దాలప్ప తీర్థం అనేది రచయిత డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు రాసిన కథా సంపుటి. ఈ కథలన్నీ ఉత్తరాంధ్ర నుడికారంతో చకచకా సాగిపోతాయి. ఈ కథల్లో రచయిత విశాఖపట్నం జిల్లాలోని పల్లెల్ని, అగ్రహారాలను, అక్కడి ప్రజల జీవన విధానాన్ని ప్రస్తావిస్తారు. ఈ కథలను సమీక్షిస్తూ, సాక్షి ఫన్‌డే ఎడిటర్ ప్రియదర్శిని రామ్ మాట్లాడుతూ "ఒక రావిశాస్త్రి, పతంజలిని కలిపి ముద్ద చేస్తే వచ్చే పదార్థం చింతకిందిలా ఉంటుందేమో" అన్నారు. అలాగే ప్రముఖ రచయిత వాడ్రేవు చినవీరభద్రుడు మాట్లాడుతూ "ఒక చాసో, గురజాడ కథల్లో కనిపించే అమాయకమైన కవితాస్వప్నం చింతకింది కథల్లో కూడా కనిపించడం నాకెంతో సంతోషంగా ఉంది" అన్నారు.

ఈ కథలను విశాఖపట్నం జిల్లాలోని చోడవరానికి, నెల్లిమర్లకీ మధ్యలో కళిగాంధ్ర నడిబొడ్డులో జనం చెప్పుకుంటూ వస్తున్న కథలుగా భావించవచ్చు.

ఈ కథాసంపుటి చాసో పురస్కారాన్ని కైవసం చేసుకుంది.

కథలు

  • దాలప్ప తీర్థం
  • పాలమ్మ
  • శిఖండిగాడు
  • పిండిమిల్లు
  • పులి కన్నా డేంజర్
  • చల్దన్నం చోరీ
  • వానతీర్పు
  • నిదర్శనం
  • చిదిమిన మిఠాయి
  • రాజుగారి రాయల్ ఎన్‌ఫీల్డ్
  • గుడ్డముక్కలు
  • జలగల డాక్టరు

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు