. ఈ గ్రామస్తులు ఎల్లాపు దొరల భూస్వామ్య పోకడలను ఎదురించడంతో వీరి పరిపాలన అంతరించింది. రెవేన్యూ రికార్డుల్లో కొంతభూభాగాన్ని "వెంకటాపురం"గానే వ్యవహరిస్తున్నారు. గ్రామస్తులంతా ఈ గ్రామాన్ని "వెంకటాపురం"గానె మర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

గ్రామ అభివృద్ధి

మార్చు

బషీరాబాద్ గ్రామం దినదినాభివృద్ది చెందుతుంది. ఈ గ్రామం మొత్తం సిమెంటు రోడ్లతో మంచి డ్రైనేజి సిస్టంతో పరిశుభ్రంగా ఉంటుంది. ఈ గ్రామంలోని యువత అనేక మంది గల్ఫ్ దేశాలకు వెళ్ళడంతో స్థితిపరులయ్యారు. స్థితిపరులయిన వీరు ఈ గ్రామంలో మంచి భవంతులు ఆధునికంగా నిర్మించుకోవడంతో ఈ గ్రామం చిన్నపట్టణంగా సుందరంగా అగుపిస్తుంది. ఆధునిక సాగు పద్ధతులతో అభివృద్ధి చెందుతున్న వ్యవసాయిక గ్రామం.

నీటివనరులు-వ్యవసాయం

మార్చు

వర్షాధారంతోనే కొండల నడుమ కురిసే వాన నీటితోనే "కాడి చెరువు"నిండుతుంది.ఈ చెరువు క్రింద సుమారు ఏకరముల ఆయకట్టు ఖరీఫ్,రబీలో వరి పంట పండిస్తుంటారు.ఇంకా చెరువుకు బ్యాలెసింగ్ రిజర్వాయర్ గా "చింతల్ చెరువు", సాకిరేవు కుంట, బొడ్డెమ్మ కుంటలు ఉంన్నాయి.వీటి క్రింద వరి పంటలు పండిస్తారు.రబీలో పూర్తిస్థాయి వరిపంట వేసేందుకు అనుకూలంగా ఉంటాయి. చౌట్ పల్లి హన్మంత రెడ్డి ఏత్తిపోతల పథకం ద్వారా శ్రీరామసాగర్ జలాలు అందించేందుకు కాడిచెరువుకు అనుసందించారు.ఇంకా గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టు జలాలను కూడా కాడిచెరువులో నింపడం ద్వారా, మోర్తాడ్, దోన్ పాల్ గ్రామాలకు నీరందించెందుకు కాలువల నిర్మాణం చేపట్టారు. గ్రామంలో రైతులు బోరు బావుల ద్వారా మెట్ట పంటలు పండిస్తారు.ఈ గ్రామంలో వ్యవసాయం ప్రధాన వృద్ది.ముఖ్య పంటలుగా వరి, పసుపు, మొక్కజొన్న, సజ్జ, జోన్న, సోయ పంటలు పండిస్తారు.వ్యవసాయం అసక్తి లేని మహిళలు బీడిలు చుట్టి జీవనం సాగిస్తుంటారు.ఇక్కడ ముదిరాజ్ మహిళలు అడవి పండ్లు కొనుకు వచ్చి అమ్ముతుంటారు.

