దవనము
దవనము (ఆంగ్లం Dhavanam) ఒక సుగంధాన్నిచ్చే మొక్క. దీని శాస్త్రీయనామం ఆర్టిమీసియా పెల్లెన్స్ (Artemisia pallens). ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందినది. ఇది దక్షిణ భారతదేశంలో మాత్రమే పండించబడుతున్నది. దీనిని శీతాకాలంలోనే సేద్యం చేస్తారు. దీని కొమ్మల్ని మాలలో పువ్వుల మధ్య అలంకరిస్తారు.
దవనము | |
---|---|
దవనం | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | ఎ. పెల్లెన్స్
|
Binomial name | |
ఆర్టిమీసియా పెల్లెన్స్ |
ఉపయోగాలు
మార్చు- నిత్యం వాడే పూలమాలలొ ఎక్కువగా వాడుతారు.
- సౌందర్య సాధనాలలో, ఇతర ఔషధాల తయారీలో వాడుతారు.
- వివిధ సువాసనలు కల్గించు స్ప్రేలలో, ఆహార పరిశ్రమలో, పొగాకు పరిశ్రమలో దీనిని సుగంధాన్ని కలిగించడానికి వాడుతారు.
- దీనిని శక్తి వర్ధకంగా, ధాతువర్ధకంగా, చెవి నొప్పి, కీళ్లనొప్పులు, జీర్ణకోశ వ్యాధులలో ఉపయోగిస్తారు.
- దవనం ఆకులు పూల నుండిదవనం నూనెతయారు చేస్తారు.