దక్షిణ 24 పరగణాల జిల్లా

వెస్ట్ బెంగాల్ లోని జిల్లా

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర 20 జిల్లాలలో దక్షిణ 24 పరగణాలు జిల్లా (బెంగాలీ:দক্ষিণ চব্বিশ পরগণা জেলা) ఒకటి. అలిపోర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లకు ఒకవైపు కొలకత్తా నగరప్రాంతాలు మరొక వైపు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అత్యంత అధిక జనసంఖ్య కలిగిన భారతీయ జిల్లాలలో ఇది 6 వ స్థానంలో ఉంది.[1] ఇది కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా ఉంది.

South 24 Parganas జిల్లా
দক্ষিণ চব্বিশ পরগণা জেলা
West Bengal పటంలో South 24 Parganas జిల్లా స్థానం
West Bengal పటంలో South 24 Parganas జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంWest Bengal
డివిజనుPresidency
ముఖ్య పట్టణంAlipore
Government
 • లోకసభ నియోజకవర్గాలుJaynagar, Mathurapur, Diamond Harbour, Jadavpur, Kolkata Dakshin
 • శాసనసభ నియోజకవర్గాలుGosaba, Basanti, Kultali, Patharpratima, Kakdwip, Sagar, Kulpi, Raidighi, Mandirbazar, Jaynagar, Baruipur Purba, Canning Paschim, Canning Purba, Baruipur Paschim, Magrahat Purba, Magrahat Paschim, Diamond Harbour, Falta, Satgachia, Bishnupur, Sonarpur Dakshin, Bhangar, Kasba, Jadavpur, Sonarpur Uttar, Tollyganj, Behala Purba, Behala Paschim, Maheshtala, Budge Budge, Metiaburuz
Area
 • మొత్తం9,960 km2 (3,850 sq mi)
Population
 (2011)
 • మొత్తం81,53,176
 • Density820/km2 (2,100/sq mi)
 • Urban
10,89,730
జనాభా వివరాలు
 • అక్షరాస్యత78.57 per cent
 • లింగ నిష్పత్తి937
ప్రధాన రహదార్లుNH 117
సగటు వార్షిక వర్షపాతం1750 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

చరిత్ర మార్చు

మహారాజా ప్రతాపాదిత్య మార్చు

ఒకప్పుడు మహారాజా ప్రతాపాదిత్య, విక్రమాదుత్యాలకు ధుమఘాట్ రాజధానిగా ఉంటూ వచ్చింది. తరువాత అది ఈశ్వరీపూర్‌గా ( మూలం జెషోఋఏశ్వర్) మార్చబడింది. భారతదేశంలోని మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మహారాజా ప్రతాపాదిత్య దక్షిణబెంగాలుకు (ఉత్తరంలో జెస్సోర్, ఖుల్నా, దక్షిణంలో సునదర్బన్, బే ఆఫ్ బెంగాల్, తూర్పులో బరిసల్, పశ్చిమంలో గంగానది ) స్వాతంత్ర్యం ప్రకటించాడు.

ఆలయాలు , మసీదులు మార్చు

మహారాజా ప్రతాపాదిత్య జషోరేశ్వరి కాలి ఆలయాన్ని నిర్మించాడు. ఈశ్వరీపూర్ వద్ద ఉన్న చందా భైరబ్ మందిర్ (పిరమిడ్ ఆకార ఆలయం) సేనా పాలనా కాలంలో నిర్మించబడింది. మొగల్ పాలనా సమయంలో బంషీపూర్ వద్ద నిర్మించబడిన " ఐదు గోపురాల టంగా మసీదు ", 1593లో మహారాజా బంగ్షిపూర్ వద్ద నిర్మించిన 2 పెద్దవి 4 చిన్న గోపురాలతో నిర్మించబడిన హమ్మంఖానా, కాంపూర్ వద్ద ఉన్న జహాజ్ఘటా రేవు జిల్లాలోని ప్రధానమైన నిర్మాణాలుగా గుర్తించబడుతున్నాయి.

మాహారాజా ప్రతాపాదిత్య మార్చు

జెసోర్ రాజు ప్రతాపాదిత్య అలాగే బెంగాల్ బారా- భూయుయాన్లలో ఒకడు. 17వ శతబ్ధంలో ప్రతాపాధిత్య మొగల్ చక్రవర్తుల సైన్యాలతో పోరాడాడు. ఆయన తండ్రి శ్రీహరి (శ్రీధర్) కాయస్తుడు. దావూద్ ఖాన్ కర్రాని ఆస్థానంలో పలుకుబడి కలిగిన అధికారిగా ఉండేవాడు. దావూద్ పతనం తరువాత ఆయన ప్రభుత్వ ఖజానాతో పారిపోయాడు. 1574లో కుల్నా జిల్లాకు దక్షిణంగా చిత్తడి భూములలో శ్రీహరి స్వయంగా రాజ్యాన్ని స్థాపించి మహారాజా బిరుదును స్వీకరించాడు. 1574లో మహారాజా శ్రీహరి తరువాత ఆయన తనయుడు మహారాజ పదవిని స్వీకరించాడు. బహరుస్థాన్ యాత్రికుడు అబ్దుల్ లతీఫ్, సమకాలీన రచయుతలు అందరూ ప్రతాపాదిత్య శక్తిసామర్ధ్యాలకు, ఆయన రాజకీయ ఔన్నత్యానికి, వస్తు సంపదకు, బలమైన యుద్ధనౌకా సామర్ధ్యానికి సాక్ష్యంగా నిలిచారు. ప్రస్తుత గ్రేటర్ జెస్సోర్, ఖుల్నా, బారిసల్ జిల్లాలు ఒకప్పటి మహారాజా ప్రతాపాదిత్య రాజ్యంలో భాగంగా ఉండేది. ఆయన జమునా, ఇచ్చామతీ నదుల సంగమస్థానంలో వ్యూహాత్మకంగా ధూంఘాట్‌ను తన రాజధానిగా చేసుకుని పాలన సాగించాడు.

మొగల్ పాలకులతో యుద్ధం మార్చు

బెంగాల్ జమీందార్లలో ఒకరైన ప్రతాపాధిత్య మొదటగా ఇస్లాం ఖాన్ చిస్తి వద్దకు విలువైన కానుకలో దూతను పంపాడు. మొగలు ప్రభుత్వ అనుకూలత కొరకు చేసిన ఈ ప్రయత్నం ఫలితంగా 1609లో ఆయన సుబేదార్ అయ్యాడు. ముసాఖానుకు వ్యతిరేకంగా సాగించే పోరులో సైనికసహాయం, ఇతరసేవలు అందిస్తానని ప్రతాపాధిత్య ఇస్లాం ఖాన్ చిస్తికు మాట ఇచ్చాడు. అయినా ఆ మాట మాత్రం నిలువలేదు. ప్రతాపాధిత్య విశ్వసరాహిత్యానికి దండనగా ఘియాస్ ఖాన్ ఆధిపత్యంలో బృహత్తర దాడిసల్పి ఈ ప్రాంతాన్ని స్వాధీనపరచుకున్నారు. తరువాత జమున, ఇచ్చామతి నదీ సంగమంలో ఉన్న ఈ ప్రాంతానికి 1611 సల్కా అని నామకరణం చేయబడింది. తరువాత ప్రతాపాదిత్య ఫెరింగ్స్, ఆఫ్గనీయులు, పఠానుల సాయంతో బలమైన సైన్యాలను ఏర్పరచుకున్నాడు. ఆయన పెద్దకుమారుడు ఉదయాదిత్య సల్కా వద్ద సహజసిద్ధమైన సరిహద్దులలో నిర్భేద్యమైన కోటను నిర్మించాడు. తరువాత జరిగిన యుద్ధంలో ఉదయాదిత్య సైన్యం ముందుగా విజయపథంలో సాగినప్పటికీ తరువాత సామ్రాజ్యానికి చెందిన సైన్యం ఉదయాదిత్య సైన్యంలో ఐకమత్యాన్నీ, క్రమశిక్షణను చెడగొట్టి ఉదయాఫిత్యపై విజయం సాధించాయి. నిస్సహాయుడైన ఉదయాదిత్య తండ్రితో కోటను విడిచి పారిపోయాడు. తరువాత జమాల్ఖాన్ కోటను ఖాళీ చేసి ఉదయాదిత్యను అనుసరించాడు.

