త్రివేణి సంగమం (నది)

త్రివేణి సంగమం అనేది మూడు నదుల కలయిక

త్రివేణి సంగమం అనేది మూడు నదుల కలయిక (త్రి అనగా మూడు, వేణి అనగా నది). ఇక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి పూర్వజన్మ నుండి విముక్తి లభిస్తుందని ఒక నానుడి.

నాసిక్ లో త్రివేణి సంగమం

ప్రయాగ్ రాజ్

మార్చు

గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం. ఇక్కడ గంగా నది నీరు స్పష్టంగా ఉంటుంది, యమునా నది ఆకుపచ్చ రంగులో, సరస్వతి నది అంతర్వాహిని గా ఉంటుంది. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి కుంభమేళా నిర్వహిస్తారు.[1] [2]

నాసిక్

మార్చు
 
త్రివేణి సంగమం నాశిక్
నాసిక్ గోదావరి హారతి

ఇది మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లాలో ఉంది. ఇక్కడ అరుణ, వరుణ, గోదావరి నదులు కలుస్తాయి.

పశ్చిమ బెంగాల్

మార్చు

పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లాలోని త్రిబేని పట్టణంలో, గంగా నది, భాగీరథి, హుగ్లీ కలుస్తాయి. వీటిని గంగా, జమున, సరస్వతి అని పిలుస్తారు.

గుజరాత్

మార్చు

గుజరాత్ లోని త్రివేణి సంగమం, గిర్-సోమ్‌నాథ్ జిల్లాలోని సోమనాథ్, వెరావల్ సమీపంలో ఉంది. ఇక్కడ హిరాన్, కపిల, సరస్వతి నదులు కలుస్తాయి. ఈ మూడు నదులు కలిసి పశ్చిమ తీరంలోని అరేబియా సముద్రంలో కలుస్తాయి.[3]

కాళేశ్వరం

మార్చు

ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది.[4]

కూడుతురై

మార్చు

ఇది కూడుతురైలోని ఈరోడ్ ఉంది. ఇక్కడ కావేరీ, భవానీ, అముదా నదులు కలుస్తాయి.[5] దీనిని దక్షిణ త్రివేణి సంగమం అని అంటారు.

భాగమండల

మార్చు

భాగమండల కర్నాటక లోని కొడగు జిల్లాలోని ఒక పుణ్యక్షేత్రం. ఇక్కడ కావేరీ, కన్నికే, సుజ్యోతి అనే నదులు కలుస్తాయి.

తిరుమకూడలు నరసిపుర

మార్చు

తిరుమకూడలు నరసిపుర లేదా టి. నరసిపుర కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ జిల్లాలోని ఒక పట్టణం. ఇక్కడ కావేరీ, కబిని, స్పటిక సరోవర నదులు కలుస్తాయి. ఇక్కడ ప్రతి మూడు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళాని నిర్వహిస్తారు.

మూవట్టుపూజ

మార్చు

ఇక్కడ కాళియార్, తోడుపుజయార్, కొతయార్ అనే మూడు నదులు కలుస్తాయి.

మున్నార్

మార్చు

మున్నార్ అనగా మూడు నదులు అని అర్ధం. ముధిరపూజ, నల్లతన్ని, కుండల నదులు కలిసిపోయే ప్రదేశం.

కందకుర్తి

మార్చు

ఇది తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా , రెంజల్ మండలంలోని గ్రామం. ఇక్కడ గోదావరి నది, మంజీర, హరిద్రా నదులు కలుస్తాయి.

భిల్వారా

మార్చు

ఇది భారతదేశం లోని రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక జిల్లా. ఇక్కడ బనాస్ నది బెరాచ్, మెనాలి నదులతో కలిసిపోతుంది[6].

మూలాలు

మార్చు
  1. Mohan, Vineeth (2016-09-19). "Places Connected To Lord Rama And Ramayana - Prayag". www.nativeplanet.com. Retrieved 2021-01-20.
  2. "Triveni Sangam". prayagraj.com. Archived from the original on 8 December 2015. Retrieved 3 December 2015.
  3. "Triveni Sangam". gujrattourism. Retrieved 2022-07-30.
  4. INDIA, THE HANS (2016-06-14). "Kaleshwaram temple to get a makeover". www.thehansindia.com. Retrieved 2022-07-30.
  5. "Dakshina Triveni Sangamam - Sangameswarar Temple!". TeluguOne Devotional. Retrieved 2022-07-30.
  6. "बीगोद के त्रिवेणी संगम: वे विसर्जित अस्थियों में खोजते हैं सोना-चांदी | Triveni Sangam of Beagod". Patrika News. 2019-02-05. Retrieved 2022-07-30.