తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము భాష ప్రాతిపదిక మీద స్థాపించబడిన విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయం 1985, డిసెంబరు 2న హైదరాబాదులో స్థాపించబడింది. తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు అందజేస్తారు.[1]
సాహితీ పురస్కారాలు (2012) | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | తెలుగు సాహిత్యంలో వెలువడిన ఉత్తమ గ్రంథాలు | |
వ్యవస్థాపిత | 1990 | |
మొదటి బహూకరణ | 1990 | |
బహూకరించేవారు | తెలుగు విశ్వవిద్యాలయం | |
నగదు బహుమతి | ₹ 20,116 |
పురస్కారాలు
మార్చు- తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2012): 2012 సంవత్సర సాహితీ పురస్కారానికి 10 ఉత్తమ గ్రంథాలు ఎంపికయ్యాయి. 2015లో తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.[2]
- తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2013): 2013 సంవత్సర సాహితీ పురస్కారానికి 10 ఉత్తమ గ్రంథాలు ఎంపికయ్యాయి. 2016, జూలై 13న తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. సత్తిరెడ్డి, డా. జుర్రు చెన్నయ్య పాల్గొన్నారు.[3][4]
- తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2016): 2016 సంవత్సర సాహితీ పురస్కారానికి 10 ఉత్తమ గ్రంథాలు ఎంపికయ్యాయి. 2019లో తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.[5][6]
- తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2017): 2017 సంవత్సర సాహితీ పురస్కారానికి 11 ఉత్తమ గ్రంథాలు ఎంపికయ్యాయి. 2019, జూన్ 28వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎస్వీ సత్యనారాయణ ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.[7]
- తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2018): 2018 సంవత్సర సాహితీ పురస్కారానికి 10 ఉత్తమ గ్రంథాలు ఎంపికయ్యాయి. 2021, అక్టోబరు 29వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య తంగెడ కిషన్‌రావు ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.[8]
- తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2019): 2019 సంవత్సర సాహితీ పురస్కారానికి 10 ఉత్తమ గ్రంథాలు ఎంపికయ్యాయి. 2022, జూలై 7వ తేదీన తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన ఆచార్య ఆర్.లింబాద్రి, ఉపకులపతి ఆచార్య తంగెడ కిషన్‌రావు ఈ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు.[9]
- తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2020): 2020 సంవత్సర సాహితీ పురస్కారానికి ఎంపికయిన 11 ఉత్తమ గ్రంథాల వివరాలు 2023, జనవరి 26న తేదీన ప్రకటించబడ్డాయి.[10]
- తెలుగు విశ్వవిద్యాలయము - సాహితీ పురస్కారాలు (2021): 2021 సంవత్సర సాహితీ పురస్కారానికి ఎంపికయిన 10 ఉత్తమ గ్రంథాల వివరాలు 2023, అక్టోబరు 13న తేదీన ప్రకటించబడ్డాయి.[11]
మూలాలు
మార్చు- ↑ ఈనాడు, హైదరాబాదు (18 June 2019). "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాలు". Archived from the original on 18 June 2019. Retrieved 2022-07-08.
- ↑ నవ తెలంగాణ, స్టోరి (16 June 2015). "ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలు". NavaTelangana. Archived from the original on 21 July 2020. Retrieved 2022-07-08.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (14 July 2016). "'సమాజానికి నిజమైన వైద్యులు సాహితీవేత్తలే'". www.andhrajyothy.com. Archived from the original on 12 July 2020. Retrieved 2022-07-08.
- ↑ ఘనంగా సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం, తెలుగువాణి, తెలుగు విశ్వవిద్యాలయ ప్రచురణ, ఏప్రిల్-ఆగస్టు 2016, హైదరాబాదు పుట. 42.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (23 December 2018). "పది మందికి తెలుగు విశ్వవిద్యాలయ అవార్డులు". www.andhrajyothy.com. Archived from the original on 8 July 2020. Retrieved 2022-07-08.
- ↑ డైలీహంట్, నమస్తే తెలంగాణ (23 December 2018). "తెలుగు వర్సిటీ 2016 సాహితీ పురస్కారాలు". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2020. Retrieved 2022-07-08.
- ↑ ఈనాడు, హైదరాబాదు (29 June 2019). "తెలుగువర్సిటీ సాహితీ పురస్కారాల ప్రదానం". Archived from the original on 16 July 2019. Retrieved 2022-07-08.
- ↑ "తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాల ప్రదానం". EENADU. 2021-10-30. Archived from the original on 2023-01-26. Retrieved 2023-01-26.
- ↑ "తెలుగు వర్సిటీ-2019 సాహితీ పురస్కారాల ప్రదానం.. సీనియర్ జర్నలిస్టు కృష్ణారావుకు పురస్కారం". Prabha News. 2022-07-07. Archived from the original on 2023-01-27. Retrieved 2023-01-27.
- ↑ ABN (2023-01-27). "ఉత్తమ రచనలకు గౌరవం". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-01-27. Retrieved 2023-01-27.
- ↑ "తెలుగు వర్సిటీ 2021 సాహితీ పురస్కారాలు". EENADU. 2023-10-13. Archived from the original on 2023-10-14. Retrieved 2023-10-20.