ఉస్మానియా జనరల్ హాస్పిటల్

ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (Osmania General Hospital) భారత దేశంలో పేరు గాంచిన ఆసుపత్రి.[1][2][3] ఈ ఆసుపత్రి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అఫ్జల్ గంజ్ ప్రాంతంలో ఉంది. భారత దేశంలో కల పురాతనమైన ఆసుపత్రిలలో ఇది ఒకటి. ఆఖరు నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో నిర్మించబడి తర్వాత అతని పేరు మీద ప్రసిద్ధికెక్కింది.[4] ప్రసుతము ఈ ఆసుపత్రి తెలంగాణా ప్రభుత్వము ద్వారా నడుపబడుతున్నది. 2022, మే 12న రోగుల స‌హాయ‌కుల‌కు మూడు పూట‌లా రూ. 5 కే భోజ‌న కార్యక్రమం ప్రారంభించబడింది. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

ఉస్మానియా జనరల్ హాస్పిటల్
పటం
భౌగోళికం
స్థానంఅఫ్జల్ గంజ్, హైదరాబాదు, తెలంగాణ, భారత దేశం
నిర్దేశాంకాలు17°22′19″N 78°28′26″E / 17.372°N 78.474°E / 17.372; 78.474
వ్యవస్థ
[యూనివర్సిటీ అనుబంధంకాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం
Services
అత్యవసర విభాగంకలవు
పడకలు1168
హెలిపాడ్No
చరిత్ర
ప్రారంభమైనది20 ఏప్రిల్ 1910

చరిత్ర

మార్చు

ఉస్మానియా ఆసుపత్రిని పేదలకు ఉచితంగా వైద్య సహాయం అందించడానికై స్థాపించడం జరిగింది. దీనికి అనుబంధంగా నర్సింగ్ స్కూల్ కూడా ఉంది.

 
ఉస్మానియా ఆసుపత్రి ప్రారంభోత్సవం సందర్భంగా అక్బర్ హైడారి, డాక్టర్ నాయుడు, యువరాణి దుర్రేశ్వర్, కిషెన్ ప్రసాద్ ఉన్నారు.
 
హైదరాబాదు ఉస్మానియా ఆస్పత్రి ఆవరణములో వున్న ఒక చింత చెట్టు. దానికున్న ఒక బోర్డులో వున్న విషయం: 'ఈచెట్టు 1908 వ సంవత్సరంలో వచ్చిన వరదలలో సుమారు 150 మంది ప్రాణాలను కాపాడింది '

పడకలు

మార్చు

ఈ ఆసుపత్రిలో ఉన్న 1168 పడకలలో 363 పడకలు సూపర్ స్పెషాలిటీ, 160 ఎమర్జన్సీ, 685 సాధారణ పడకలు.

సిబ్బంది

మార్చు

ఈ ఆసుపత్రిలో 250 మంది వైద్యులు, అందులో 60 మంది ప్రొఫెసర్లు, 190 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు. 530 కంటే ఎక్కువ నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. 800లకు పైగా నాన్-గజిటెట్ ఉద్యోగులు, క్లాస్-IV ఉద్యోగులు ఉన్నారు. 300 మంది హౌస్ సర్జన్లు, 240 నర్సింగ్ విద్యార్థులు ఉన్నారు.[5]

సదుపాయాలు

మార్చు
 • ఉస్మానియా ఆస్పత్రిలో 7 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన సీటీ స్కాన్‌, క్యాథ్‌ ల్యాబ్‌, అగ్నిమాపక యంత్రం, ఆక్సిజన్ ప్లాంట్ లను 2021, డిసెంబరు 14న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి. హరీశ్‌రావు ప్రారంభించాడు. ఓపీ స్లిప్పుల జారీ కేంద్రం పనులకు శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీలు పాల్గొన్నారు.[6][7]
 • జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 18 ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో రోగుల స‌హాయ‌కుల‌కు మూడు పూట‌లా రూ. 5 కే భోజ‌నాన్ని భోజనం అందించే కార్య‌క్ర‌మం ప్రారంభోత్సవంలో భాగంగా 2022 మే 12న తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హ‌రీశ్‌రావు ఉస్మానియా ఆస్ప‌త్రిలో రూ. 5 కే భోజ‌న కార్యక్రమాన్ని ప్రారంభించాడు. రోగుల స‌హాయ‌కుల‌తో క‌లిసి హ‌రీశ్‌రావు, హోంమంత్రి మ‌హ‌ముద్ అలీ, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తోపాటు ప‌లువురు అధికారులు భోజ‌నం చేశారు. ఉస్మానియా ఆస్ప‌త్రిలో కొత్త‌గా మంజూరైన 75 ఐసీయూ ప‌డ‌క‌ల్లో 40 ఐసీయూ ప‌డ‌క‌ల‌ను ఈ సంద‌ర్భంగా మంత్రి ప్రారంభించాడు.[8][9]

