ప్రకాష్ ఝా
ప్రకాష్ ఝా భారతీయ సినిమా నిర్మాత, నటుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత.
ప్రకాష్ ఝా | |
---|---|
జననం | |
వృత్తి | నిర్మాత, నటుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 1982–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | దిశా ఝా (కుమార్తె) |
తల్లిదండ్రులు |
|
జననం, విద్య
మార్చుప్రకాష్ ఝా 1952, ఫిబ్రవరి 27న బీహార్ రాష్ట్రం, పశ్చిమ చంపారణ్ జిల్లాలోని బేతియాలో జన్మించాడు. తండ్రి పేరు తేజ్ నాథ్ ఝా. ప్రకాష్ సైనిక్ స్కూల్ తిలయ,[1] కోడెర్మా జిల్లాకేంద్రీయ విద్యాలయ నం. 1, బొకారో స్టీల్ సిటీ, జార్ఖండ్ లలో పాఠశాల విద్యను అభ్యసించాడు. తరువాత ఫిజిక్స్‌లో బిఎస్సీ (ఆనర్స్) చేయడానికి ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని రామ్‌జాస్ కాలేజీలో చేరాడు. ఒక సంవత్సరం తర్వాత తన చదువును వదిలివేసాడు.[2] ముంబై వెళ్ళి చిత్రకారుడు కావాలని నిర్ణయించుకున్నాడు. జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కోసం సిద్ధమవుతున్న సమయంలో ధర్మ సినిమా షూటింగ్‌ని చూసి ఫిల్మ్ మేకింగ్‌పై ఆకర్షితుడయ్యాడు. ముంబైలోని కెసి కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు.[3][4]
వ్యక్తిగత జీవితం
మార్చుప్రకాష్ కు నటి దీప్తి నావల్‌తో వివాహం జరిగింది. వారికి దత్తపుత్రిక (దిశా ఝా) ఉంది.[5][6]
సినిమారంగం
మార్చు1973లో పూణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలోని ఎడిటింగ్ కోర్సులో చేరాడు. విద్యార్థుల ఆందోళన కారణంగా సంస్థ కొంతకాలం మూసివేయబడగా, ప్రకాష్ బొంబాయికి వెళ్ళి, పనిచేయడం ప్రారంభించాడు. కోర్సు పూర్తి చేయడానికి తిరిగి వెళ్ళలేదు.[7]
"హిప్ హిప్ హుర్రే" (1984), దాముల్ (1984), మృత్యుదండ్ (1997), గంగాజల్ (2003), అపహరన్ (2005), రాజ్‌నీతి (2010), ఆరక్షన్ (2011) చక్రవ్యూహ (2012), సత్యాగ్రహ (2013), డర్టీ పాలిటిక్స్ (2015 ) వంటి రాజకీయ, సామాజిక-రాజకీయ సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఫేసెస్ ఆఫ్టర్ ది స్టార్మ్ (1984), సోనాల్ (2002) వంటి జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్న డాక్యుమెంటరీలను కూడా రూపొందించాడు.
ప్రకాష్ ఝా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు.[8] పాట్నాలో పి&ఎం మాల్, జంషెడ్‌పూర్‌లో పి&ఎం హైటెక్ సిటీ సెంటర్ మాల్‌ను ఏర్పాటు చేశాడు.[9]
సినిమాలు
మార్చు- శ్రీ వట్స్ (డాక్యుమెంటరీ)
- ఫేసెస్ ఆఫ్టర్ ది స్టార్మ్ (డాక్యుమెంటరీ)
- హిప్ హిప్ హుర్రే
- దాముల్
- కుడియాట్టం (డాక్యుమెంటరీ)
- ముంగేరిలాల్ కే హసీన్ సప్నే
- పరిణతి
- బండిష్
- మృత్యుదండ్
- దిల్ క్యా కరే
- రాహుల్
- సోనాల్ (డాక్యుమెంటరీ)
- గంగాజల్
- లోక్‌నాయక్
- అపహరన్
- ఖోయా ఖోయా చంద్
- రాజనీతి
- యే సాలి జిందగీ
- ఆరక్షన్
- చక్రవ్యూః
- సత్యాగ్రహ్
- క్రేజీ కుక్కడ్ ఫ్యామిలీ
- జై గంగాజల్
- సారే జహాన్ సే అచా (సిరీస్)
- సాంద్ కీ ఆంఖ్
- మట్టో కి సైకిల్
అవార్డులు
మార్చుజాతీయ చలనచిత్ర అవార్డులు
మార్చు- 1984: నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ నాన్-ఫీచర్ ఫిల్మ్: ఫేసెస్ ఆఫ్టర్ ది స్టార్మ్ (1984)[10]
- 1985: ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు: దాముల్ (1985)
- 1987: ఉత్తమ కళలు/సాంస్కృతిక చిత్రానికి జాతీయ చలనచిత్ర పురస్కారం: కుడిఅట్టం[11]
- 1988: ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ కోసం జాతీయ చలనచిత్ర అవార్డు: పరిణతి
- 1988: నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఇండస్ట్రియల్ డాక్యుమెంటరీ: లుకింగ్ బ్యాక్
- 2002: ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్ కోసం నేషనల్ ఫిల్మ్ అవార్డ్: సోనాల్[12]