ప్రతాపాదిత్య ద్వితీయ పోరాటం మార్చు

కాగర్ఘాట్ కాలువ, జమునా నది సంగమంలో ప్రతాపాదిత్య రెండవసారి పోరాటం చేయడానికి సిద్ధం అయ్యాడు. అక్కడ ఆయన వ్యూహాత్మకంగా పెద్ద కోటను నిర్మించి తనకు అనుకూలంగా పెద్ద సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. 1612లో ప్రతాపాదిత్య మీద దాడిచేసి ఆయనను కోటలో నిర్భంధించారు. తరువాత చక్రవర్తి సైన్యం జెస్సోరును పూర్తిగా ఓడించి కోటను స్వాధీనం చేసుకుని ప్రతాపాదిత్యను బంధీకృతుని చేసాయి. గియాస్‌ఖాన్ ప్రతాపాదిత్యను ఢాకాలో ఉన్న ఇస్లాం ఖాన్ వద్దకు తీసుకువెళ్ళాడు. ఇస్లాం ఖాన్ జెస్సోర్ రాజును బంధించి జెస్సోర్ రాజ్యాన్ని స్వాధీనపరచుకున్నాడు. తరువాత ప్రతాపాదిత్య ఢాకాకారాగారంలో చాలాకాం ఉన్నడు. తరువాత ప్రతాపాదిత్య చివరిదశ తెలియనప్పటికీ ఢిల్లీకి వెళ్ళేదారిలో వారణాశి వద్ద మరణించినట్లు భావిస్తున్నారు [2]

ఆర్ధికం మార్చు

వ్యవసాయం, పరిశ్రమ, మత్యపరిశ్రమ జిల్లాలో ఉన్నతస్థాయిలో ఉన్నాయి. జిల్లా పశ్చిమ భూభాగం భారతీయ ప్రత్యేక ఆర్థిక భూభాగం జాబితాలో చేర్చబడింది. ఈ జాబితాలో వివిధ రకాల పరిశ్రమలు చేర్చబడ్డాయి. 2006లో పంచాయితీ మంత్రిత్వశాఖ దక్షిణ 24 పరగణాలు జిల్లాను భారతీయ అత్యంత వెనుకబడిన జిల్లాలల ఒకటిగా గుర్తించింది.

విభాగాలు మార్చు

ఉపవిభాగాలు మార్చు

జిల్లా 5 ఉపవిభాగాలు ఉన్నాయి:- అలిపోర్ సర్దార్, బరుయీపూర్, కన్నింగ్, డైమండ్ హార్బర్, కాక్‌ద్వీప్.

అలిపోర్ జిల్లాకు కేంద్రగా ఉంది. జిల్లాలో 33 పోలీస్ స్టేషన్లు, 29 డెవెలెప్మెంటు బ్లాకులు, 7 పురపాలకాలు, 312 గ్రేమపంచాయితీలు ఉన్నాయి. [3] సునర్బన్ ప్రాంతంలో 13 కమ్యూనిటీ డెవెలెప్మెంట్లు ( సాగర్, నంఖానా, కాక్‌ద్వీప్, పాథర్ప్రతిమ, కుల్తి, మథురాపుర్ -1, మథురాపూర్ -2, జాయ్నగర్-1, జాయ్నగర్-2, కన్నింగ్-1, కన్నింగ్-2, బసంతి, గోస్బా ) ఉన్నాయి.[3] జిల్లాలో 37 ద్వీపాలున్నాయి.[3] పూరపాలకాలే కాక ఒక్కొక ఉపవిభాగంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు కలిగిన కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు ఉన్నాయి. మొత్తంగా జిల్లాలో 21 నగరప్రాంతాలు, 7 పురపాలకాలు, 14 పట్టణాలు ఉన్నాయి. [3][4]

అలిపోర్ సాదర్ ఉపవిభాగం మార్చు

అలిపోర్ సాదర్ ఉపవిభాగం 3 మునిసిపాలిటీలు, 2 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాక్‌లు ఉన్నాయి.