అలయాలు,అధ్యాత్మిక గ్రామం

మార్చు

ఈ గ్రామం అధ్యాత్మికంగా, భక్తి పారవశ్యంతో అలరారుతుంది. ఈ గ్రామం నడిబొడ్డున వేణు గోపాలస్వామి ఆలయం, గ్రామం పడమర దిక్కున "శ్రీ అంజనేయ స్వామి", "మహదేవుడు" ఆలయాలున్నాయి. ఇక్కడ కొలువై ఉన్న గ్రామదేవత ముత్యాలమ్మ చుట్టు ప్రక్కల గ్రామాలవారి పూజలు అందుకుంటు అలరారుతుంది.బొంబాయి, మహారాష్ట్ర ప్రాంతాలనుండి వచ్చి ఈ అమ్మవారిని కొలుస్తుంటారు.ఈ గుడిలో అఖండజ్యోతి ఏప్పుడు వెలుగుతూ ఉంటుంది. గ్రామానికి వాయువ్య దిశలో 2 కి.మీ దూరంలో మర్రిచెట్టులో కలిపిన అమ్మవారు దుర్గమాత శుక్రవారం దేవతగా అలరారుతుంది.ప్రతి శుక్రవారం భక్తులు తమ మొక్కులు చేల్లించుకుంటారు.వసంత పంచమి రోజున జాతర జరుగుతుంది. గ్రామానికి ఉత్తరం దిశన సుమారు కోటి డెబ్భై లక్షలతో షిరిడి సాయిబాబా మందిరం 40 అడుగులతో పంచముఖి హన్మంతుని విగ్రహం నెలకొల్పబడుతుంది. యన్.ఆర్.ఐ. పోలీసు రమేష్ తన డబ్బుతో స్వయంగా ఈ ఆలయ ప్రాంగణాన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడే ముదిరాజ్ అరాధ్య దైవమైన పెద్దమ్మ అలయం ఉంది. గ్రామానికి దక్షిణంగా గుట్టపై పురాతనమైన వేంకటేశ్వరుని ఆలయం కూడా ఉంది.ఇటీవల ఈ ఆలయాన్ని అందంగా పున:నిర్మించారు.భీమ్‌గల్ మార్గంలో బండ్రేవులో రేణుక దేవి (ఏల్లమ్మ) ఆలయం కూడా ఉంది.ఇంకా గ్రామానికి తూర్పున గ్రామదేవతలు చిల్కల చిన్నవ్వ, మహాలక్ష్మి అమ్మవారు, తాతాయి గుడులు ఉన్నాయి.ఇంకా అంజనేయ స్వామి, లక్ష్మి నరసింహ స్వామి, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి మున్నగు ఆలయాలు ఉన్నాయి.ఈ గ్రామంలో సుందర సత్సంగం, స్వాధాయ, భజన మండలి వంటి అధ్యాత్మిక సంఘాలు ఉన్నాయి.ఈ గ్రామాన్ని తరచు శ్రీ సుందర చైతన్యనందస్వామి, హంపి పిఠాధిపతి శ్రీ విద్యారణ్యభారతి స్వామి, శ్రీ త్రిందండి చిన్నజీయర్ స్వామి వార్లు సందర్శిస్తుంటారు.ఈ గ్రామంలో నవరాత్రి దసర ఉత్సవాలు బ్రహ్మండంగా జరుగుతాయి.దేశ, విదేశాలలో ఉంటున్న గ్రామస్థులు దసర ఉత్సవాలకు సెలవు పై తప్పనిసరిగా వస్తుంటారు.

ప్రకృతి ఓడిలో గ్రామం

మార్చు

గ్రామం చుట్టూరా పసుపు, సోయా, మొక్కజొన్న, జొన్న, వరి పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలంగా అగుపిస్తుంది. గ్రామం చుట్టూరా టేకు, శనంగి, మోదుగ, మద్ది, ఈత చెట్లతో కూడిన సుందరమైన వనంతో కూడిన కొండలు అలరిస్తుంటాయి. ఒర్రెల ద్వారా పారే నీటీని ఆపడానికి 4 చెక్ డ్యాములు ఉపాధి హామీ పథకములో నిర్మించారు. కొండల మధ్య కాడి చెరువు జలాశయం సరోవరం లాగా సుందరంగా అగుపిస్తుంటుంది. ఇక్కడ గంగమ్మతల్లి గుడి ఉంది. సంచరించే నెమళ్లు, కుందేలు, చూపరులను మంత్ర ముగ్దుల్ని చేస్తాయి. ఇంకా వనంలో అడవి పందులు, కొండగొర్రెలు, లేళ్లు, దుప్పలు, ఎలుగుబంటులు, చిరుతపులులు కూడా సంచరిస్తుంటాయి.ఇక్కడి అడవిని గ్రామభివృద్ది కమిటి రక్షిస్తుంది.ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిస్తే మంచి పర్యాటక కేంద్రంగా తయారవుతుంది.ఈ కాడిచెరువులో బోటింగ్ షికారు, ఉద్యానవనం, పిల్లల పార్కు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

విద్యాసౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలున్నాయి. నైజాం కాలంనాటి కూలిపోతున్న గెస్టు హౌజ్ ప్రాంతంలో పారిశ్రామిక శిక్షణ కేంద్రం (ఐ.టి.ఐ) కూడా ఉంది. త్వరలో ఇక్కడ జూనియర్ కాలేజి, డిగ్రీ కాలేజిలు ఏర్పడనున్నాయి.పిల్లలు ఆడుకోవడానికి చక్కటి మైదానం ఉంది.

