దాండేలి (దండేలి, డాండేలి అని కూడా పలుకుతారు) కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఒక పారిశ్రామిక పట్టణం. ఉత్తర భారతదేశానికి చెందిన వ్యాపారవేత్తలు పడమటి కనుమలులో (western ghats) దట్టమైన అటవీ మధ్యలో కాళీ నది ఒడ్డున అనేక పరిశ్రమలను స్థాపించడానికి 1950-55 కాలంలో వచ్చారు. కాగితపు కర్మాగారాలు, ఇనుప ఉత్పత్తులు, సాఫ్ట్‌వుడ్ కర్మాగారాలను ఏర్పాటు చేశారు. కాళీ నది ఒడ్డున ఉన్న ఈ ఊరు ఇప్పుడు పర్యాటకానికి ప్రాచుర్యం పొందింది.[1] దాండేలి దక్షిణ భారతదేశంలో జల క్రీడలకు ప్రసిద్ధి చెందింది, ముఖ్యంగా వైట్ వాటర్ అడ్వెంచర్ రాఫ్టింగ్‌కు (white water adventure rafting) ప్రసిద్ధి చెందింది.[2] [1] ఇంతే కాకుండా దాండేలి వణ్యప్రాణులకి ప్రసిద్ధి[3] ఇక్కడి అరణ్య ప్రాంతాన్ని అంశి ప్రాంతాన్ని కలిపి ప్రొజెక్ట్ టైగర్ రిజర్వ్గా,[4] తరువాత 2015 లో కాళీ టైగర్ రిజర్వ్ గా[5] పేర్కొనబడింది.

దాండేలి
పట్టణం (హిల్ స్టేషన్)
కావేరి నది ప్రవాహం
కావేరి నది ప్రవాహం
Nickname: 
గ్రీన్ సిటీ
దాండేలి is located in Karnataka
దాండేలి
దాండేలి
భారతదేశంలో కర్ణాటక
Coordinates: 15°16′01″N 74°37′01″E / 15.267°N 74.617°E / 15.267; 74.617
దేశంభారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాఉత్తర కన్నడ
తాలూకాదాండేలి
Government
 • Typeప్రజాస్వామ్య
 • Bodyపురపాలక సంఘం
విస్తీర్ణం
 • Total8.5 కి.మీ2 (3.3 చ. మై)
Elevation
472 మీ (1,549 అ.)
జనాభా
 (2011)
 • Total52,108 [1]
 • జనసాంద్రత6,269.06/కి.మీ2 (16,236.8/చ. మై.)
భాషలు
 • అధికారకన్నడ
 • ప్రాంతీయకన్నడ
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
581,325,581,362
ప్రాంతీయ ఫోన్‌కోడ్+91 8284
Vehicle registrationKA-65

జనాభా గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం పట్టణ జనాభా మొత్తం 52,069. అందులో పురుషులు 20,202, స్త్రీలు 25,867. మొత్తం జనాభాలో షెడ్యూలు కులానికి చెందినవారు 6,464,షెడ్యూలు తెగలు 1,688 ఉన్నారు.[6]

వివరణ

మార్చు
 
కాళీ నది

భారతదేశం నలుమూలల నుండి వచ్చిన వలసదారులు దాండేలి జనాభాలోని గణనీయమైన భాగం. వీరు ఉత్తరదక్షిణ భారత రాష్ట్రాలైన రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, బీహార్, గుజరాత్, ఆంధ్ర, తమిళనాడు, కేరళ నుండే కాకుండా కర్ణాటక రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి కూడావచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. కర్ణాటక అధికారిక భాష కన్నడ అయినప్పటికి దాండేలిలో ముఖ్యమైన వాడుక భాష హిందీ. అలాగే పండుగల్లో కూడా కన్నడ పండుగలే కాకుండ దసరా, రాంలీల, గణేష్ చతుర్థి, దీపావళి, రంజాన్, బక్రీద్ (ఈద్ అల్ అధా), హోళీ పండుగలు ఆ ఊరి జనాభా వైవిధ్యంను ప్రతిబింబిస్తుంది.[7]  