 • కొలకత్తా మునిసిపల్ కార్పొరేషన్‌లోని నగరప్రాంతాలు:- అలిపోర్, న్యూ అలిపోర్, గార్డెన్‌రీచ్, తర్తల, బెహల, భొవనిపోర్, కాలీఘాట్, టాలీగంజ్, జాదవ్పూర్, బలీగంజ్, కుస్తియా, గరియాహట్.
 • 3 పురపాలకాలు :- బుడ్జ్ బుడ్జ్, పూజలి, మహేష్తల.
 • బిష్ణుపూర్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాక్‌లో :- 11 గ్రామపంచాయితీలు, 2 పట్టణాలు ఉన్నాయి: బిష్ణుపూర్ ( దక్షిణ 24 పరగణాలు),, కన్యానగర్.
 • బిష్ణుపూర్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాక్‌ 2 లో :- 11 గ్రామపంచాయితీలు, 2 పట్టణాలు ఉన్నాయి: అంతల, చక్ ఎనాయత్ నగర్.
 • బుడ్జ్ బుడ్జ్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాక్‌లో :- 6 గ్రామపంచాయితీలు, 3 పట్టణాలు ఉన్నాయి: బలరాంపూర్, బుడ్జ్ బుడ్జ్, ఉత్తర రాయపూర్, బిర్లాపూర్.
 • బుడ్జ్ బుడ్జ్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాక్‌ 2 లో :- 11 గ్రామపంచాయితీలు, 2 పట్టణాలు ఉన్నాయి: చక్‌ కాషీపూర్, బోవాలి.
 • తాకూర్‌పూర్ మహేష్తల కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాక్‌లో :- 6 గ్రామపంచాయితీలు, 1 పట్టణం ఉన్నాయి: - చాత కాలికాపూర్.

బరుయీపూర్ ఉపవిభాగం మార్చు

బరుయీపుర్ ఉపవిభాగం 3 పురపాలకాలు, 7 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు ఉన్నాయి.

 • 3 పురపాలకాలు :- బతుయీపూర్, రాజ్పూర్ సోనాపూర్, జయానగర్ మజిల్పూర్.[3]
 • బరుయిపూర్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 19 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
 • భంగర్ -1 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 9 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలు 1 పట్టణం ఉన్నాయి:- భంగర్ రఘునాథ్‌పూర్.
 • భంగర్ -2 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 10 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
 • జయానగర్ -1 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 12 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
 • జయానగర్ -2 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 10 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
 • కుల్తలి కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 9 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
 • సోనాపూర్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 11 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
 • తాకూర్పూర్ మహేష్తల కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 6 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.

కానింగ్ ఉపవిభాగం మార్చు

కానింగ్ ఉపవిభాగంలో 4 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు ఉన్నాయి. నగరప్రాంతాలు లేవు.

 • బసంతి కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 13 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
 • కానింగ్ (దక్షిణ 24 పరగణాలు)-1 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 10 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
 • కానింగ్ (దక్షిణ 24 పరగణాలు) -2 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 9 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
 • కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 14 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.

డైమండ్ హార్బర్ ఉపవిభాగం మార్చు

డైమండ్ హార్బర్ ఉపవిభాగంలో డైమండ్ హార్బర్ పురపాలకం, 9 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులు ఉన్నాయి..

 • 1 పురపాలకం: డైమండ్ హార్బర్
 • డైమండ్ హార్బర్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 8 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
 • డైమండ్ హార్బర్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకు 2:- కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 8 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
 • ఫాల్టా కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 13 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
 • కుల్పి కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 14 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
 • మాగ్రహత్ - 1 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 11 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
 • మాగ్రహత్ - 2 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 14 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలు 2 పట్టణాలు ఉన్నాయి:- ఉత్తర కాలాస్, బిలాండపూర్.
 • మందిర్‌బజార్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 10 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
 • మథురాపూర్ -1 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 10 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
 • మథురాపూర్ -2 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 11 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.

