దాముల్
ప్రకాష్ ఝా దర్శకత్వంలో 1985లో విడుదలైన హిందీ సినిమా
దాముల్, 1985 డిసెంబరు 31న విడుదలైన హిందీ సినిమా. ప్రకాష్ ఝా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అన్నూ కపూర్, శ్రీల మజుందార్, మనోహర్ సింగ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.[4] బీహార్ లోని గయ జిల్లాకు చెందిన శైవాల్ రాసిన కల్సూత్రా కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.[5]
దాముల్ | |
---|---|
దర్శకత్వం | ప్రకాష్ ఝా[1] |
రచన | శైవాల్ |
నిర్మాత | ప్రకాష్ ఝా[2] |
తారాగణం | అన్నూ కపూర్ శ్రీల మజుందార్ మనోహర్ సింగ్ |
ఛాయాగ్రహణం | రాజెన్ కొటారి |
సంగీతం | రఘునాథ్ సేత్ |
విడుదల తేదీ | 31 డిసెంబరు 1984 |
సినిమా నిడివి | 106 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹12 lakh (US$15,000)[3] |
కథా సారాంశం
మార్చుభూస్వామి కోసం దొంగగా మారిన బానిస కార్మికుడి గురించిన కథ ఇది. 1984లో బీహార్‌లోని గ్రామీణ ప్రాంతంలో నిర్మించిన ఈ సినిమా కుల రాజకీయాలు, ఈ ప్రాంతంలోని అట్టడుగు వర్గాల అణచివేతపై నేపథ్యంలో తీయబడింది. జీవనోపాధి కోసం బీహార్‌లోని పేద గ్రామస్తులు పంజాబ్ వంటి ధనిక రాష్ట్రాలకు భారీగా వలస వెళ్ళిన సమస్యను కూడా ఈ చిత్రం హైలైట్ చేస్తుంది.[6]
నటవర్గం
మార్చు- అన్నూ కపూర్
- శ్రీల మజుందార్
- మనోహర్ సింగ్
- దీప్తి నావల్
- రంజన్ కామత్
- ప్యారే మోహన్ సహయ్
- బ్రజ్ కిషోర్
- గోపాల్ శరణ్
- ఓం ప్రకాష్
- అన్నూ కపూర్
అవార్డులు
మార్చు- 1984: ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం
- 1985: ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ క్రిటిక్స్ అవార్డు
అంతర్జాతీయ ప్రశంసలు
మార్చుమాంట్రియల్, చికాగో, మాస్కో మొదలైన దేశాలలో జరిగిన చలన చిత్రోత్సవాలలో పోటీ, ప్రదర్శన విభాగాలకు దాముల్ సినిమా ఆహ్వానించబడింది.
మూలాలు
మార్చు- ↑ http://www.indianexpress.com/news/retrospective-of-prakash-jha-movies-in-fiji/660991/
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2021-06-18.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ Sharma, Sanjukta (4 June 2010). "'For film-makers politics is risky'". Mint. Retrieved 2021-06-18.
- ↑ "Damul (1984)". Indiancine.ma. Retrieved 2021-06-18.
- ↑ Interview Part I Archived 5 సెప్టెంబరు 2008 at the Wayback Machine passionforcinema.com.
- ↑ Damul One Hundred Indian Feature Films: An Annotated Filmography, by Shampa Banerjee, Anil Srivastava.