దాస్యం సేనాధిపతి

దాస్యం సేనాధిపతి (జననం: అక్టోబర్‌ 5 1955) తెలంగాణకు చెందిన కవి, కథా రచయిత, సాహితివేత్త.

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

దాస్యం సేనాధిపతి 1955 అక్టోబర్‌ 5న ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ పట్టణంలోని శాంతాదేవి, వెంకటస్వామి దంపతులకు జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిజి పూర్తిచేసారు.[1]

జీవిత విశేషాలు

మార్చు

1984లో జూనియర్‌ లెక్చరర్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. 2001లో డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా ఉద్యోగోన్నతి పొంది పెద్దపల్లికి చేరారు. 2013లో జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల నుండి ఉద్యోగ విరమణ చేసారు. అకాడమిక్‌ సలహాదారుగా, న్యాక్‌ రీసోర్స్‌ పర్సన్‌గానూ పనిచేశారు. ఉద్యోగ విరమణ అనంతరం శాతవాహన విశ్వవిద్యాలయం పరీక్షల విభాగానికి అడిషనల్‌ కంట్రోలర్‌గా పనిచేశారు. 2012లో కేంద్ర సాహిత్య అకాడమి సభ్యులుగా పనిచేశారు. ప్రస్తుతం సాహితీ గౌతమి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పలు పత్రికల్లో కాలమిస్టుగానూ పనిచేస్తున్నారు.ఇతని ప్రస్థానం ముందుగా లేఖలతో ప్రారంభమైంది. అనంతరం వ్యాసాల రూపంలోకి మారింది. ఆ తర్వాత ప్రముఖ సమీక్షకులుగా పేరు తెచ్చుకున్నారు. తదుపరి కవితలు రాయడంతో పాటు కథలకూ శ్రీకారం చుట్టారు. 1984-89 మధ్య వెయ్యికి పైగా లేఖలు రాశారు. అందులో ప్రధాన లేఖలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. వ్యాసాలు వెయ్యికి పైగా రాశారు. అవి కూడా పుస్తకరూపం దాల్చాయి. శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎం.ఎ (తెలుగు) విద్యార్థులకు ఆయన సమీక్షలపై పాఠ్యాంశం ఉంది.

రచనలు

మార్చు
  • నానీల సంపుటి చిటికెలు
  • అక్షరం సాక్షిగా
  • శబ్దలయ
  • సంవీక్ష
  • దర్శనం
  • సుహృల్లేఖ
  • నానీల కవుల డైరెక్టరీ
  • వ్యాస సంపుటి మధురాక్షరి
  • పరిష్కారం

పురస్కారాలు

మార్చు
  • విద్యా సరస్వతీ' పురస్కారం
  • అలిశెట్టి స్మారక పురస్కారం,
  • తడకమట్ల సాహితీ పురస్కారం
  • కాళోజీ పురస్కారం
  • దాశరథి పురస్కారం
  • జాషువా పురస్కారం

మూలాలు

మార్చు
  1. దాస్యం సేనాధిపతి. "అక్షరం సాక్షిగా.. దాస్యం సేనాధిపతి 'దర్శనం'". www.navatelangana.com. నవతెలంగాణ. Retrieved 16 October 2017.