కక్‌ద్వీప్ ఉపవిభాగం మార్చు

కక్‌ద్వీప్ ఉపవిభాగం కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 4 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.

 • కక్‌ద్వీప్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 11 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
 • నంఖానా కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 7 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
 • పతర్ప్రతిమ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 14 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
 • సాగర్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 9 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.

పార్లమెంటరీ నియోజకవర్గం మార్చు

జిల్లాలో పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి.[5]

 • 19-జయనగర్ (ఎస్.సి) పార్లమెంటరీ నియోజకవర్గాలు.
 • 20-మథురాపూర్ (ఎస్.సి) పార్లమెంటరీ నియోజకవర్గాలు.
 • 21-డైమండ్ హార్బర్ పార్లమెంటరీ నియోజకవర్గాలు.
 • 22-జాదవ్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గాలు.
 • 23- దక్షిణ కొలకత్తా పార్లమెంటరీ నియోజకవర్గాలు.

Assembly constituencies మార్చు

1997 to 2008 మార్చు

Based on the 1991 census, the district was divided into thirty-two assembly constituencies:[6]

 1. గోస్బా (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం సంఖ్య 100),
 2. బసంతి (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం సంఖ్య 101),
 3. కుల్తలి (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 102),
 4. జయ్నగర్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 136),
 5. బరుయిపూర్ పూర్బా (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 104),
 6. కానింగ్ పశ్చిమ్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 105),
 7. కానింగ్ పూర్బా (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 106),
 8. భంగర్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 107),
 9. జాదవ్పూర్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 108),
 10. సోనాపూర్ ఉత్తర (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 109),
 11. బిష్ణుపూర్, దక్షిణ 24 పరగణాలు (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ)' (. శాసనసభ నియోజకవర్గం ఏ 110),
 12. బిష్ణుపూర్, దక్షిణ 24 పరగణాలు (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 111),
 13. తూర్పు బెహ్ల (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 112),
 14. బెహ్ల పశ్చిమ్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 113)
 15. గార్డెన్ రీచ్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం సంఖ్య 114),
 16. మహేష్తల (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 115),
 17. బడ్జ్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 116)
 18. సాత్గచ్చియా (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 117),
 19. ఫాల్తా (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 118)
 20. డైమండ్ హార్బర్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 119),
 21. మాగ్రహట్ పశ్చిమ్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 120),
 22. తూర్పు మాగ్రహట్ (విధాన సభ నియోజకవర్గం) ప్రాచ్యం (ఎస్సీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 121),
 23. మందిర్‌బజార్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 122),
 24. మథురాపూర్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 123),
 25. కుల్పి (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 124),
 26. పథర్ప్రతిమ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 125),
 27. కాక్ద్వీప్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 126)
 28. సాగర్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 127),
 29. కబితీర్ధ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 147),
 30. అలీపూర్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 148),
 31. టాలీగంజ్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 150),
 32. ధకురియ (విధాన సభ నియోజకవర్గం) (శాసనసభ నియోజకవర్గం ఏ 151.).

షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) , షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మార్చు

 • షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు:-గోస్బా, బసంతి, కుల్తలి,కానింగ్ వెస్ట్, సోనాపూర్, బిష్ణుపూర్ తూర్పు, తూర్పు మగ్రహత్, మందిర్బజార్, కుల్పి శాసనసభ నియోజకవర్గాలు.
 • జాయ్నగర్ (లోక్ సభ నియోజకవర్గం):- గోస్బా, బసంతి, కుల్తలి, జయ్నగర్, కానింగ్ వెస్ట్, కానింగ్ ఈస్ట్ శాసనసభ నియోజకవర్గాలతో ఉత్తర 24 పరగణాలు నుండి 1 ఒక శాసనసభ నియోజకవర్గం.
 • జాదవ్పూర్ (లోక్ సభ నియోజకవర్గం):- బరుయీపూర్, జాదవ్పూర్, బిష్ణుపూర్ ఈస్ట్, బెహల ఈస్ట్, బెహల వెస్ట్, పశ్చిమ, మాగ్రహత్ కబితీర్థ శాసనసభ నియోజకవర్గాలు.
 • డైమండ్ హార్బర్ (లోక్ సభ నియోజకవర్గం:- బిష్ణుపూర్ వెస్ట్, గార్డెన్ రీచ్, మహేష్తల, బడ్జే బడ్జే సాత్గచియా, ఫాల్తా, డైమండ్ హార్బర్ నియోజకవర్గాలు.
 • మథురాపూర్ (లోక్ సభ నియోజకవర్గం):- మార్గహత్ ( ఈస్ట్), మందిర్బజార్, మథురస్పూర్, కుల్పి, పథర్ప్రతిమ, కక్‌ద్వీప్, సాగర్ నియోజక ప్రత్యేకించబడింది.
 • బసీర్హాట్ (లోక్ సభ నియోజకవర్గం):- ఉత్తర 24 పరగణాల జిల్లా నుండి ఆరు నియోజకవర్గాల్లో పాటు, భంగర్ శాసనసభ నియోజకవర్గాలు.
 • కొలకత్తా సౌత్ (లోక్ సభ నియోజకవర్గం):- కొలకత్తా, సోనాపూర్, అలీపూర్, టోలీగంజ్ నుండి మూడు శాసనసభ నియోజకవర్గాలు.

ధకురియా.

2008 నుండి మార్చు

పశ్చిమ బెంగాల్ రాష్ట్ర నియోజకవర్గాల 2008లో పునర్విభజన తరువాత జిల్లా 31 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. వీటిలో తూర్పు బరుయీపూర్, బసంతి, బిష్ణుపూర్, పశ్చిమ కన్నింగ్, గోసబా, కుల్తలి, జయ్నగర్, తూర్పు మాగ్రాహత్, మందిర్బజార్ నియోజక వర్గాలు షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు ప్రత్యేకించబడ్డాయి.

[7][8]