ఓల్డ్ (పాత) దాండేలి

మార్చు

1930 సంవత్సరం నాటికి, దాండేలి జనాభా 515 మాత్రమే. వీరు ప్రధానంగా అటవీ శాఖలో ఇంకా ప్రభుత్వ కలప మిల్లులో పని చేసేవారే. చాలా మంది నివాసీలు కొంకణి, దేవాలి, మరాఠాలు, కురుబా, లంబానీ, నీగ్రో, ముస్లిం వర్గాలకు చెందినవారు. ఈ స్థావరం కాళీ నది ఒడ్డున ఉంటూ ఒక పారిశ్రామిక పట్టణంగా అభివృద్ధి చెందింది. దీనికి ఇండియన్ ప్లైవుడ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ, లాల్భాయ్ ఫెర్రో-మాంగనీస్ ఫ్యాక్టరీ, వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్, ఇండియన్ సామిల్ లాంటి అనేక సంస్థలే కాకుండా, ఈ ఊరి చుట్టూ ఉన్న చిన్న చిన్న పరిశ్రమలు ఇంకా కాళీ నది వెంబడి వివిధ ప్రదేశాలలో విద్యుత్ ఉత్పత్తి చేసే ఆనకట్టల నిర్మాణంలో నిమగ్నమైన కర్ణాటక పవర్ కార్పొరేషన్ దాండేలిని అడవిలో ఉన్న ఒక ఊరిని పట్టణంగా తీర్చిదిద్దుతానికి కారకులు. ఆ పాత ప్రాంతాన్ని ఓల్డ్ దాండేలీ అని ఇప్పటికి పిలుస్తారు.

1936 వరకు ఇక్కడ పాఠశాల లేదు. శివాజీ నార్వేకర్, పుండాలిక్ పై, సదానంద్ గోపాల్ నడ్కర్ణి, బాలప్ప చవాన్, బాప్షెట్ అంతా కలిసి సమీప కొండపై ఒక గుడిసెలో ఒక గది పాఠశాల నిర్మించడానికి సహకరించారు. అక్కడ ఇప్పుడు ప్రభుత్వ ఉర్దూ పాఠశాల ఉంది. రామచంద్ర గణపట్ నాయక్ పాఠశాల నడుపుటకు గోకర్ణ సమీపంలోని సానికట్ట నుండి వలస వచ్చారు. పాఠశాల కేవలం 18 మంది విద్యార్థులతో ప్రారంభమైంది, వారిలో ముగ్గురు వారి గురువు ఆర్.జి.నాయక్ కంటే పెద్దవారు.1939 లో ఈ పాఠశాలను బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది.

పేరు వెనకున్న చరిత్ర

మార్చు

స్థానిక పురాణం ప్రకారం ఈ నగరానికి మిరాషి భూస్వాముల సేవకుడైన దండేలప్ప అనే ఒక యువకుని వల్ల వచ్చింది. అతను తన విధేయత కారణంగా ప్రాణాలు కోల్పోయిన తరువాత అతనిని స్థానికులు దేవతగా కొలవడం మొదలు పెట్టారు. ఈ ఊరికి అతని పేరుతో దాండేళీ, దాండేలి, దండేలీ అని పిలవబడసాగింది. ప్రత్యామ్నాయ పురాణం ప్రకారం, దండకనాయక అనే రాజు అడవుల గుండా వెళ్తూ ఈ ప్రాంతానికి తన పేరు పెట్టుకున్నాడు. ఇంకో కథనం ప్రకారం ఈ ప్రాంతంలో శ్రీ రాముడు సీతా లక్ష్మణులతో తిరిగిన దండకారణ్యం భాగం అని కూడా నమ్ముతారు. [8]

వన్యప్రాణుల అభయారణ్యం

మార్చు
 
హార్న్ బిల్ పక్షులు

పులులు, చిరుతపులులు, నల్ల పాంథర్లు, ఏనుగులు, గౌర్, జింకలు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులకు దాండేలి సహజ నివాస స్థలం.[9] [10] ఇది కర్ణాటకలోని రెండవ అతిపెద్ద వన్యప్రాణుల అభయారణ్యం. [10] దీనిని 2007 లో పులి సంరక్షణ కేంద్రంగా గుర్తించారు. [11] ఈ అడవిలో అనేక రకాల సరీసృపాలు, ఇంకా దాదాపు 300 రకాల పక్షులు ఉన్నాయి.  

దేవాలయాలు, మఠాలు

మార్చు
  • దాండేలప్ప ఆలయం (హాలియల్ రోడ్)
  • శ్రీ ఈశ్వర్ ఆలయం (ఓల్డ్ దాండేలి)
  • శ్రీ వీరభద్రేశ్వర్ ఆలయం (జెఎన్ రోడ్)
  • శివ మందిరం (కోగిల్‌బాన్ రోడ్))
  • మృత్యుంజయ్ మఠం (కాళీ నది సమీపున)
  • దత్తా మందిర్ (కోగిల్‌బాన్ రోడ్)
  • నాగదేవతా మందిరం (అంబేవాడి)
  • రామ్ మందిర్ (పేపర్ మిల్ కాలని)
  • బాలమూరి గణేష్ మందిర్ (గణేష్ గుడి రోడ్)
  • రాఘవేంద్ర స్వామి మఠం (టౌన్ షిప్)
  • శంకరాచార్య మఠం (టౌన్ షిప్)
  • వెంకటరమణ ఆలయం (కోగిల్బన్ రోడ్)
  • జగదంబ ఆలయం - సావ్జీ (మారుతి నగర్)
  • హనుమాన్ ఆలయం (జెఎన్ రోడ్)
  • సాయి బాబా ఆలయం (బశ్వేశ్వర్ నగర్, అంబేవాడి)

