తెలంగాణ హౌజింగ్ బోర్డు

తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ.

తెలంగాణ హౌజింగ్ బోర్డు, తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉంది. తెలంగాణ పౌరులకు సరసమైన గృహనిర్మాణం అందించడం ఈ బోర్డు కార్యకలాపం. 1960 వరకు సిటీ ఇంప్రూవ్‌మెంట్ బోర్డుగా పిలువబడే బోర్డు 1911లో నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్, అసఫ్ జా VII చేత ఏర్పాటుచేయబడింది.[2]

తెలంగాణ హౌజింగ్ బోర్డు
రకంప్రభుత్వ రంగ
పరిశ్రమగృహాలు
స్థాపన2 జూన్ 2014
ప్రధాన కార్యాలయం,
సేవ చేసే ప్రాంతము
తెలంగాణ
కీలక వ్యక్తులు
బి.ఎం.డి. ఎక్కా, వైస్ చైర్మన్[1]
మాతృ సంస్థగృహనిర్మాణ మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం
వెబ్‌సైట్hb.telangana.gov.in Edit this on Wikidata

చరిత్ర

మార్చు

20వ శతాబ్దం ప్రారంభంలో నిజాం పాలనకాలంలో 1908లో మూసీనది వల్ల హైదరాబాదు నగరంలో పెద్దఎత్తున వరదలు వచ్చాయి. 1911లో ఒక ఘోరమైన ప్లేగు ప్రబలింది. ఆ రెండు సంఘటనల వల్ల నగరంలో జనాభా తగ్గింది. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఈ సమస్యల గురించి తెలుసుకొని తన మంత్రులు, నగర ప్రణాళిక సంఘ సభ్యులతో కలిసి నగర పారిశుధ్యం, పరిశుభ్రతను మెరుగుపరచాలని నిర్ణయించుకున్నాడు. 1912లో నిజాం కుమారుడైన మోజ్జామ్ జా అధ్యక్షుడిగా నగర అభివృద్ధి సంస్థ (సిటీ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు) ఏర్పడింది.[2] మురికివాడల అభివృద్ధి, పేదలకు గృహనిర్మాణం, బహిరంగ భూములు, భూగర్భ పారుదల, రహదారి వెడల్పు పథకాలు, బస్సుల రవాణాకు రోడ్లు వేయడం వంటి నిర్దిష్ట పనులతో నగరాన్ని అభివృద్ధిని చేయడం ఈ సంస్థ ఉద్దేశం. నగరాన్ని మరింత అభివృద్ధి చేయడంకోసం సహకరించిలని సర్ విశ్వేశ్వరయ్యను కోరారు. ప్రాంతీయ మొఘల్ వేరియేషన్ తరహా నిర్మాణంతో నిర్మించిన బషీర్బాగ్‌లోని ఒక భవనంలో ఈ సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించింది, నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ కొనసాగింది.

మూసీ నది పరివారిక ప్రాంతాలైన డబీర్ పూర్, సుల్తాన్ షాహీ, ముగల్ పురా, నాంపల్లి, గన్ ఫౌండ్రీ, రెడ్ హిల్స్, మల్లేపల్లిలోని మురికివాడలు పునరావాస చర్యలు తీసుకున్నాడు. చార్మినార్ సమీపంలోని నిజామియా టిబ్బి హాస్పిటల్, పతేర్‌గట్టి కాంప్లెక్స్, మొజాంజాహి మార్కెట్, తెలంగాణ హైకోర్టు, ఉస్మానియా హాస్పిటల్, సిటీ కాలేజీ మొదలైనవి ఈ బోర్డు నిర్మించింది. ఈ ప్రాజెక్టులకు ఉపయోగించిన గోపురాలు, తోరణాల నిర్మాణాలను ఉస్మానియన్ శైలిగా పిలువబడింది.[2] అంతేకాకుండా, భారతదేశంలోని అనేక ప్రధాన నగరాలకు ముందే హైదరాబాదులో విస్తృతమైన ఉద్యానవనాలు, ప్రణాళికాబద్ధమైన హౌసింగ్ కాలనీలు, త్రాగునీటి తాగునీటి సరఫరా, ప్రత్యేక మురికినీటి కాలువలు, విస్తృత రహదారులు, బస్సు - రైలు సేవలను నిర్మించడం ద్వారా బోర్డు హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి పరిచింది.

భూముల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ 1931లో సికింద్రాబాద్ టౌన్ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ ఏర్పడింది.

లక్ష్యాలు

మార్చు

ప్రజలకు సరసమైన ధరలకు గృహ వసతి కల్పించడం ఈ హౌసింగ్ బోర్డు ప్రధాన లక్ష్యం.[3]

తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్యకలాపాలు:

  • ఇంటిగ్రేటెడ్/కాంపోజిట్ హౌసింగ్ స్కీమ్‌ల కింద ఇళ్ళ నిర్మాణం, లోయర్ ఇన్‌కమ్ గ్రూప్, మిడిల్ ఇన్‌కమ్ గ్రూప్, హయ్యర్ ఇన్‌కమ్ గ్రూప్ కేటగిరీల కింద ఇళ్ళ కేటాయింపు.
  • అధిక ఆదాయ సమూహం, మధ్య ఆదాయ సమూహం # సైట్లు, సేవల కోసం స్వయం ఫైనాన్సింగ్ పథకం
  • బోర్డు ఆర్థిక వనరులను పెంచడానికి దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్తుల భవనాలను అద్దెకు ఇవ్వడం.

మూలాలు

మార్చు
  1. "IAS officers given postings in Telangana". The Hindu. 3 June 2014. Retrieved 8 June 2021.
  2. 2.0 2.1 2.2 K., Venkateshwerlu (11 February 2004). "Chequered past". The Hindu. Archived from the original on 7 ఆగస్టు 2007. Retrieved 8 June 2021. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  3. "About Us". Archived from the original on 2021-06-08. Retrieved 2021-06-08.