దక్షిణ 24 పరగణాలు జిల్లా 2008 పునర్విభజన ఆదేశం
లోక్‌సభ నియోజకవర్గాలు (ఎల్.ఎస్.సి)
జయ్నగర్ (పార్లమెంటరీ నియోజకవర్గం)
ఎల్.ఇ.సి
మాథుర్పూర్ (పార్లమెంటరీ నియోజకవర్గం )
ఎల్.ఇ.సి
డైమండ్ హార్బర్ (పార్లమెంటరీ నియోజకవర్గం )
ఎల్.ఇ.సి
జాదవ్పూర్ (పార్లమెంటరీ నియోజకవర్గం )
ఎల్.ఇ.సి
దక్షిణ కొలకత్తా (పార్లమెంటరీ నియోజకవర్గం )
ఎల్.ఇ.సి
శాసనసభ
నియోజకవర్గం
లేదు . శాసనసభ
నియోజకవర్గం
లేదు . శాసనసభ
నియోజకవర్గం
లేదు . శాసనసభ
నియోజకవర్గం
లేదు . శాసనసభ
నియోజకవర్గం
లేదు.
గోసబా (విధానసభా నియోజకవర్గం) 127 పతర్ఫతిమ (విధానసభా నియోజకవర్గం ) 130 డైమండ్ హార్బర్ (విధానసభా నియోజకవర్గం ) 143 Baruipur Purba (విధానసభా నియోజకవర్గం ) (ఎస్.సి) 137 కస్బ (విధానసభా నియోజకవర్గం ) 149
బసంతి (విధానసభా నియోజకవర్గం ) (ఎస్.సి) ]] 128 కాక్ద్వీప్ (విధానసభా నియోజకవర్గం ) 131 ఫల్త (విధానసభా నియోజకవర్గం ) 144 పశ్చిమ బరుయిపూర్ (విధానసభా నియోజకవర్గం ) 140 తూర్పు బెహ్ల (విధానసభా నియోజకవర్గం ) 153
కుల్తలి (విధానసభా నియోజకవర్గం ) (ఎస్.సి)]] 129 సాగర్ (విధానసభా నియోజకవర్గం ) 132 సర్గచ్చియా (విధానసభా నియోజకవర్గం) 145 Sonarpur Dakshin (విధానసభా నియోజకవర్గం ) 147 పశ్చిమ బెహ్ల (విధానసభా నియోజకవర్గం ) 154
జయనగర్ (విధానసభా నియోజకవర్గం ) (ఎస్.సి)]] 136 కుల్పి (విధానసభా నియోజకవర్గం ) 133 బిష్ణుపూర్ (దక్షిణ 24 పరగణాలు (విధానసభా నియోజకవర్గం ) (ఎస్.సి)]] 146 భంగర్ (విధానసభా నియోజకవర్గం ) 148 **
పశ్చిమ కన్నింగ్ (విధానసభా నియోజకవర్గం ) (ఎస్.సి) 138 రైడిఘి 134 మహేష్తల (విధానసభా నియోజకవర్గం) 155 జాదవపూర్ (విధానసభా నియోజకవర్గం ) 150 **
తూర్పు కన్నింగ్ (విధానసభా నియోజకవర్గం) 139 మందిర్‌బజార్ శాసనసభ నియోజకవర్గం (ఎస్.సి ) 135 బుడ్గే బుద్గే (విధానసభా నియోజకవర్గం ) 156 ఉత్తర సోనీపూర్ (విధానసభా నియోజకవర్గం) 151 **
తూర్పు మాగ్రహాట్ (విధానసభా నియోజకవర్గం ) (ఎస్.సి) 141 మగ్రహత్ పశ్చిమ్ (విధానసభా నియోజకవర్గం ) 142 మెటియాబురూజ్ 157 [[Tollyganj (విధానసభా నియోజకవర్గం ) 152 **

**కొలకత్తా నియోజకవర్గాలు.

2001 లో గణాంకాలు మార్చు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 8,153,176,[1]
ఇది దాదాపు. హాండూరాస్ దేశ జనసంఖ్యకు సమానం.[9]
అమెరికాలోని. వర్జీనియా నగర జనసంఖ్యకు సమం.[10]
640 భారతదేశ జిల్లాలలో. 6వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 819 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 18.05%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 949:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 78.57%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

వృక్షజాలం , జంతుజాలం మార్చు

1984లో దక్షిణ 24 పరగణాలు జిల్లాలో 1330 చ.కి.మీ వైశాల్యంలో " సుందర్బన్ నేషనల్ పార్క్ " ఏర్పాటుచేయబడింది. ఈ జిల్లా ఈ పార్కును ఉత్తర 24 పరగణాలు జిల్లాతో పంచుకుంటుంది. అంతేకాక జిల్లాలో 4 వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నాయి:- హాలిడే హైలాండ్ వన్యప్రాణి అభయారణ్యం, లోథియన్ ఐలాండ్ వన్యప్రాణి అభయారణ్యం, లోథిన్ ఐలాండ్ వన్యప్రాణి అభయారణ్యం, నరేంద్రపూర్ వన్యప్రాణి అభయారణ్యం, సజ్నాఖలి వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నాయి.[11]

