దార్-ఉల్-షిఫా
దార్-ఉల్-షిఫా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో ఉన్న యునానీ ఆసుపత్రి. 1595లో ఐదవ కుతుబ్ షాహీ రాజైన మహమ్మద్ కులీ కుతుబ్ షా దీనిని నిర్మించాడు.[1] హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
చరిత్ర
మార్చుమూసీ నది తీరానికి సమీపంలో ఇది నిర్మించబడింది. ఉర్దూ భాషలో దారుల్ అంటే ఇల్లు అని, షిఫా అంటే స్వస్థత అని అర్థంకాబట్టి, దీనిని స్వస్థత కేంద్రంగా కూడా పిలుస్తారు. హైదరాబాదు నగర నిర్మాణం ప్రారంభించిన ఐదేళ్ల తరువాత ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తి అయింది. నాలుగు శతాబ్దాల కిందట ప్రపంచంలోనే ప్రసిద్దిపొందిన మూడు ఆసుపత్రుల్లో ఒకటిగా ఇది నిలిచింది.[2]
ఆ కాలంలోని ప్రజలకు యునానీ వైద్యం మాత్రమే అందుబాటులో ఉండేది. దీనిలో వైద్యం అందించడానికి పర్షియన్ దేశాల నుండి వైద్యులను రప్పించేవారు. 400మంది రోగులకు ఒకేసారి ఉచితంగా మందులు అందించేవారు.
నిర్మాణం
మార్చుఆరువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ భవనంలో ఒక్కో అంతస్తులో 12 గదులు ఉండేవి. ఇన్-పేషెంట్స్ కోసం ఉత్తర దిక్కనున్న ఎత్తైన ప్రధాన ద్వారానికి ఇరువైపులా రెండు అంతస్తుల్లో ఎనమిది డబల్ బెడ్ రూంలు నిర్మించబడ్డాయి. అలాగే, ఉత్తరంవైపు ప్రధాన ద్వారం పక్కన ఔట్ పేషెంట్స్ కోసం వార్డును నిర్మించారు.
ఇతర వివరాలు
మార్చుకుతుబ్ షాహీల తరువాత హైదరాబాదు నగరాన్ని నిజాం ప్రభువుల్లో మొదటివాడైన నిజాం ఉల్ ముల్క్ (1762) పాలన వరకు దార్-ఉల్-షిఫా సమర్థవంతంగా నడిచింది. అటుతరువాత, రెండవ నిజాం కాలంలో దార్-ఉల్-షిఫా మూసివేయబడి, నిజాం సంస్థానంలో కలుపబడింది. దీని సమీపంలో అజాఖానా-ఇ-జహ్రా అనే ప్రార్థన మందిరం ఉంది.
మూలాలు
మార్చు- ↑ నమస్తే తెలంగాణ, నిపుణ విద్యావార్తలు (20 September 2017). "తానీషా గురువు ఎవరు?". Archived from the original on 5 April 2019. Retrieved 5 April 2019.
- ↑ దార్-ఉల్-షిఫా, ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 46