దివ్యకృతి సింగ్
దివ్యకృతి సింగ్ (జ: 22 అక్టోబరు 1999) ఒక భారతీయ ఈక్వెస్ట్రియన్ (గుర్రపుస్వారీ క్రీడాకారిణి).[1] చైనాలోని హాంగ్జౌలో జరిగిన 2022 ఆసియా క్రీడలు లో ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్లో టీమ్ ఈవెంట్లో బంగారు పతకం గెలుచుకుంది.[2] ఆమె 2023 క్రీడలలో అత్యుత్తమ ప్రదర్శనకు గాను భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖచే ఈక్వెస్ట్రియన్లో అర్జున అవార్డు పొందిన మొదటి భారతీయ మహిళ.[3]
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
జాతీయత | భారతదేశం | ||||||||||||||
జననం | జైపూర్, భారతదేశం | ||||||||||||||
క్రీడ | |||||||||||||||
దేశం | భారతదేశం | ||||||||||||||
క్రీడ | ఈక్వెస్ట్రియన్ | ||||||||||||||
మెడల్ రికార్డు
|
ఆమె 12 సంవత్సరాల వయస్సు నుండి ఈక్వెస్ట్రియన్ క్రీడలలో పాల్గొంటుంది. జూనియర్ నేషనల్ ఈక్వెస్ట్రియన్ ఛాంపియన్షిప్స్, ఆల్ ఇండియా ఐపిఎస్సి ఈక్వెస్ట్రియన్ పోటీలు వంటి ఈవెంట్లలో అనేక వ్యక్తిగత, జట్టు పతకాలను అందుకుంది.[4]
ప్రారంభ జీవితం
మార్చుఆమె రాజస్థాన్ లోని జైపూర్ కు చెందింది. ఆమె రాజస్థాన్ లోని అజ్మీర్ లోని మాయో కాలేజ్ గర్ల్స్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసింది, భారతదేశంలోని ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని జీసస్ అండ్ మేరీ కాలేజ్ (జెఎంసి) నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.[5]
అవార్డులు
మార్చు- అర్జున అవార్డు 2023.
- 2023 అక్టేబరు 26న ఇండియా టుడే ఉమెన్ సమ్మిట్ అవార్డు.[6]
- హెచ్ హెచ్ మహారాజా సవాయ్ పద్మనాభ్ అవార్డు ఫర్ యంగ్ అచీవర్స్ ఫర్ స్పోర్ట్స్ ఫీల్డ్.[7]
మూలాలు
మార్చు- ↑ Rathore, Abhinay (1937-12-28). "Mundota (Thikana)". Rajput Provinces of India (in ఇంగ్లీష్). Retrieved 2024-01-29.
- ↑ "Asian Games 2023 Highlights: India win first equestrian gold medal in 41 years". The Times of India (in ఇంగ్లీష్). 2023-10-01. Retrieved 2024-01-29.
- ↑ "Full list of Arjuna Awards Winners 2023". India Today (in ఇంగ్లీష్). Retrieved 2024-01-29.
- ↑ Quint, The (2023-09-26). "Asian Games: Equestrian Team Win Historic First-Ever Gold For India in Dressage". TheQuint (in ఇంగ్లీష్). Retrieved 2024-01-29.
- ↑ Rawal, Urvashi Dev. "Vikram Rathore: The man who added professionalism to the glamour of Indian Polo". 30stades.com (in ఇంగ్లీష్). Retrieved 2024-01-29.
- ↑ "इंडिया टुडे - Woman Summit & Awards : शक्ति, साहस और सफलता का उत्सव". India Today Hindi (in హిందీ). Retrieved 2024-01-29.
- ↑ "Jaipur-First India News-Epaper". firstindia.co.in (in ఇంగ్లీష్). Retrieved 2024-01-29.