పాఠశాలలు

మార్చు
  • సేయింట్ మైఖేల్స్ కాన్వెంట్ స్కూల్ (ప్రైమరీ & హై స్కూల్)
  • రోటరీ స్కూల్ (ప్రైమరీ & హై స్కూల్)
  • జనతా విద్యాలయ
  • డి.ఎఫ్.ఏ స్కూల్
  • ఆంగ్లో ఉర్దూ హై స్కూల్ (ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ, దాండేలి)
  • ప్రభుత్వ పాఠశాల
  • కన్యా విద్యాలయ
  • తౌహీద్ ఎడ్యుకేషన్ సొసైటీ
  • బంగూర్ నగర్ హిందీ హయ్యర్ సెకండరీ స్కూల్ (దాండేలి ఎడ్యుకేషన్ సొసైటీ హిందీ స్కూల్)
  • బి.ఎల్.డి.ఈ ఎడ్యుకేషన్ సొసైటీ
  • ప్రభుత్వ పాఠశాల బిల్పార్, దాండేలి (ప్రాథమిక & ఉన్నత పాఠశాల)
  • బంగూర్ నగర్ కన్నడ ఉన్నత ప్రాథమిక పాఠశాల
  • ఆదర్శ్ విద్యాలయ పాఠశాల (అంబేవాడి)
  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (అంబేవాడి)
  • పరిద్యన్ స్కూల్

కళాశాలలు

మార్చు
  • దాండేలి ఎడ్యుకేషన్ సొసైటీ బంగూర్ నగర్ జూనియర్ కళాశాల
  • జనతా విద్యాలయ
  • తౌహీద్ ఎడ్యుకేషన్ సొసైటీ
  • ప్రభుత్వ కళాశాల, ఓల్డ్ దండేలి
  • కన్యా విద్యాలయ ప్రీ యూనివర్సిటి కళాశాల
  • కే.ఎల్.ఈ సొసైటీ'స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నర్సింగ్ సైన్సెస్
  • డి.ఈ.ఎస్ బంగూర్ నగర్ డిగ్రీ కళాశాల
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల (ఓల్డ్ దాండేలి)

స్థానిక దిన పత్రికలు

మార్చు

లోకాధ్వానీ, దక్కన్ హెరాల్డ్, ప్రజవాణి, విజయవాణి , కరవళి ముంజావు, కన్నడ జనంతరాంగ్, సయుక్త కర్ణాటక, తరుణ్ భారత్, టైమ్స్ ఆఫ్ ఇండియా, విజయ్ కర్ణాటక, దాండేలి నక్షత్రం (ఇప్పుడు లేదు) ఇక్కడి స్థానిక వార్తా పత్రికలలో ప్రధానమైనవి.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "ఉరకలెత్తిన ఉత్సాహం". www.eenadu.net. Retrieved 2020-05-04.
  2. "Dandeli Tourism - Book Resorts & Rafting - Direct Booking". www.dandeli.com. Retrieved 2020-03-12.
  3.   https://www.dandeli.com/about.php. వికీసోర్స్. 
  4.   https://www.nativeplanet.com/travel-guide/kali-tiger-reserve-near-dandeli-002876.html. వికీసోర్స్. 
  5.   https://www.deccanherald.com/state/anshi-dandeli-reserve-now-kali-tiger-reserve-499790.html. వికీసోర్స్. 
  6. "Dandeli (Uttara Kannada, Karnataka, India) - Population Statistics, Charts, Map, Location, Weather and Web Information". www.citypopulation.de. Retrieved 2020-05-04.
  7. https://www.yatra.com/india-tourism/dandeli/culture
  8. The word "Aranya" in Kannada language means "forest".
  9. "Fauna Dandeli-Anshi Tiger reserve". Archived from the original on 18 ఏప్రిల్ 2010. Retrieved 30 October 2010. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  10. 10.0 10.1 "Dandeli Wildlife Sanctuary Spotlight". The Hindu. Chennai, India. 17 February 2007. Archived from the original on 19 ఫిబ్రవరి 2007. Retrieved 30 October 2010. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  11. "State gets one more Project Tiger". The Hindu. Chennai, India. 17 January 2007. Archived from the original on 2 మార్చి 2007. Retrieved 30 October 2010. {{cite news}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=దాండేలి&oldid=4315743" నుండి వెలికితీశారు