గ్రామంలో రెండుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. ఒక ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణ పాఠశాలఉంది. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది.

సమీప జూనియర్ కళాశాల కమ్మర్ పల్లిలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఆర్మూర్లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల హైదరాబాదులోను, పాలీటెక్నిక్‌ నిజామాబాద్లోను, మేనేజిమెంటు కళాశాల ఆర్మూర్లోనూ ఉన్నాయి. సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఆర్మూర్లో ఉంది.

వైద్య సౌకర్యం

మార్చు

ప్రభుత్వ వైద్య సౌకర్యం

మార్చు

బషీరాబాద్లో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు.

పశు వైద్యశాల గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

మార్చు

గ్రామంలో5 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఐదుగురు ఉన్నారు. రెండు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

మార్చు

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

మార్చు

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

మార్చు

బషీరాబాద్లో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. ప్రైవేటు బస్సు సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

మార్చు

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

మార్చు

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

మార్చు

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

మార్చు

బషీరాబాద్లో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • అడవి: 489 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 539 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 100 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 140 హెక్టార్లు
  • బంజరు భూమి: 92 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 484 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 324 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 252 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

మార్చు

బషీరాబాద్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • బావులు/బోరు బావులు: 180 హెక్టార్లు* చెరువులు: 72 హెక్టార్లు

