దావులూరి పాలెం

(దావులూరు పాలెం నుండి దారిమార్పు చెందింది)

దావులూరిపాలెం, గుంటూరు జిల్లా కొల్లిపర మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

దావులూరు పాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
దావులూరు పాలెం is located in Andhra Pradesh
దావులూరు పాలెం
దావులూరు పాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°16′31″N 80°46′08″E / 16.275262°N 80.768831°E / 16.275262; 80.768831
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం కొల్లిపర
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522306
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్ర

మార్చు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

మార్చు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మార్చు

ప్రభుత్వ పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు

మార్చు

పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం.

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో కాటూరి శివకుమారి సర్పంచిగా ఎన్నికైంది

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ గంగానమ్మ తల్లి ఆలయo

మార్చు
  1. ఈ ఆలయప్రాంగణంలో, 2014, జూన్-22, ఆదివారం నాడు, ధ్వజస్తంభ ప్రతిష్ఠామహోత్సవం, శివాలయం నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. సూర్యోదయమే ఆలయంలో పూజాదికాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిష్ఠామహోత్సవంలో భక్తులు, నవధాన్యాలు, నాణేలూ, ముత్యాలు తదితర విలువైన వస్తువులను ఉంచారు. [3]
  2. ఈ ఆలయ ప్రాంగణంలో 2014, డిసెంబరు-7, ఆదివారం, మార్గశిర పౌర్ణమి నాడు, దాతల విరాళాలతో, రు. 15 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీ షిర్డీసాయి మందిరం, శివాలయ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. [4]

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు

మార్చు

గ్రామంలోని 400 కుటుంబాలలో, 200 కుటుంబాలు, పశుపోషణతో లబ్ధి పొందుచున్నవి. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం, పశుపోషకులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. లాభసాటి ధరలనందించుచూ తోడ్పాటునందించుచున్నది. ఆర్థిక సంవత్సరం ముగింపు తరుణంలో, ప్రోత్సాహకాలనందించుచున్నది. ఆపత్కాలంలో కుటుంబాలకు బీమానందించుచున్నది. చిన్నారుల విద్యాభివృద్ధికి ఉపకార వేతనాలనందించుచున్నది. మహిళా సాధికారతకు ఇతోధిక సాయమందించుచున్నది. 1995 లో ఈ సంఘానికి స్వంతభవన నిర్మాణం చేసుకున్నారు.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)