దీపికా చిఖ్లియా
దీపికా చిఖ్లియా టోపివాలా, మహరాష్ట్రకు చెందిన టీవి సినిమా నటి, రాజకీయ నాయకురాలు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ సినిమాలలో నటించిన దీపిక, రామానంద్ సాగర్ రూపొందించిన టివి సీరియల్ రామాయణం[1]లో సీత పాత్రలో నటించి గుర్తింపు పొందింది. తెలుగులో 1989లో వచ్చిన యమపాశం, 1991లో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలలో నటించింది.[2]
దీపికా చిఖ్లియా | |
---|---|
లోక్‌సభ సభ్యురాలు | |
In office 1991–1996 | |
అంతకు ముందు వారు | ప్రకాష్ బ్రహ్మభట్ |
తరువాత వారు | సత్యజిత్సింగ్ గైక్వాడ్ |
నియోజకవర్గం | బరోడా |
వ్యక్తిగత వివరాలు | |
జననం | దీప్తి చిఖ్లియా ముంబై, మహారాష్ట్ర |
జాతీయత | భారతీయురాలు |
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ |
జీవిత భాగస్వామి | హేమంత్ టోపివాలా |
వృత్తి | నటి, రాజకీయ నాయకురాలు |
1991లో భారతీయ జనతా పార్టీ తరపున బరోడా లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యురాలు ఎన్నికయింది.
జననం
మార్చుదీపికా మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.
సినిమారంగం
మార్చు1983లో వచ్చిన సన్ మేరీ లైలా సినిమాలో తొలిసారిగా నటించిన దీపికా, రాజేష్ ఖన్నాతో రూపాయే దస్ కరోడ్, ఘర్ కా చిరాగ్, ఖుదాయి అనే మూడు హిందీ సినిమాలలో నటించింది.[3] మలయాళంలో మమ్ముట్టితో 1986లో ఇతిలే ఇనియుమ్ వరు సినిమా, కన్నడంలో శంకర్ నాగ్‌తో 1990లో హోస జీవన సినిమా, 1989లో అంబరీష్‌తో ఇంద్రజిత్ సినిమా, తమిళంలో ప్రభుతో 1992లో నంగల్ సినిమా, బెంగాలీ'లో ప్రోసెంజిత్ ఛటర్జీతో 1989లో ఆశా ఓ భలోబాషా సినిమాలో నటించింది.
2019 నవంబరులో వచ్చిన బాలా సినిమాలో పారి (యామీ గౌతమ్) తల్లిగా నటించింది.[4] స్వాతంత్ర్య సమరయోధురాలు - సరోజినీ నాయుడు బయోపిక్‌లో నటిస్తోంది.
వ్యక్తిగత జీవితం
మార్చుశింగార్ బిందీ, టిప్స్ అండ్ టోస్ కాస్మెటిక్స్ యజమాని హేమంత్ టోపివాలా[5]తో దీపిక వివాహం జరిగింది.[6] వారికి ఇద్దరు కుమార్తెలు నిధి టోపీవాలా, జుహీ టోపీవాలా ఉన్నారు.[7]
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా | భాష | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1983 | సన్ మేరీ లైలా | హిందీ | ||
1985 | పత్తర్ | హిందీ | ||
1986 | చెంప | హిందీ | ||
1986 | భగవాన్ దాదా | హిందీ | శాంతి | |
1986 | ఘర్ సన్సార్ | హిందీ | ||
1986 | ఇథిలే ఇనియుం వారు | మలయాళం | ప్రియా | |
1987 | రాత్ కే అంధేరే మే | హిందీ | సెక్సీ రోజీ | |
1987 | సజన్వా బైరి భైలే హమార్ | భోజ్‌పురి | ||
1989 | ఇంద్రజిత్ | కన్నడ | ఉష | |
1989 | ఘర్ కా చిరాగ్ | హిందీ | ఆశా | |
1989 | ఆశా ఓ భలోబాషా | బెంగాలీ | రూపా | |
1989 | యమపాశం | తెలుగు | ||
1990 | హోస జీవన | కన్నడ | శంకర్‌నాగ్ భార్యగా సీత | |
1990 | పెరియ ఇదాతు పిళ్లై | తమిళం | ||
1991 | కాల చక్ర | కన్నడ | ||
1991 | బ్రహ్మర్షి విశ్వామిత్ర | తెలుగు | ||
1991 | రూపాయే దస్ కరోడ్ | హిందీ | రవి కార్యదర్శి/హస్తినాపూర్ కి రాణి | |
1992 | నాంగల్ | తమిళం | ||
1994 | మేయర్ ప్రభాకర్ | కన్నడ | ||
1994 | ఖుదాయి | హిందీ | పద్మిని రాజ్ ఆనంద్ | |
1989 | జోడే రహేజో రాజ్ | గుజరాతీ | ||
1992 | లాజు లఖన్ | గుజరాతీ | ||
2018 | గాలిబ్ | హిందీ | ||
2018 | నటసామ్రాట్ | గుజరాతీ | ||
2019 | బాలా | హిందీ | సుశీల మిశ్రా (పరి తల్లి) |
మూలాలు
మార్చు- ↑ "Archived copy". Archived from the original on 15 September 2009. Retrieved 2022-03-12.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)CS1 maint: archived copy as title (link) - ↑ Chitrajyothy (27 May 2024). "ఆ సినిమా చేయకపోవడం వల్లే.. ఈ రోజు ఇంత గుర్తింపు". Retrieved 27 May 2024.
- ↑ "Ramayan's Sita aka Dipika Chikhalia's real life wedding was attended by this Bollywood superstar; see pic - Times of India".
- ↑ "'Bala': A cracker of a film, powered by 'hair' apparent Ayushmann Khurrana". www.telegraphindia.com (in ఇంగ్లీష్). Retrieved 2022-03-12.
- ↑ "Deepika Chikhalia". khabridost.in. Archived from the original on 13 March 2018. Retrieved 2022-03-12.
- ↑ "Hemant Topiwala: Executive Profile & Biography - Bloomberg". www.bloomberg.com. Retrieved 2022-03-12.
- ↑ "Where are they now? Deepika Chikhalia". Retrieved 2022-03-12.