- 2004: ఇతర సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు: గంగాజల్ (2003)[13]
- 2006: ఉత్తమ స్క్రీన్ ప్లేకి జాతీయ చలనచిత్ర అవార్డు: అపహరన్ (2005)
ఫిల్మ్‌ఫేర్ అవార్డులు
మార్చు- 2001: సంవత్సరపు ఉత్తమ డాక్యుమెంటరీ: ఫేసెస్ ఆఫ్టర్ ది స్టార్మ్ (1983)
- 1985: ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు: దాముల్ (1985)
- 2006: ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ డైలాగ్ అవార్డు: అపహరన్ (2005) [14]
స్టార్ స్క్రీన్ అవార్డులు
మార్చు- 2005: స్టార్ స్క్రీన్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు: అపహరన్
- 2011: స్టార్ స్క్రీన్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు: రాజ్‌నీతి
ఫిల్మ్‌ఫేర్ ఓటిటి అవార్డులు
మార్చుసంవత్సరం | వర్గం | పేరు | ఫలితం | |
---|---|---|---|---|
2021 | ఉత్తమ సిరీస్ - డ్రామా | ఆశ్రమం | ప్రతిపాదించబడింది | [15] |
ఉత్తమ దర్శకుడు - డ్రామా, సిరీస్ | ప్రతిపాదించబడింది |
ఐటా అవార్డులు
మార్చుసంవత్సరం | విభాగం | పేరు | ఫలితం | |
---|---|---|---|---|
2021 | ఉత్తమ ల్యాండ్‌మార్క్ ఓటిటి షో | ఆశ్రమం | గెలుపు | [16] |
మూలాలు
మార్చు- ↑ "Sainik Schools Society". Sainikschoolsociety.org. Retrieved 2023-07-14.
- ↑ "Prakash Jha : Hrishikesh Mukharjee cried after watching my film - PassionForCinema". 5 September 2008. Archived from the original on 5 September 2008. Retrieved 2023-07-14.
- ↑ Bollypedia. "Prakash Jha | Biography, Filmography, Gallery, Awards, Videos | Bollypedia". bollypedia.in. Retrieved 2022-02-16.
- ↑ "Our Prominent Alumni". KC College of Arts, Commerce & Science, Mumbai. Retrieved 2023-07-14.
- ↑ "Today's actors have become picky: Prakash Jha". hindustantimes.com. Archived from the original on 26 January 2013. Retrieved 2023-07-14.
- ↑ "Prakash Jha during the launch of Deepti Naval's book 'The Mad Tibetan'". Photogallery.indiatimes.com. Retrieved 2023-07-14.
- ↑ Prakash Jha The Cinemas of India, by Yves Thoraval. Macmillan India, 2000. ISBN 0-333-93410-5, ISBN 978-0-333-93410-4. Page 191-192.
- ↑ "Prakash Jha Productions". Prakashjhaproductions.com. Archived from the original on 2011-07-15. Retrieved 2023-07-14.
- ↑ Bose, Antara (3 August 2017). "Shopaholics, the big brands are coming". The Telegraph. Archived from the original on 12 February 2018. Retrieved 2023-07-14.
- ↑ "Prakash Jha Productions". Prakashjhaproductions.com. Archived from the original on 2017-11-10. Retrieved 2023-07-14.
- ↑ "Prakash Jha Productions". Prakashjhaproductions.com. Archived from the original on 2009-03-24. Retrieved 2023-07-14.
- ↑ "Prakash Jha Productions". Prakashjhaproductions.com. Archived from the original on 2019-06-26. Retrieved 2023-07-14.
- ↑ "Prakash Jha Productions". Prakashjhaproductions.com. Archived from the original on 2018-05-23. Retrieved 2023-07-14.
- ↑ "Prakash Jha". IMDb. Retrieved 2023-07-14.
- ↑ "My Glamm Filmfare OTT Awards 2021 - Nominations". FilmFare (in ఇంగ్లీష్). 2 December 2021. Retrieved 2023-07-14.
- ↑ "ITA Awards 2021 full winners list out. Surbhi Chandna and Pratik Gandhi win big". India Today (in ఇంగ్లీష్). Retrieved 2023-07-14.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ప్రకాష్ ఝా పేజీ