ఉత్పత్తి

మార్చు

బషీరాబాద్లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

మార్చు

వరి, మొక్కజొన్న, పసుపు

పారిశ్రామిక ఉత్పత్తులు

మార్చు

బీడీలు

రాజకీయాలు

మార్చు

బషీరాబాద్ రాజకీయ చైతన్యంగా ఎదిగిన గ్రామం. దొరల పాలన అంతమైన పిదప ఈ గ్రామాన్ని యువకులే పరిపాలిస్తున్నారు. గ్రామంలో యువతను చైతన్య పరచడంలో నవోదయ యువజన సంఘం ముందుంది. ఈ సంఘం చైతన్య దీపికలైన కీ.శే.డా.మోతిరాం సర్పంచ్ పదవి నిర్వహించగా, పడకంటి రాజశేఖర్ రాజకీ యాల్లో కొనసాగుతున్నాడు.తుక్కడి నారాయణ, కందుకాలసురేష్, మంద చౌదరి, ఆంకడిగంగారాం, కస్తూరి గంగారాం, నీల రాజేశ్వర్, బొమ్మ గంగారాం (రిటైర్డ్ హెడ్ మాస్టర్, మేర గట్ల భూమేశ్వర్, సంఘ సభ్యులే. మాజీ సర్పంచ్ గా సక్కరాం అశోక్ గారు చేశారు. గ్రామ రాజకీయాలలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్న నీరడిసాయన్న, ఏనుగు గంగా రెడ్డిలు ఈ సంఘం చైతన్య దీపికలే.భీమ్ గల్ తాలుకా కేంద్రానికి మొట్టమొదటి పాత్రికేయుడుగా తుక్కడి నారాయణ, పడాల కృష్ణ మోహనరావులు గ్రామాభివృద్ది కోసమై నిర్మాణాత్మక సహాయ సహకారాలు అందించిన వీరుకూడ ఈ సంఘం చైతన్యదీపికలే నవోదయ యువజన సంఘం గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేశారు.రెండు సంఘాల అధ్వర్యంలో సంయుక్తంగా గ్రంథాలయాన్ని నిర్వహింఛారు. నవోదయ యువజన సంఘం పాఠశాల అదనపు గదుల నిర్మాణం, గ్రామంలోని రోడ్లను వెడల్పు చేయించడంలో కృషి సల్పుతూ శ్రమదానం చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి యువజన సంఘం వ్యవస్థాపకులు డా"పడాల జగన్ మోహనరావు, డా"విశ్వనాథంలు, కొండ ఆశన్న, పి.రామరావులు గ్రామ అభివృద్ధిలో నిర్మాణాత్మక సహకారం అందించిన వారే.జగుడం గుండయ్య.పిట్ట్ల శంకర్.సర్పంచులుగా సోదరద్వయం కీ.శే.సక్కరాం నారాయణ, సక్కరాం చిన్నయ్యలు, నేల్ల బక్కన్న, డా"లక్ష్మినర్సయ్య, కీ.శే.పడకంటి ముత్తెన్న, కీ.శే.తుక్కడి కర్రెన్న, కీ.శే.వీరాగౌడ్, పార్వతి చిన్న రాజన్న, గుర్రపు ఎల్లప్ప, జక్కంరాజన్న, డబ్బా గంగారాం, వాచార్ పోశన్న, మోతే ముత్తన్న, మొదలగువారంతా గ్రామ అభివృద్ధిలో చురుకైన పాత్ర వహించినవారే.ఉపాధ్యాయులు వి.శంకర్, అల్లకొండ పోగుల లింగన్న, రత్నపురం లింగన్న, కస్తూరి పెద్ద గంగారాలు ఆధ్యాత్మిక సంపదను పంచుతున్నారు.గ్రామాభివృద్దిలో మహిళల పాత్ర కూడా చురుకైనదే.శ్రీ విజయ లక్ష్మి వెంకన్న సర్పంచ్ గా ఎన్నికై గ్రామాభివృద్దికి పాటు పడ్డారు. మొట్టమొదటి బాల్వాడి పాఠశాల నిర్వహించిన కీ.శే.జె.ముత్తుబాయి కూడా అభినందయురాలే.గ్రామంలో అనేక స్వయం సహాయక మహిళ గ్రూపులు పనిజేస్తూ గ్రామాభివృద్దికి పాటు పడుతున్నాయి.

మండలాలుగా ఏర్పడినప్పటి నుండి మా గ్రామానికి చెందినవారే కమ్మర్ పల్లి మండలాన్ని పరిపాలిస్తున్నారు. మొట్టమొదటి మండల అధ్యక్షుడు గోపు వేంకట బాస్కరరావు బషీరాబాద్ కు చెందినవాడే,ఇదే గ్రామానికి చెందిన గోపి కిషన్ గోపుదేవదాసు మండలాధ్యక్షులుగా ఎన్నికై ఐదేళ్లు పరిపాలించారు. పొరుగునున్న చౌట్ పల్లి గ్రామానికి చెందిన ఏలేటి మహిపాల్ రెడ్డి, మాజి అసేంబ్లీ స్పీకర్.కె.ఆర్.సురేష్ రెడ్డి సహాయ సహకారంతో గ్రామం దినదిన అభివృద్ధి చెందింది.మంత్రిత్వశాఖలున్నట్లుగా ఈ గ్రామ అభివృద్ధి కమిటికి అధ్యక్షులు, కార్యదర్శుల సమక్షంలో సభ్యులకు ఎవరి శాఖలు వారికి కేటాయించగా వారు గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నారు.ఈ కమిటి ప్రతి యేటా కొత్తగా ఏర్పడుతుంది.గ్రామంలో అక్షరాస్యత శాతం పెంపొందుతూ ఇక్కడ చదువుకున్నవారిలో చాలామంది ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు కూడా ఉన్నారు.ఈ గ్రామం నుండి మొట్ట మొదటి ప్రభుత్వ ఉద్యోగులుగా తుక్కడి రాజన్న, కీ.శే.సక్కరాం నారాయణ తమ సేవలను అందించారు.తుక్కడి రాజన్న ఇంజనీరుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. గ్రామానికి చెందిన పోలిసు రమేష్ గల్ప్ దేశాల్లో స్వంత కంపేని నిర్వహిస్తు, గ్రామ యువతకు ఉపాధి కల్పిస్తున్నారు.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-07-31.
  2. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

మార్చు