దశరాజుపల్లి

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

దశరాజుపల్లె ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

దశరాజుపల్లి
గ్రామం
పటం
దశరాజుపల్లి is located in ఆంధ్రప్రదేశ్
దశరాజుపల్లి
దశరాజుపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 15°31′57.252″N 80°5′14.640″E / 15.53257000°N 80.08740000°E / 15.53257000; 80.08740000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంఒంగోలు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523 182.


గ్రామ భౌగోళికం

మార్చు

ఈ గ్రామం, ఒంగోలు పట్టణానికి 5కి.మీ. దూరంలో ఉంది. గ్రామ జనాభా=750.

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో పాలేటి శ్రీనివాసులు, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ అంకమ్మ తల్లి ఆలయం

మార్చు

ఈ గ్రామంలో, 2014, జూన్-15వ తేదీ ఆదివారం నాడు, అంకమ్మ తల్లి కొలువులు ఘనంగా నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక వాహనంపై అలంకరించి గ్రామోత్సవం, భక్తులు పొంగళ్ళు పెట్టి, మొక్కులు తీర్చుకున్నారు. దంపతులు సామూహిక వ్రతాలు నిర్వహించారు.

శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి విగ్రహం

మార్చు

ఒంగోలు మండలం, దశరాజుపల్లె రహదారిలోని అప్పాయికుంట వద్ద ఏర్పాటుచేసిన ఈ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015, మే నెల-6వ తేదీ బుధవారంనాడు, వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరంతోపాటు, పరిసర ప్రాంతాలనుండి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు. ఈ సందర్భంగా పదివేలమందికి పైగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ విగ్రహ ఏర్పాటుకు తె.దే.పా సీనియర్ నాయకులు శ్రీ కరణం బలరామకృష్నమూర్తి సహకారం అందించారు.

క్కడ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి 45 రోజులు అయిన సందర్భంగా, 2015, జూన్-17వ తేదీ బుధవారంనాడు, స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. మండలపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమ్మపాలెం గ్రామంతోపాటు దశరాజుపల్లె గ్రామం నుండి గూడా భక్తులు అధికసంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు.

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం

మార్చు

నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2015, మే నెల-22వ తేదీ శుక్రవరంనాడు, వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ, శ్రీ రాములవారు, సీతాదేవి, లక్ష్మణస్వామి వారల విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు. తొలుత ధ్వజశిఖరంపై కలశ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దశరాజుపల్లె గ్రామవాసులేగాక, చుట్టుప్రక్కల గ్రామాలనుండి గూడా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని, స్వామివారిని దర్శించుకొని, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.

గ్రామ విశేషాలు

మార్చు

2014, మే నెల 7న లోక్ సభకూ, శాసనసభకూ జరిగిన సార్వత్రిక ఎన్నికలలో, ఈ గ్రామంలో 92.76 శాతం ఓటర్లు, తమ ఓటు హక్కు వినియోగించుకొని, తమ ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారు. గ్రామంలో ఉన్న 539 మంది ఓటర్లలో 500 మంది ఆ రోజున, తమ ఓటు వేసినారు. ఈ గ్రామంలో ఎక్కువమంది ఉపాధికోసం హైదరాబాదు, బెంగుళూరు వంటి నగరాలకు వలస వెళ్ళినారు. వీరందరూ ఎక్కడ ఉన్నా, ఎన్నికలకు ఈ గ్రామానికి తరలి వచ్చి, తమ ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు