తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2020)

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు అందజేస్తారు.[1]

సాహితీ పురస్కారాలు (2020)
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలు
వ్యవస్థాపిత 1990
మొదటి బహూకరణ 1990
క్రితం బహూకరణ 2019
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 20,116
Award Rank
2019సాహితీ పురస్కారాలు (2020)2021

1990 నుండి ప్రారంభమైన ఈ పురస్కారంలో రూ. 20,116 నగదు, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరిస్తారు.[2]

పురస్కార గ్రహీతలు

మార్చు

2020 సంవత్సర సాహితీ పురస్కారానికి ఎంపికయిన 11 ఉత్తమ గ్రంథాల వివరాలు 2023, జనవరి 26న తేదీన ప్రకటించబడ్డాయి.[3] ఈ పురస్కారాలు 2023, ఫిబ్రవరి 14న అందజేయబడ్డాయి.

క్రమ

సంఖ్య

గ్రంథం పేరు గ్రంథకర్త పేరు ప్రక్రియ దాత
1 మహా పరిణయము కుంతీపురం కౌండిన్య తిలక్‌ పద్య కవిత
2 ఇంటివైపు అఫ్సర్‌ వచన కవిత
3 వెన్నెల వాకిలి పుప్పాల కృష్ణామూర్తి బాల సాహిత్యం
4 దేవగరట్టు జి. వెంకటకృష్ణ కథానిక
5 దుల్దుమ్మ నేరెల్ల శ్రీనివా్‌సగౌడ్‌ కథా సంపుటి, నవల
6 దుర్భిణి సంగిశెట్టి శ్రీనివాస్‌ నవల, సాహిత్య విమర్శ
7 నవ్వించే నాటికలు అద్దేపల్లి భరత్‌కుమార్‌ నాటకం/నాటిక
8 ఏడవకు బిడ్డా ఏ.ఎం. అయోధ్యారెడ్డి అనువాదం
9 హిందువుల పండుగలు పి. భాస్కరయోగి వచన రచన
10 సబ్బండవాదం వడ్డె ముద్దంగుల ఎల్లన్న గేయ కవిత్వం
11 నీలిగోరింట మందరపు హైమవతి రచయిత్రి ఉత్తమ గ్రంథం

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. ఈనాడు, హైదరాబాదు (18 June 2019). "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు". Archived from the original on 18 June 2019. Retrieved 2023-01-27.
  2. "తెలుగువర్సిటీ సాహితీ పురస్కారాలకు సూచనలు". EENADU. 2022-07-31. Archived from the original on 2022-08-06. Retrieved 2023-01-27.
  3. ABN (2023-01-27). "ఉత్తమ రచనలకు గౌరవం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-01-27. Retrieved 2023-01-27.