దివ్య మదర్నా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. 2018 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో ఓసియన్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.[1][2]

దివ్య మదర్నా
రాజస్థాన్ శాసనసభ సభ్యురాలు
In office
2018 డిసెంబర్ 11 – 2023 డిసెంబర్ 3
అంతకు ముందు వారుబహిరాం చౌదరి
తరువాత వారుబహిరాం చౌదరి
నియోజకవర్గంఒసియన్ శాసనసభ నియోజకవర్గం
జోధ్‌పూర్ జిల్లా కౌన్సిల్ సభ్యురాలు
In office
2010 నుండి 2018 వరకు
నియోజకవర్గంవార్డు నెంబర్ 11
వ్యక్తిగత వివరాలు
జననం (1984-10-25) 1984 అక్టోబరు 25 (వయసు 40)
జైపూర్ రాజస్థాన్ భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
నివాసంజైపూర్
కళాశాలపూణే విశ్వవిద్యాలయం
వృత్తివ్యవసాయ వేత్త రాజకీయ నాయకురాలు

రాజకీయ జీవితం

మార్చు

దివ్య మదర్నా రాజస్థాన్ మాజీ మంత్రి మహిపాల్ మదెర్నా లీలా మదెర్నా కుమార్తె.[3] ఆమె తాత పరస్రామ్ మదెర్నా కూడా రాజకీయ నాయకుడు, ఆమె తాత రాజస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశాడు.

దివ్య మదర్నా ఇంగ్లాండ్లోని నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పట్టాను అందుకుంది. 2010లో, 26 సంవత్సరాల వయస్సులో, దివ్య మదర్నా జోధ్పూర్లోని ఓసియన్లో జిల్లా మండలి ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించింది.[4] దివ్య మదర్నా 2018 లో రాజస్థాన్ శాసనసభ ఎన్నికలలో జోధ్పూర్ ఓసియన్ నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు.[5]

దివ్య మదర్నా 2023 రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో బిజెపికి చెందిన భేరా రామ్ చౌదరి చేతిలో ఓడిపోయారు.

మూలాలు

మార్చు
  1. "Return To The Raj". India Today (in ఇంగ్లీష్). Retrieved 2018-10-14.
  2. "General Elections to Assembly Constituencies: Trends & Results Dec-2023 Assembly Constituency 125 - Osian(Rajasthan)". results.eci.gov.in. Archived from the original on 2023-12-05. Retrieved 2023-12-04.
  3. "Divya Maderna reposes faith in Congress and Ashok Gehlot - Times of India". The Times of India. Retrieved 2018-10-14.
  4. "Return To The Raj". India Today (in ఇంగ్లీష్). Retrieved 2018-10-14."Return To The Raj". India Today. Retrieved 14 October 2018.
  5. "Rajasthan Assembly Election Results 2018: Divya Maderna, Mahendra Bishnoi keep their family legacies alive". DNA India.