సుందర్బన్ ఒకప్పుడు గంగానది మైదాన దిగువన ఉన్న విస్తారమైన అరణ్యం, ఉప్పునీటి చిత్తడి భూమిగా ఉండేది. ఈ ప్రాంతం ఉత్తర దిశలో బంగాళాఖాతం వెంట హుగ్లీ నది (ముఖద్వారం భారతదేశం) వరకు 260.కి.మీ.పొడవున ఉంది. ఈ ప్రాంతానికి తూర్పు భూభాగంలో మేఘనా నది (ముఖద్వారం బంగ్లాదేశ్) ఉన్నాయి. ఈ ప్రాంతం మొత్తం వైశాల్యం 100-130 చ.కి.మీ ఉంది. నదీ ముఖద్వారాలు కొండచరియలు, పలు కాలువలతో నిండిన చదునైన చిత్తడి నేలలు, దట్టమైన అరణ్యాలతో నిండి ఉంది. ఈ సహజమైన సౌందర్యం కారణంగానే ఈ ప్రదేశానికి సుందర్బని అని పేరు వచ్చి ఉండవచ్చు. ఈ చిత్తడినేలలలో ఉష్ణమండల వర్షారణ్యం దట్టంగా వ్యాపించి ఉంది. దక్షిణంలో వన్యమృగాలు, మొసళ్ళు నివసిస్తుంటాయి కనుక ఈ ప్రాంతంలో మానవనివాసాలు ఉండవు. బెంగాల్ పులుల చివరి అభయారణ్యం ఇదే. సారవంతమైన ఉత్తరప్రాంత వ్యవసాయ భూములలో వరి, చెరుకు, కొయ్య, వక్క తోటలు ఉన్నాయి.

ఈ ప్రాంతం పశువుల పెంపకానికి అనుకూలమైనది. గొర్రెలు, చినీ హాన్లు, మస్క్వీ బాతులు పెంచుతూ ఉంటారు. గరోల్ గొర్రెలను ప్రొజెనిటర్, బురూల షీప్ అంటారు. అయినప్పటికీ విలువైన దని ఉన్నిని స్థానికులు ఇంకా గుర్తించలేదు. బఖ్ఖలి రిసార్టులు క్రమంగా ప్రాముఖ్యత సంతరించుకుంటున్నాయి. కొలకత్తా నుండి ఇక్కడకు ప్రయాణవసతులు మెరుగుపరచబడ్డాయి. సుందర్బన్ అరణ్యాలు, చిత్తడి నేలలు పలు జంతుజాతులకు నివాసయోగ్యంగా ఉంది. ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన బెంగాల్ పులులకు సునర్బన్ పుట్టిల్లు. ఈ ప్రాంతపు నదీ ముఖద్వారాలు మొసళ్ళకు నివాసయోగ్యాలుగా ఉన్నాయి. ఇక్కడ పలు ప్రాంతాలలో బోటు టూర్లు ఏర్పాటు చేస్తుంటారు. యునెస్కో ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వసంపదగా ప్రకటించింది.

మూలాలు మార్చు

 1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Registrar General and Census Commissioner, India. 2011. Archived from the original on 2013-08-01. Retrieved 2013-05-28.
 2. Muazzam Hussain Khan (Banglapedia)
 3. 3.0 3.1 3.2 3.3 3.4 "District Profile". Official website of South 24 Parganas district. Archived from the original on 2009-02-07. Retrieved 2008-12-03.
 4. "Population, Decadal Growth Rate, Density and General Sex Ratio by Residence and Sex, West Bengal/ District/ Sub District, 1991 and 2001". West Bengal. Directorate of census operations. Retrieved 2008-12-03.
 5. "PARLIAMENTARY CONSTITUENCY MAP, South 24 Parganas". Archived from the original on 2012-03-22. Retrieved 2011-04-17.
 6. "General Election to the Legislative Assembly, 2001 – List of Parliamentary and Assembly Constituencies: West Bengal" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 2006-05-04. Retrieved 20 జూలై 2014.
 7. "Press Note, Delimitation Commission" (PDF). Assembly Constituencies in West Bengal. Delimitation Commission. Archived from the original (PDF) on 2013-05-29. Retrieved 2008-11-21.
 8. "Electors Details as on 30-10-2010: South 24 Parganas" (PDF). South 24 Parganas District. Archived from the original (PDF) on 2013-05-29. Retrieved 2014-07-20.
 9. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Honduras 8,143,564 {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
 10. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Virginia 8,001,024
 11. "Protected Area Network in India" (PDF). Ministry of Environment and Forests,Government of India. 1 September 2011. Archived from the original (PDF) on 28 మే 2013. Retrieved 20 జూలై 2014.

బయటి లింకులు మార్చు