తెలుగు సినిమా అవార్డులు
- రఘుపతి వెంకయ్య అవార్డు : తెలుగు చలనచిత్రజగతి పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు పేరిట ఆంధ్రప్రదేశ్రాష్ట్ర ప్రభుత్వం 1980లో ఓ అవార్డును నెల కొల్పి, తెలుగు చలనచిత్ర రంగానికి ఎనలేని సేవలందించిన వారికి లైఫ్‌టైమ్ ఎఛీవ్‌మెంట్‌గా ప్రదానం చేస్తోంది.
- ఎన్. టి. ఆర్. జాతీయ అవార్డు : ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1996 లో నెలకొల్పింది.[1] [2] 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తరువాత నిలిపివేసింది.
- నంది అవార్డు : నంది పురస్కారాలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఏటా ఇచ్చే పురస్కారాలు. తెలుగు చరిత్ర, కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు,, ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 సంవత్సరములో ప్రారంభమైనది.
- అకాడమీ పురస్కారాలు : ఆస్కార్ అవార్డుగా ప్రసిద్ధిచెందిన అకాడమీ అవార్డులు ప్రతీ యేటా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక బహుమతులు.
- కళైమామణి పురస్కార గ్రహీతలు : కళైమామణి (అధికారికంగా జయలలిత అవార్డ్) తమిళనాడు రాష్ట్రంలో ప్రదానం చేయబడుతున్న ఒక పురస్కారం. ఈ పురస్కారాలను "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" (తమిళనాడు సాహిత్య సంగీత నాటక ఫోరమ్) సాహిత్య, సంగీత, నాటక కళా రంగాలలో ఉత్తమ ప్రదర్శన ఇచ్చినవారికి ప్రకటిస్తున్నది.
- భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
- దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం
మూలాలు
మార్చు- ↑ "NTR National Award from 2003 to 2006".
- ↑ "Governor gives away NTR awards". The Hindu. Archived from the original on 2010-02-16. Retrieved 2017-04-27.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)