తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి కీర్తి పురస్కారాలు అందజేస్తారు.[1]

కీర్తి పురస్కారాలు
తెలుగు విశ్వవిద్యాలయ భవనం
పురస్కారం గురించి
విభాగం తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంస్కృతి, హేతువాదం, మహిళాభ్యుదయం, అవధానం, ఇంద్రజాలం, సంఘసేవ రంగాలు
వ్యవస్థాపిత 1986
మొదటి బహూకరణ 1986
క్రితం బహూకరణ 2018
బహూకరించేవారు తెలుగు విశ్వవిద్యాలయం
నగదు బహుమతి ₹ 5,116

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారికి కొన్ని పురస్కారాలిచ్చి, వారి ప్రతిభను గుర్తిస్తుంది. దీనిలో భాగమే కీర్తి పురస్కారం. దీన్ని ఇంతకు ముందు వివిధ వ్యక్తులు తమ తమ పేర్లతో పురస్కారాలను ప్రకటించమని, వారి పేర్లతో ‘స్మారక పురస్కారం’ గా ఇచ్చేవారు. దాన్ని తర్వాత కాలంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు ఆ యా వ్యక్తలు పేర్లతోనే పురస్కారాన్ని ఇస్తూ, వాటికి కీర్తి పురస్కారంగా నామకరణం చేశారు.

పురస్కారాలు మార్చు

  1. తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2012): 2012 సంవత్సర కీర్తి పురస్కారానికి 32 మంది ఎంపికయ్యారు. వీరికి 2013, నవంబరు 28న పురస్కారం అందజేయబడింది.[2]
  2. తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2013): : 2013 సంవత్సర కీర్తి పురస్కారానికి 35 మంది ఎంపికయ్యారు.
  3. తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2014): 2014 సంవత్సర కీర్తి పురస్కారానికి 36 మంది ప్రముఖులు ఎంపికయ్యారు. వీరికి 2016, మే 12న పురస్కారం అందజేయబడింది.[3]
  4. తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2015): 2015 సంవత్సర కీర్తి పురస్కారానికి 39 మంది ప్రముఖులు ఎంపికయ్యారు.[4][5]
  5. తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2017): 2017 సంవత్సరంలో 43మంది ప్రముఖులకు కీర్తి పురస్కారం అందించబడింది.[6] తెలుగు విశ్వవిద్యాలయం లలిత కళారంగంలోని వివిధ ప్రక్రియల్లో నిష్ణాతులైన 20 మంది ప్రముఖులకు ఈ సందర్భంగా కీర్తి పురస్కారాలను ప్రదానం చేసింది.[7]
  6. తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2018): 2018 సంవత్సరంలో 44మంది ప్రముఖులకు కీర్తి పురస్కారం అందించబడింది.[8][9]
  7. తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2019): 2019 సంవత్సర కీర్తి పురస్కారానికి 44 మంది ఎంపికయ్యారు. వీరికి 2022, సెప్టెంబరు 15న పురస్కారం అందజేయబడింది.[10]
  8. తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2020): 2020 సంవత్సర కీర్తి పురస్కారానికి 44 మంది ఎంపికయ్యారు.
  9. తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2021): 2021 సంవత్సర కీర్తి పురస్కారానికి 45 మంది ఎంపికయ్యారు.[11]
  10. తెలుగు విశ్వవిద్యాలయము - కీర్తి పురస్కారాలు (2022): 2022 సంవత్సర కీర్తి పురస్కారానికి 46 మంది ఎంపికయ్యారు.

మూలాలు మార్చు

  1. నవతెలంగాణ (30 April 2016). "కీర్తి పురస్కారాలు ప్రకటించిన తెలుగు విశ్వవిద్యాలయం". Retrieved 4 May 2018.
  2. సాక్షి, ఆంధ్రప్రదేశ్ (21 November 2013). "32 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". Archived from the original on 27 May 2019. Retrieved 27 May 2019.
  3. నమస్తే తెలంగాణ (13 May 2016). "ప్రతిభామూర్తులకు కీర్తి పురస్కారాలు". Archived from the original on 23 July 2018. Retrieved 2022-07-07.
  4. "తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు వీరికే". Sakshi. 2017-03-09. Archived from the original on 2017-08-21. Retrieved 2022-09-15.
  5. "39మందికి తెలుగు వర్శిటీ కీర్తి పురస్కారాలు". andhrabhoomi.net. Archived from the original on 2017-03-13. Retrieved 2022-09-15.
  6. ఈనాడు (డైలీహంట్) (13 October 2015). "43 మందికి తెలుగువర్సిటీ కీర్తి పురస్కారాలు". Archived from the original on 15 October 2018. Retrieved 2022-07-07.
  7. https://www.ntnews.com/district/hyderabad/article.aspx?contentid=869115
  8. telugu, NT News (2021-12-30). "Telugu University | కీర్తి పురస్కారాలను ప్రకటించిన తెలుగువర్సిటీ". Namasthe Telangana. Archived from the original on 2022-07-07. Retrieved 2022-07-07.
  9. "44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". EENADU. 2021-12-31. Archived from the original on 2022-07-07. Retrieved 2022-07-07.
  10. "44 మందికి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలు". EENADU. 2022-09-03. Archived from the original on 2022-09-03. Retrieved 2022-09-07.
  11. Global, Telugu (2023-08-24). "తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రకటన". www.teluguglobal.com. Archived from the original on 2023-09-13. Retrieved 2023-09-13.