గంగ, యమున, సరస్వతి అనే మూడు నదులు. త్రివేణీసంగమం అంటే ఈ మూడు నదులు కలిసే చోటు. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదు సమీపానగల ప్రయాగ వద్ద ఉంది. గంగ, యమునలు కనిపించే నదులు కాగా మూడోదైన సరస్వతి అంతర్వాహినిలా వచ్చి కలుస్తోంది.
త్రివేణి సంగమం (సినిమా) : 1983 నవంబరు 12 లో విడుదలైన తెలుగు చిత్రం. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద కె.రాఘవ నిర్మించిన ఈ సినిమాకు కొమ్మినేని కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు. సుమన్, వనితశ్రీ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]