నిధులు

మార్చు
 • 2014-15 బడ్జెటులో ఈ ఆసుపత్రికి 100 కోట్ల రూపాయలు కేటాయించబడింది.
 • ఉస్మానియా ఆస్పత్రికి వచ్చే పేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు, నేషనల్‌ ఆక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ నామ్స్‌ ప్రకారం ఆస్పత్రిలోని పలు విభాగాలతో పాటు ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం 10 కోట్ల 14 లక్షల 67 వేల 437 రూపాలయను మంజూరు చేసింది. ఈ నిధుల నుంచి 6 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకానికి, 4 కోట్ల 14 లక్షల 67 వేల 437 రూపాయలు దవాఖానను కార్పోరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దేందుకు వినియోగించనున్నారు.[10]

నూతన భవన నిర్మాణం

మార్చు

ప్రతిపాదన - హైకోర్టు స్టే

ప్రస్తుత భవనం శిథిలావస్థకు చేరువవతున్నందు వల్ల 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ హాస్పిటల్ ను సందర్శించి, కొత్త భవన నిర్మాణానికి ఆదేశాలు జారీచేశాడు.[11] ఆ తరువాత కొందరు హైకోర్టును ఆశ్రయించి ప్రస్తుత నిర్మాణం కూల్చవద్దని కోర్టులో పిటీషన్ వేసిన నేపథ్యంలో కోర్టు స్టే ఇచ్చింది.

నిపుణుల కమిటీ పరిశీలన

తదనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు వేసిన ఐఐటి హైదరాబాద్ నిపుణుల కమిటీ హాస్పిటల్ అవసరాలకు ఈ భవనం పని చేయదని తేల్చింది.[12]

ప్రజాప్రతినిధుల ఏకగ్రీవ అభిప్రాయం

హైకోర్టు ఆదేశాల ప్రకారం 2023 జూలై 3న సచివాలయంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హ‌రీశ్‌రావు ఆధ్వర్యంలో ఉస్మానియా హాస్పిటల్ నూత‌న నిర్మాణ అంశంపై హాస్పిటల్ పరిధిలోని ప్రజా ప్రతినిధులతో నిర్వహించబడిన స‌మావేశంలో ప్రజల వైద్య అవసరాలకోసం పాత భవనాలు తొలగించి కొత్త భవన నిర్మాణాలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. ఈ స‌మావేశంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[13]

మూలాలు

మార్చు
 1. "Login". www.bl.uk. Archived from the original on 2016-03-05. Retrieved 2018-07-24.
 2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2013-06-26. Retrieved 2021-12-23.
 3. "The Osmania General Hospital, Hyderabad, for H.E.H. The Nizam of Hyderabad".
 4. "Developments of the Nizams" (PDF).
 5. (ఆంగ్లము) తుల్లూరు శ్రీనివాస్ , జి. ప్రసాద్, Patient Satisfaction - A Comparative Study, జర్నల్ అఫ్ ద అకాడెమీ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, Vol. 15, No. 2 (2003-07 - 2003-12) Archived 2009-02-03 at the Wayback Machine
 6. "Osmania | ఉస్మానియాలో సీటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్ ప్రారంభం". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-14. Archived from the original on 2021-12-14. Retrieved 2021-12-23.
 7. "Harish Rao At Osmania Hospital: 'ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్ సేవలు పెంచాలి'". ETV Bharat News. Archived from the original on 2021-12-23. Retrieved 2021-12-23.
 8. telugu, NT News (2022-05-12). "రూ. 6 కోట్ల‌తో ఉస్మానియా మార్చురీ అభివృద్ధి : మంత్రి హ‌రీశ్‌రావు". Namasthe Telangana. Archived from the original on 2022-05-12. Retrieved 2022-05-12.
 9. Velugu, V6 (2022-05-12). "GHMC పరిధిలో రూ.5కే భోజనం". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2022-05-12. Retrieved 2022-05-12.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
 10. telugu, NT News (2022-03-18). "ఉస్మానియాకు రూ.10 కోట్లు". Namasthe Telangana. Archived from the original on 2022-03-18. Retrieved 2022-03-18.
 11. "Work to start on New building after Telangana HC nod, says Harish". The New Indian Express. Archived from the original on 2023-07-06. Retrieved 2023-07-06.
 12. Ashok (2023-07-03). "ప్రజా ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు సమావేశం". Mana Telangana. Archived from the original on 2023-07-06. Retrieved 2023-07-06.
 13. telugu, NT News (2023-07-03). "Osmania Hospital | ఉస్మానియా ఆస్ప‌త్రి నూత‌న నిర్మాణానికి ప్ర‌జాప్ర‌తినిధుల ఏక‌గ్రీవ అభిప్రాయం". www.ntnews.com. Archived from the original on 2023-07-06. Retrieved 2023-07-06.